Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశంలో దాగున్న పర్యాటక స్థలాలు !

దక్షిణ భారతదేశంలో దాగున్న పర్యాటక స్థలాలు !

By Mohammad

సెలవులు వస్తే, ఏదైనా కొత్త ప్రదేశాలకి వెళ్లాలనుకుంటారు పర్యాటకులు. అలాంటి వారికి ఉపయోగపడేదే ఈ వ్యాసం. ముఖ్యంగా మన దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాలు బాహ్య ప్రపంచానికి తెలియవు లేదా అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. వాటిలో కొన్ని మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నాయి. అక్కడి వాతావరణం కాలుష్యరహితంగా ఉంటూ, ప్రకృతితో మమేకమై ఆహ్లాదకరంగా ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో A to Z పర్యాటక ప్రదేశాలు !దక్షిణ భారతదేశంలో A to Z పర్యాటక ప్రదేశాలు !

ఇక్కడ చెప్పబడుతున్న ప్రదేశాలకు పర్యాటకులు కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను వెంట తీసుకొనిపోవచ్చు. బస, భోజనం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అవి అక్కడే గాని లేదా సమీప పట్టణాల్లో గాని లభిస్తాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే, ఈ ప్రదేశాలకు అన్ని రకాల మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. వాటిని కూడా అందిస్తున్నాం. మరి ఒక్కో ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో, అక్కడ ఏమి చూడవచ్చొ ఒకసారి గమనిస్తే ...

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

అతిరాప్పిల్లి కి సమీపాన ఉన్న విమానాశ్రయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 55 కి.మీ. దూరంలో కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్, ట్యాక్సీ అద్దెకు తీసుకొని అతిరాప్పిల్లి చేరుకోవచ్చు.

రైలు మార్గం

అతిరాప్పిల్లి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ లు త్రిస్సూర్(78 కి.మీ), కొచ్చి (66 కి. మీ), చలకుడి (31 కి. మీ). ఈ రైల్వే స్టేషన్ ల నుండి ప్రభుత్వ బస్సులో లేదా ప్రవేట్ బస్సులో ప్రయాణించి అతిరాప్పిల్లి చేరుకోవచ్చు.

బస్సు మార్గం

అతిరాప్పిల్లి కి బెంగళూరు, కొచ్చి, త్రిస్సూర్, చలకుడి పట్టణాల నుండి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Sajeesh Kumar

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం

ఏమి చూడాలి ?

అతిరాప్పిల్లి జలపాతం కేరళలో ప్రసిద్ధి చెందిన జలపాతం. ఈ జలపాతం చుట్టుప్రక్కల మరో రెండు జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో వలచల్ జలపాతం ఒకటి కాగా, మరోటి చర్ప జలపాతం. చర్ప ఫాల్స్ అతిరాప్పిల్లి నుండి త్రిస్సూర్ వెళ్లే మార్గంలో కలదు. స్యాంక్చురీ లు, తోటలు, ఉద్యాన వనాలు, బర్డ్ వాచింగ్ ఇక్కడి అదనపు ఆకర్షణలు.

బాహుబలి సినిమా షూటింగ్ ప్రదేశాలు

చిత్ర కృప : Bimal K C

మరావంతే

మరావంతే

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

మరావంతే సమీప విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 110 కి. మీ. దూరంలో కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ ల ను అద్దెకు తీసుకొని మరావంతే చేరుకోవచ్చు.

రైలు మార్గం

మరావంతే సమీప రైల్వే స్టేషన్ కుందా రైల్వే స్టేషన్. ఇది సుమారు 18 కి. మీ. దూరంలో కలదు. అలాగే మంగళూరు రైల్వే స్టేషన్ కూడా 110 కి. మీ. దూరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ నుండి ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి మరావంతే చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా మరావంతే చేరుకోవటానికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సమీప పట్టణాల నుండి నడిపిస్తుంది. గోవా, గోకర్ణం, బెంగళూరు నగరాల నుండి కూడా మరావంతే కు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : mayank kanyal

మరావంతే

మరావంతే

ఏమి చూడాలి ?

మరావంతే కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి కి 50 కి. మీ. దూరంలో, బెంగళూరు కి 450 కి. మీ. దూరంలో ఉన్న చిన్న పట్టణం. కుందాపూర్, మరావంతే బీచ్, ఆనె గుడ్డే వినాయక ఆలయం, కోడి బీచ్, ఒట్టినానే లు చూడదగ్గవి.

ఇండియాలో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

చిత్ర కృప : Riju K

ధనుష్కోడి

ధనుష్కోడి

ఎలా చేరుకోవాలి ?

ధనుష్కోడి కి 16 కి. మీ. దూరంలో ఉన్న రామేశ్వరం ప్రధాన రవాణా కూడలి. రామేశ్వరం చేరుకుంటే ధనుష్కోడి కి సులభంగా చేరుకోవచ్చు. కనుక ముందు మనం రామేశ్వరం చేరుకొనే మార్గాలు తెలుసుకుందాం ..!

వాయు మార్గం

మధురై దేశీయ విమానాశ్రయం రామేశ్వరానికి సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 170 కి. మీ. దూరంలో కలదు. ట్యాక్సీ లేదా క్యాబ్ లు అద్దెకు తీసుకొని రామేశ్వరం చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ధనుష్కోడి వెళ్ళవచ్చు.

రైలు మార్గం

రామేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, మధురై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నది. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి ధనుష్కోడి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

మధురై, కన్యాకుమారి, చెన్నై, ట్రిచి వంటి నగరాల నుండి రామేశ్వరానికి ప్రభుత్వ బస్సుల తో పాటుగా , ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : sathish jayagopal

ధనుష్కోడి

ధనుష్కోడి

ఏమి చూడాలి ?

ధనుష్కోడి రామేశ్వరం ద్వీపంలోని ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతం భారతదేశ చివరి ప్రాంతంలో కలదు. ఈ గ్రామం నుండి 3 కి. మీ ముందుకెళితే శ్రీలంకలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ రాముని బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణ. ఇప్పుడైతే లేదుకానీ బ్రిడ్జ్ ఆనవాళ్ళు మాత్రం కనిపిస్తాయి. బీచ్ కూడా చూడదగినది.

రామేశ్వరం - ఒక యాత్రా స్థలం !

చిత్ర కృప : Mike Prince

కుడ్లే బీచ్

కుడ్లే బీచ్

కుడ్లే బీచ్ గోకర్ణం లో ఉన్నది. ముందుగా గోకర్ణం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ..!

వాయు మార్గం

గోవా లోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం 140 కి. మీ. దూరంలో ఉండి గోకర్ణం పట్టణానికి సమీపంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ల మీదుగా గోకర్ణం చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోకర్ణం పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్న అంకోలా రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి స్థానిక బస్సులో లేదా ట్యాక్సీ లో ప్రయాణించి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

గోకర్ణం పట్టణానికి మార్గోవా, బెంగళూరు, మంగళూరు పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు ప్రతి రోజు నడిపే టూరిస్ట్ బస్ ల ద్వారా కూడా గోకర్ణం చేరుకోవచ్చు.

చిత్ర కృప : Harshith JV

కుడ్లే బీచ్

కుడ్లే బీచ్

కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన బీచ్ లుఏమి చూడాలి ?

గోకర్ణం పట్టణం నుండి కుడ్లే బీచ్ 2 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ బీచ్ కు గోకర్ణం నుండి రిక్షా లో చేరుకోవచ్చు. బీచ్ లోని తెల్లని ఇసుక, అందమైన తాటి చెట్ల వరుస, హోటళ్లు, గుడిసెలు మరియు స్థానిక రుచికర ఆహారాలు ఇక్కడి ఆకర్షణలు.

కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన బీచ్ లు

చిత్ర కృప : Sitabja Basu

హళేబీడ్

హళేబీడ్

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

హళేబీడ్ కు 170 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ మీదుగా హళేబీడ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

హళేబీడ్ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ హసన్ రైల్వే స్టేషన్. ఇది 27 కి. మీ. దూరంలో ఉన్నది. మంగళూరు, బెంగళూరు మరియు మైసూర్ వంటి ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కు రైళ్లు తిరుగుతుంటాయి. ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి హళేబీడ్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

బెంగళూరు, మంగళూరు, మైసూర్ మరియు సమీప పట్టణమైన హసన్ నుండి కూడా కర్నాటక రాష్ట్ర రోదు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తుంటాయి. కావున, పర్యాటకులు వాటిలో ఎక్కి హళేబీడ్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Praveen Raj

హళేబీడ్

హళేబీడ్

ఏమి చూడాలి ?

హళేబీడు ఒకప్పుడు హొయసుల రాజుల రాచరిక హంగులతో నిండిన ప్రాచీన నగరం అని చెప్పవచ్చు. సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా శిల్పాలను అందంగా చెక్కారు. హొయలేశ్వర దేవాలయం, కేదారేశ్వర దేవాలయం, శాంతలేశ్వర దేవాలయం, బెలవడి ఇక్కడ చూడదగ్గవి.

హళేబీడ్ సమీప సందర్శనీయ స్థలాలు !

చిత్ర కృప : divya.nayakBhat

పొన్ముడి హిల్స్

పొన్ముడి హిల్స్

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పొన్ముడి కి సమీపంలో 65 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి ట్యాక్సీ ల ద్వారా పొన్ముడి చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ పొన్ముడి కి సమీపంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి పొన్ముడి కి ట్యాక్సీ లో చేరుకోవచ్చు.

బస్సు / రోడ్డు మార్గం

తిరువనంతపురం కు పొన్ముడి కి రెగ్యులర్ గా ప్రభుత్వ , ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : vishwaant

పొన్ముడి హిల్స్

పొన్ముడి హిల్స్

ఏమి చూడాలి ?

పొన్ముడి అంటే మలయాళంలో బంగారు శిఖరం అని అర్థం. ఇది సముద్ర మట్టానికి 1100 మీ. ఎత్తున పడమటి కనుమల్లో విస్తరించి ఉన్నది. గోల్డెన్ వాలీ, పెప్పర వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, జూ ఇక్కడ చూడదగ్గవి. ట్రెక్కింగ్ ద్వారా పొన్ముడి శిఖరాన్ని అధిరోహించుట ఒక సాహస క్రీడ.

పొన్ముడి శిఖరం - ప్రకృతి నిలయం !

చిత్ర కృప : thejasp

సెయింట్ మేరీ ద్వీపాలు

సెయింట్ మేరీ ద్వీపాలు

సెయింట్ మేరీ ద్వీపాలు మాల్పే బీచ్ పట్టణంలో ఉన్నాయి. కనుక పర్యాటకులు మాల్పే చేరుకుంటే మేరీ ద్వీపాలను సులభంగా చేరుకోవచ్చు.

వాయు మార్గం

50 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం మాల్పే కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్, ట్యాక్సీ ల ద్వారా మాల్పే చేరుకోవచ్చు.

రైలు మార్గం

మాల్పే లో రైల్వే స్టేషన్ లేదు కానీ ఇక్కడికి 4 కి. మీ. దూరంలో ఉన్న ఉడిపిలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుండి ట్యాక్సీ, బస్సుల్లో ప్రయాణించి మాల్పే చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

ఉడిపి కేవలం 4 కి. మీ. దూరంలో ఉన్నది కాబట్టి మాల్పే కు నిత్యం రాష్ట్ర బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Shyam k

సెయింట్ మేరీ ద్వీపాలు

సెయింట్ మేరీ ద్వీపాలు

ఏమి చూడాలి ?

మాల్పే ద్వీపంలో ఉన్న సెయింట్ మేరీ ద్వీపాన్ని కోకనట్ ద్వీపంలో అని అంటారు. ఈ ద్వీపంలో నాలుగు ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలలో లావా వెదజల్లబడిన కొండ చరియలు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు బీచ్ అందాలూ ఆస్వాదించవలసినదే ...!

ఉత్తమ తీరులో ఉడిపి పర్యటన

చిత్ర కృప : Arun Prabhu

శివగంగ

శివగంగ

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

శివగంగ కు సమీప విమానాశ్రయం 60 కి. మీ. దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ల ద్వారా శివగంగ చేరుకోవచ్చు.

రైలు మార్గం

శివగంగ రైల్వే స్టేషన్ కు కేవలం 8 కి. మీ. దూరంలో ఉన్న డాబస్ పేట సమీప రైల్వే స్టేషన్. ఇది చిన్న స్టేషన్. సమీపంలో ఉన్న మరో ప్రధాన రైల్వే స్టేషన్ బెంగళూరు రైల్వే స్టేషన్ (మెజేస్టిక్). ఈ రైల్వే స్టేషన్ ల నుండి ట్యాక్సీ లేదా బస్సుల్లో ప్రయాణించి శివగంగ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

బెంగళూరు నుండి శివగంగ కొండలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బెంగళూరు నుండి తరచూ రోడ్డు రవాణా సంస్థల బస్సులను నడుపుతారు.

చిత్ర కృప : Manjeshpv

శివగంగ

శివగంగ

ఏమి చూడాలి ?

శివగంగ బెంగళూరు సమీపంలో ఉన్న చిన్న కొండ. ఇక్కడి కొండ మీద ఉన్న శివాలయం కారణంగా ఆ ప్రదేశానికి ఆ పేరొచ్చింది. గావి గంగాధేశ్వర గుహాలయం, హొన్నాదేవి ఆలయం, ఒలకల తీర్థ, పాతాలగంగ చూడదగ్గవి.

శివగంగ లో ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలు

చిత్ర కృప : Vijaya Kumar R

వర్కాల

వర్కాల

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

వర్కాల తిరువనంతపురం విమానాశ్రయం నుండి 55 కి. మీ. దూరంలో ఉన్నది. విమానాశ్రయం నుండి వర్కాల కు ట్యాక్సీ, క్యాబ్ మరియు బస్సుల్లో చేరుకోవచ్చు.

రైలు మార్గం

వర్కాల లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి కేరళ లోని అన్ని ప్రదేశాలను రైలు మార్గం ఉన్నది.

రోడ్డు మార్గం

వర్కాల కు కేరళలోని ప్రధాన నగరాల నుండి, తమిళనాడు లోని కొన్ని నగరాల నుండి బస్సులు కలవు. రెగ్యులర్ గా తిరువనంతపురం నుండి బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Dennis Kerzig

వర్కాల

వర్కాల

ఏమి చూడాలి ?

వర్కాల, కేరళ లోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న తీర పట్టణం. ఇక్కడి ప్రత్యేకత కొండల అంచులు అరేబియా సముద్రం తో కలుస్తాయి. ఆలయాలు, బీచ్ లు, సరస్సులు, మఠాలు, ద్వీపం, టన్నెల్ వంటివి ఇక్కడ చూడదగ్గవి.

వర్కాల లో సందర్శనీయ స్థలాలు !

చిత్ర కృప : Kerala Tourism

గండి కోట

గండి కోట

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

గండికోట కు సమీపాన ఉన్న ఏర్ పోర్ట్ కడప ఏర్ పోర్ట్. ఇది 77 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి గండికోట చేరుకోవచ్చు.

రైలు మార్గం

గండికోట లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ ఎర్రగుంట్ల. ఇది 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తాడిపత్రి(34 కి. మీ.), కడప(73 కి.మీ.) రైల్వే స్టేషన్ లు కూడా సమీపంలో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి గండికోట చేరుకోవచ్చు.

బస్సు మార్గం

జమ్మలమడుగు నుండి ప్రతిరోజు అర్ధగంటకోసారి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సు గండికోట బయలుదేరుతుంది. ప్రొద్దుటూర్ నుండి 35 కి. మీ. దూరంలో ఉన్న గండికోట చక్కని రోడ్డు మార్గాన్ని కలిగి ఉంది. కడప, సమీప పట్టాణాలైన తాడిపత్రి వంటి ఊర్ల నుండి కూడా గండికోట కు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, షేర్ ఆటో లు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Surya K

గండి కోట

గండి కోట

చూడవలసినవి

గండికోట జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల కొండల లోయల మధ్యలో ప్రవహించే పెన్నా నది దృశ్యం మనోహరంగా ఉంటుంది. కొండ మీద ఉన్న కోట, కోట లోని రంగనాథ ఆలయం, మాధవరాయ ఆలయం ఇక్కడ చూడదగినవి.

కడపలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలాలు !

చిత్ర కృప : andhratourism

పాపి కొండలు

పాపి కొండలు

చేరుకొను మార్గం

పాపి కొండలు చేరుకోవటానికి రాజమండ్రి ప్రధాన కూడలి. ఇక్కడి నుండి బస్సుల్లో రేవుల వద్దకి వెళితే అక్కడి నుండి బోట్ ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు బోట్ లో షికారు చేస్తూ పాపి కొండల సోయగాలను చూడవచ్చు. ముందు రాజమండ్రి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ..!

వాయు మార్గం

రాజమండ్రి కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుపూడి లో రైల్వే స్టేషన్ కలదు. క్యాబ్ లేదా ట్యాక్సీ మీదుగా రాజమండ్రి చేరుకొని, అక్కడి నుండి ప్రవేట్ ట్రావెల్ సంస్థల ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ పాపికొండల్లో ప్రయాణం చేయవచ్చు.

రైలు మార్గం

రాజమండ్రి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుండి కొన్ని ప్రవేట్ యాజమాన్యాల ద్వారా టూర్ ప్యాకేజీ లను మాట్లాడుకోని పాపికొండల్లో ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలైన విజయవాడ, కాకినాడ, ఏలూరు, వైజాగ్, గుంటూర్ వంటి పట్టణాల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Vamsi Mohan Reddy Pulagam

పాపి కొండలు

పాపి కొండలు

ఏమి చూడాలి ?

పాపి కొండల ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఇక్కడి వాతావరణం ఎండాకాలం, వానా కాలం, చలికాలం అనే తేడా లేకుండా చల్లగానే ఉంటుంది. పాపి కొండల్లో బోట్ విహారం, గుడిసెలు, గోదావరి నదిలో ప్రయాణిస్తూ అల్పాహారం,భోజనం చేయటం వంటివి మారుపురానివి. రాజమండ్రి లో దిగి ప్రవేట్ సంస్థలను ఆశ్రయిస్తే వారే అన్ని చూపిస్తారు.

పాపి కొండల్లో బోట్ ప్రయాణ జ్ఞాపకాలు !

చిత్ర కృప : Junkie Dude

స్కందగిరి

స్కందగిరి

వాయు మార్గం

స్కందగిరి కి 70 కి. మీ. దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. చిక్బల్లాపూర్ నుండి కేవలం 3 కి. మీ. దూరంలో ఉన్న ఈ కొండ కు చేరుకోవడానికి విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లు అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

రైలు మార్గం

స్కందగిరి కి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ యశ్వంతపుర రైల్వే స్టేషన్. ఇది 46 కి. మీ. దూరంలో ఉంటుంది. కర్నాటక బస్సుల్లో ప్రయాణించి లేదా ట్యాక్సీ అద్దెకు తీసుకొని కూడా స్కందగిరి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

స్కందగిరి చేరుకోవడానికి సమీపాన, 3 కి. మీ. దూరంలో ఉన్న ముఖ్య పట్టణం చిక్బల్లాపూర్. ఈ పట్టణానికి బెంగళూరు, హిందూపూర్, అనంతపూర్, పెనుగొండ, కోలార్ వంటి తదితర ప్రాంతాల నుండి బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Vivek Muthuramalingam

స్కందగిరి

స్కందగిరి

ఏమి చూడాలి ?

స్కందగిరి ని కలవర దుర్గా అని కూడా పిలుస్తారు. ఇది సముద్రమట్టానికి 1350 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుహలు, టిప్పూసుల్తాన్ కాలం నాటి పురాతన కోట ఇక్కడ చూడదగ్గవి.

బెంగళూరు చుట్టుప్రక్కల గల 25 ట్రెక్కింగ్ ప్రదేశాలు !

చిత్ర కృప : Suruchi Dumpawar

బెలుం కేవ్స్

బెలుం కేవ్స్

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బెలుం గుహలకు సమీపాన ఉన్న ఏర్ పోర్ట్ కడప ఏర్ పోర్ట్. ఇది 120 కి. మీ. దూరంలో ఉన్నది. కడప మీదుగా బనగానపల్లె లేదా తాడిపత్రి చేరుకొని ప్రభుత్వ బస్సుల్లో బెలుం గుహలకు చేరుకోవచ్చు.

రైలు మార్గం

బెలుం గుహలకు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ తాడిపత్రి. ఇది 30 కి. మీ. దూరంలో కలదు. చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు సైతం ఇక్కడి నుంచి ప్రయాణించవచ్చు. రైల్వే స్టేషన్ లో దిగి ప్రభుత్వ బస్సుల్లో బెలుం గుహలకు చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం విషయానికి వస్తే, కర్నూలు నగరం నుండి ప్రతిరోజు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. కర్నూలు నుండి బనగానపల్లె వరకు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి, అక్కడి నుంచి తాడిపత్రి వెళ్లే బస్సులో ఎక్కితే బెలుం గుహలకు చేరుకోవచ్చు.

చిత్ర కృప : surendra

బెలుం కేవ్స్

బెలుం కేవ్స్

ఏమి చూడాలి ?

బెలుం గుహలు దేశంలోనే రెండవ అతి పెద్ద గుహలు. గుహ లోపల కోటి లింగాలు, మండపం, సింహ ద్వారం, పాతాల గంగ మరియు కృతిమ కొలను చూడదగ్గవి. అలాగే గుహ పైకప్పు నుండి కిందకి వ్రేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను చూడవచ్చు. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతోంది.

బెలుంగుహలలో అబ్బురపరిచే దృశ్యాలు

చిత్ర కృప : Prashanth Pai

హొగెనక్కల్

హొగెనక్కల్

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ( 213 కి. మీ.) హొగెనక్కల్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని హొగెనక్కల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

హొగెనక్కల్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన మెట్టూర్ డామ్ ( 35 కి. మీ. దూరంలో), పాలక్కోడు ( 38 కి. మీ. ) లు కలవు. ఇక్కడి నుండి ట్యాక్సీ లేదా బస్సులో హొగెనక్కల్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం ద్వారా హొగెనక్కల్ సులభంగా చేరుకోవచ్చు. బెంగళూరు నుండి 2 - 3 గంటల్లో, చెన్నై నుండి 5 గంటల్లో బస్సుల ద్వారా వెళ్ళవచ్చు.

చిత్ర కృప : Prabhu Shankar

హొగెనక్కల్

హొగెనక్కల్

ఏమి చూడాలి ?

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన హొగెనక్కల్ ఓ ప్రసిద్ధ వారాంతపు జలపాతం. జలపాతం పక్కనే పారే కావేరి నది గలగలలు, ఫిషింగ్, స్థానిక మూలికాలు, పురాతా జ్ఞానాన్ని ఉపయోగించి చేసే మర్ధనలు ఇవన్ని కూడా హొగెనక్కల్ లో అనుభవించాల్సినవే! ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ కొరకిల్స్ పడవ రైడ్. ట్రెక్కింగ్, జలపాత సాహసాలు ఇక్కడి అదనపు ఆకర్షణలు.

బెంగళూరు నుండి హొగెనక్కల్ ఒక్కరోజు రోడ్ ట్రిప్ జర్ని

చిత్ర కృప : mithunkundu

అరకు లోయ

అరకు లోయ

వాయు మార్గం

అరకు వాలీ కి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ ఏర్ పోర్ట్ నుండి అద్దెకు ట్యాక్సీ లు, క్యాబ్ లు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ప్రభుత్వ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు.

రైలు మార్గం

అరకు వాలీ లో రైల్వే స్టేషన్ ఉంది. ప్రతిరోజు విశాఖపట్టణం నుండి ఉదయం 7 - 8 గంటల మధ్యలో ఒక రైలు బయలుదేరుతుంది. ఆది సుమారు 4 -5 గంటల తర్వాత అరకువాలీ చేరుకుంటుంది.

రోడ్డు మార్గం

అరకు వాలీ రోడ్డు ప్రయాణంలో ఎన్నో అందమైన దృశ్యాలను చూడవచ్చు. వైజాగ్ నుండి అరకు వాలీ కి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సులు తిరుగుతుంటాయి. ఏ పి టూరిజం వారి ఆధ్వర్యంలో కూడా అరకు వాలీ కి బస్సులు నడుస్తుంటాయి. ప్రవేట్ సంస్థలు కూడా డీలక్స్, ఏసీ వంటి బస్సులను నడిపిస్తారు.

చిత్ర కృప : Motographer

అరకు లోయ

అరకు లోయ

ఏమి చూడాలి ?

అరకు వాలీ, వైజాగ్ నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక హిల్ స్టేషన్. అక్కడ పండించే కాఫీ తోటల సువాసనలు వాలీ అంతటా వ్యాపించి ఉంటాయి. వాటర్ ఫాల్స్, బొటానికల్ గార్డెన్, మ్యూజియం, బొర్రా గుహలు, అనంతగిరి హిల్స్ ఇక్కడ చూడదగినవి.

అరకులోయ - మరుపురాని పర్యటన !

చిత్ర కృప : Sukanta Nath

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X