Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర భారత దేశపు అద్భుత పది జలపాతాలు !

ఉత్తర భారత దేశపు అద్భుత పది జలపాతాలు !

వర్షాకాలం ప్రవేశించింది. అయినప్పటికీ పర్యటనకు అడ్డంకి కాదు. పర్యటనలు నిలుపుకోనవసరం లేదు. వర్ష రుతువులో ప్రకృతి అందాలు మరింత పెరుగుతాయి. పర్యటనా ప్రదేశాలు పచ్చటి చెట్లతో, గల గల పారే అధిక నీటి జలపాతాలతో కనులకు విందు చేస్తాయి. అయితే, ఈ సమయంలో పర్యాటకులు తాము సందర్శించే ప్రదేశాలలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. కొండల ప్రాంతాలు ఈ సమయంలో నీటికి తడిసి జారే ప్రమాదాలు వుంటాయి. అట్లే, పర్యాటకులు వర్షం నుండి రక్షణ పొందేందుకు తమ దుస్తుల పట్ల, కనీస ఇతర అవసరాల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఎక్కడ అయినప్పటికీ జలపాత దృశ్యాలు అతి సుందరంగా వుంటాయి. ప్రస్తుతం ఈ వ్యాసంలో మీకు ఉత్తర భారదేశపు పది జలపాతాలు చిత్ర సమేతంగా పరిచయం చేస్తున్నాము, పరిశీలించండి, చూసి ఆనందించండి.

భాగ్సు జలపాక్తాలు

భాగ్సు జలపాక్తాలు

భాగ్సు జలపాతాలు ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి చెందిన జలపాతాలు. ఇవి మెక్లెఒద్ గంజ్ కు రెండు కి. మీ. ల దూరంలో కలవు. అందమైన ఈ జలపాతాల నుండి అర్ధ కిలో మీటర్ దూరంలో భాగ్సునాద్ టెంపుల్ కలదు. వర్షాకాలంలో ఈ జలపాతాలు సుమారు 30 అడుగుల ఎత్తులో ఒక గోడ వలే ఏర్పడి ప్రవహిస్తాయి. సందర్శకులు, కాలినడక లేదా ఆటో లేదా టాక్సీ లలో ఇక్కడకు చేరవచ్చు.
Photo Courtesy: Arpan Ganguly

చాచాయి జలపాతాలు

చాచాయి జలపాతాలు

చాచాయి జలపాతాలు ఉత్తర భారత దేశంలోని మధ్య ప్రదేశ్ లో ఒక ఆకర్షణీయమైన జలపాతాలు. ఈ జలపాతాలు సుమారు 130 మీటర్ల ఎత్తునుండి పడతాయి. ఈ జలపాతాలు తమసా నది ఉపనది అయిన బీహాద్ నది నుండి పుడతాయి. ఈ జలపాతాలు ప్రాంతాన్ని అంతా ఆహ్లాదకరంగా చేస్తాయి. ఈ జలపాతాలు ప్రసిద్ధి చెందిన చిత్రకూట్ కొండల చివరన కలవు. చిత్రకూట పర్వతాలకు పౌరాణిక విలువలు కలవని చెపుతారు.
Photo Courtesy: Kumar Chitrang

చిత్రకూట జలపాతాలు

చిత్రకూట జలపాతాలు

చిత్రకూట జలపాతాలను భారత దేశ నయాగరా జలపాతాలు అని పేర్కొంటారు. ఇండియా లో ఇవి అతి వెడల్పైన జలపాతాలు. ఇవి జగదల్ పూర్ కు సుమారు 38 కి. మీ. ల దూరంలో కలవు. రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. చత్తీస్ ఘర్ లో ని జలపాతాలలో ఇవి అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతాలు గా పేర్కొంటారు. చుట్టూ దట్టమైన అడవుల మధ్య అద్భుతంగా వుంటాయి. సుమారు 95 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతాలు చూసేందుకు వేలాది పర్యాటకులు వస్తారు. వర్షాకాలంలో ఇక్కడి నది పూర్తిగా ప్రవహిస్తూ జలపాతాల వెడల్పు మరింత అధికం చేస్తుంది.

Photo Courtesy: Iamg

కార్బెట్ జలపాతాలు

కార్బెట్ జలపాతాలు

ఉత్తర ఇండియా లోని అందమైన కార్బెట్ జలపాతాలు 60 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తాయి. ఇవి రాం నగర్ కు 86 కి. మీ. ల దూరంలో కలవు. ఇక్కడ కేమ్పింగ్, పిక్నికింగ్ మరియు బర్డ్ వాచింగ్ వంటివి చేయవచ్చు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు ఇక్కడి ఫారెస్ట్ డిపార్టుమెంటు చేపడుతుంది. పక్షుల కిల కిలలు , పచ్చటి ప్రదేశాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ కల ప్రకృతి దృశ్యాలను సందర్శకులు ఉచితంగా ఫోటోలు తీసుకొనవచ్చు. జలపాతాలలో జలకాలు ఆడవచ్చు.

Photo Courtesy: Chanchal Rungta

దస్సం జలపాతాలు

దస్సం జలపాతాలు

రాంచి కి సుమారు 40 కి. మీ. ల దూరంలో ఈ జలపాతాలు కలవు. ఈ జలపాతాలు కంచి నది ప్రవాహం లో పుడతాయి. అందమైన ఈ జలపాతాలు సుమారు 144 అడుగుల ఎత్తునుండి పడతాయి. ఇక్కడి నదీ ప్రవాహంలో లేదా జలపాతాలలో స్నానాలు చేయవద్దని మొసళ్ళు లేదా పాములు ఉంటాయని హెచ్చరికలు చేస్తారు.
Photo Courtesy: Ranchi Tourism

దౌందార్ జలపాతాలు

దౌందార్ జలపాతాలు

ఉత్తర భారత దేశంలో దౌందార్ జలపాతాలు ప్రసిద్ధి. ఇవి సుమారు పదిమీటర్ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతాలు నర్మదా నదీ నీటి ప్రవాహం కారణంగా ఏర్పడ్డాయి. సుందరమైన ఈ జలపాతాలు చక్కని మార్బుల్ రాళ్ళ గుండా ప్రవహించి పెద్ద శబ్దంతో అతి వేగంగా జలపాతాలవలె రూపొందుతాయి. అకస్మాత్తుగా పడే ఈ జలపాతాలు అక్కడ పొగమంచు పుట్టిస్తాయి. దౌ అంటే పొగ అని కనుక వీటికి దౌందార్ జలపాతాలు అని పేరు వచ్చిందని చెపుతారు. వేలాది పర్యాటకులు సంవత్సరం పొడవునా సందర్శనకు స్నేహితులు, బంధువులతో పిక్నిక్ లు కు వస్తూనే వుంటారు.
Photo Courtesy: Sandyadav080

దూద్ సాగర్ జలపాతాలు

దూద్ సాగర్ జలపాతాలు

ఉత్తర భారత దేశంలో దూద్ సాగర్ జలపాతాలు అత్యుత్తమ మైనవిగా పేర్కొంటారు. నాసిక్ సమీపంలోని సోమేశ్వర్ లో కల ఈ జలపాతాలు సుందరమైన దృశ్యంగా సుమారు పది మీటర్ల ఎత్తునుండి పడతాయి. ఈ ప్రదేశం ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ జలపాతాల దిగువ భాగం చేరేందుకు ఇక్కడ చక్కని మెట్లు కూడా కలవు.
Photo Courtesy: Kumar Chitrang

దూడుమా జలపాతాలు

దూడుమా జలపాతాలు

దూడుమా జలపాతాలను 'మత్స్య తీర్థ' అని కూడా చెపుతారు. ఇవి జీ పోర్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. దూడుమా జలపాతాలు మాచకుండ్ నది నుండి పుడతాయి. నార్త్ ఇండియా లోని సుందరమైన ఈ జలపాతాలు సుమారు 157 అడుగుల ఎత్తునుండి ప్రవహిస్తాయి. మాచ్ కుండ్ ప్రదేశం శ్రీ చైతన్య మహాప్రభు సందర్శించిన ఒక యాత్రా స్థలం. వర్ష రుతువులో ఈ జలపాతాలు మరింత అందంగా కనపడతాయి.
Photo Courtesy: Arpan Ganguly

ఎలిఫెంట్ జలపాతాలు

ఎలిఫెంట్ జలపాతాలు

ఎలిఫెంట్ జలపాతాలు ఉత్తర ఇండియా లోని ప్రసిద్ధ జలపాతాలలో ఒకటి. ఇవి షిల్లాంగ్ లో కలవు. ఈ జలపాతాలు మూడు అంచెలలో కిందకు పడతాయి. అక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో వుండటం చే బ్రిటిష్ వారు వీటికి ఎలిఫెంట్ జలపాతాలు అని పేరు పెట్టారు. ఈ రాతిలో కొంత భాగం 1897 లో వచ్చిన భూ కంపానికి ధ్వంసం అయింది. నల్లటి రాతి పై జలపాతాలు తెల్లగా పాల వలే ప్రవహిస్తాయి.
Photo Courtesy: Rocky Nelina

గిరా జలపాతాలు

గిరా జలపాతాలు

గిరా జలపాతాలు వర్ష రుతువులో తప్పక చూడ దగినవి. వాఘాయి టవున్ కు ఇవి 3 కి. మీ. ల దూరంలో కలవు. అంబిక నది లో పుట్టే ఈ జలపాతాలు సుమారు 30 మీ. ల ఎత్తు నుండి కింద పడతాయి. అందమైన ఈ జలపాతాల ప్రదేశానికి కార్లలో కూడా వెళ్ళవచ్చు. అనేకమంది ఇక్కడకు పిక్నిక్ లకు వచ్చి ఆనందిస్తారు.
Photo Courtesy: Kumar Chitrang

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X