Search
  • Follow NativePlanet
Share
» »24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?

24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?

By Staff

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం, తిరుపతి ముఖ్యమైనది. శ్రీశైలం శివ ఆరాధకులకు, తిరుపతి విష్ణు ఆరాధకులకు పేరుగాంచినవి. పండుగల సీజన్లో, వారాంతపు విహారాలలో, సెలవుదినాలలో, ఉత్సవాల సమయంలో ఈ రెండు పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి.

ఇది కూడా చదవండి : గోదావరి అలలపై మరుపురాని ప్రయాణం !

యాత్రికులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనిరావటానికి ఎంతకాదన్నా రెండుమూడు రోజుల సమయం పడుతుంది అవునా !! కానీ మీరు ఒక్కరోజులోనే శ్రీశైలం - తిరుపతి దర్శనాన్ని ముగించుకొని రావచ్చు తెలుసా ?? అవును. మీరు 24 గంటల్లోనే ఈ రెండు పుణ్యక్షేత్రాల దర్శనాన్ని ముగించుకొని రావచ్చు.

24 గంటల్లో ..!

24 గంటల్లో ..!

హైదరాబాద్, విజయవాడ నుండి 24 గంటల్లోనే శ్రీశైలం, తిరుపతి వెళ్లి వీఐపి దర్శనం చేసుకొని, అక్కడ అన్ని సౌకర్యాలను పొందవచ్చు.

చిత్రకృప : Pranayraj1985

హెలికాఫ్టర్

హెలికాఫ్టర్

ఈ అవకాశాన్ని ఎపి ప్రభుత్వం దేవాలయ ప్రాజెక్టు లో భాగంగా హెలికాఫ్టర్ సేవలను అందుబాటులో తీసుకువచ్చింది.

చిత్రకృప : Dinesh Kumar (DK)

ఆరుగురు ..!

ఆరుగురు ..!

హెలికాఫ్టర్ లో ఆరుగురు ప్రయాణించవచ్చు. ఢిల్లీ కి చెందిన సమ్మిట్ అంటే ఏవియేషన్ సంస్థ హెలికాఫ్టర్ సేవలను అందిస్తున్నది.

చిత్రకృప : oneindia telugu

మొత్తం ప్రభుత్వమే ..!

మొత్తం ప్రభుత్వమే ..!

హెలికాఫ్టర్ లో ప్రయాణించే భక్తులకు, యాత్రికులకు దర్శనం టికెట్, పూజల బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

ఉదయం 8 గంటలకు హెలికాఫ్టర్ విజయవాడలో బయలుదేరి, అరగంటలో శ్రీశైలానికి చేరుకుంటుంది.

చిత్రకృప : itsmaheshdesu Follow

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

శ్రీశైలం సున్నిపెంట హెలిపాడ్ నుండి భక్తులు కారులో ప్రయాణించి దేవాలయానికి చేరుతారు. అక్కడ అభిషేకాలు, పూజలు చేయిస్తారు.

చిత్రకృప : Dibyendu Jagatdev

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

పాతాళగంగ కు తాడు మార్గంలో తీసుకెళ్లి బోట్ షికారు చేయిస్తారు. అంతేకాదు, శ్రీశైలం చుట్టుపక్కల గల సుందర దృశ్యాలను కూడా చూపిస్తారు.

చిత్రకృప : Shishirdasika

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

12:30 pm కు తిరిగి సున్నిపెంట హెలిపాడ్ వద్దకు చేరవేస్తారు. అక్కడి నుండి 1:30 pm కు తిరుపతికి తీసుకెళ్తారు.

చిత్రకృప : OMNI FLYERS

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

అక్కడి నుండి కారులో తీసుకొని వెళ్లి తిరుచనూర్ పద్మావతి అమ్మవారి దేవాలయం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి దర్శనం చేయిస్తారు. రాత్రికి తిరుమలలో వసతి ఏర్పాటుచేస్తారు. మరుసటి రోజు ఉదయం తిరుపతి బ్రేక్ దర్శనం చేయిస్తారు.

చిత్రకృప : Vedamurthy.j

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

ఉదయం 7:30 గంటలకు హెలికాఫ్టర్ తిరుపతిలో బయలుదేరి 8:30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇదేతరహాలో హైదరాబాద్ - శ్రీశైలం- తిరుపతి మరో ప్యాకేజీ ఉంటుంది.

చిత్రకృప : Dinesh Kumar (DK)

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

శ్రీశైలం లో వేచి ఉండే 3 గంటలు, తిరుపతిలో సాయంత్రం 3 గంటలు జాయ్ రైడ్ లపేరుతో స్థానికులకు విహంగ వీక్షణం సదుపాయం కల్పించారు. ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కరికి రూ. 2500 గా ధర నిర్ణయించారు.

చిత్రకృప : oneindia

ప్రయాణం ఎలా ?

ప్రయాణం ఎలా ?

ప్రస్తుతానికి హైదరాబాద్, విజయవాడ నుండి శ్రీశైలానికి ఒకవైపు మాత్రమే ఒక్కొక్కరికి 14840 రూపాయలుగా ధర నిర్ణయించారు.

చిత్రకృప : oneindia

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X