Search
  • Follow NativePlanet
Share
» »కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !

కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !

కలకత్తా మహా నగరం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కూడాను. ఇక్కడ ఒక పర్యాటకుడు చూడవలసిన ప్రదేశాలు అనేకం కలవు. ఈ నగరాన్ని 'సిటీ అఫ్ జాయ్' అని కూడా పిలుస్తారు. దీనిని బట్టి ఈ నగరం ఒక పర్యాట కుడికి ఎన్ని ఆనందాలు ఇస్తుందనేది గ్రహించవచ్చు.

కలకత్తా నగరం లో ఎన్నో మతాల ప్రజలు. ఎన్నో కులాలు, ఎన్నో తెగలు. ఇక పర్యాటక ఆకర్షణలు అంటే, పురాతన మ్యూజియం లు, ప్లానేటోరియం లు, లైబ్రరీ లు, క్రికెట్ గ్రౌండ్ లు, ఫుట్ బాల్ స్టేడియం లు ఇంకనూ అనేక మత పర ప్రదేశాలు. వినోదం కలిగించే అమ్యూజి మెంట్ పార్క్ లు, నైట్ క్లబ్ లు అన్ని వయసులవారికి ఆనందం కలిగించే ప్రదేశాలు ఎన్నో కలవు.

కలకత్తా ను కల్చరల్ కేపిటల్ అఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇప్పటికి ఈ నగరంలో పురాతన కాలం నాటి డ్రామాలు ప్రదర్శిస్తారు. సినిమా హాల్స్ కంటే కూడా ఈ డ్రామా థియేటర్ లు ఇక్కడ ప్రసిద్ధి.

ప్రసిద్ధ స్వాతంత్ర పోరాట యోధులైన అరబిందో, సుభాస్ చంద్ర బోస్, స్వామి వివేకానంద, బి సి రాయ్ వంటి వారు కలకత్తా లో జన్మించిన వారే. అదే విధంగా ఈ నగరం అనేక మంది ప్రసిద్ధ సినీ దర్శకులు, గాయకులూ, నటీ నటులకు కూడా జన్మ నిచ్చింది.

మరి ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ కలకత్తా నగరం గురించి 25 అంశాలలో తెలుసుకుందాం. చిత్ర సహితంగా పరిశీలించండి.

కోల్కత్త హోటల్ వసతులకు క్లిక్ చేయండి

కాళీ ఘాట్

కాళీ ఘాట్

కాళీఘాట్ ఒక హిందూ టెంపుల్ కాళి ఘట్ట అనే పేరుపై కలకత్తా అనే పేరు ఏర్పడిందని చెపుతారు. ఇది హూగ్లీ నది ఒడ్డున ఏర్పడిన ఒక కెనాల్ సమీపంలో వుంటుంది. పవిత్ర దినాలలో ఈ టెంపుల్ కు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు.

Photo Courtesy: shankar s.

మైదాన్

మైదాన్

మైదాన్ ను బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ అని కూడా అంటారు. కలకత్తా లో ఇది ఒక అతి పెద్ద ప్రదేశం. దీనిలో అనేక ప్లే గ్రౌండ్ లు కలవు. క్రికెట్, హాకీ , ఫుట్ బాల్ వంటి ఆటలు ఆడతారు. సైనిక కవాతులు కూడా జరుగుతాయి. ఇక్కడ కల కొలను లలో దోభీ లు తమ బట్టలు కూడా శుబ్రపరుస్తారు. నగర పౌరులు తమ మార్నింగ్ వాక్ వంటివి ఆచరిస్తారు.
Photo Courtesy: Manoj Menon

విక్టోరియ మెమోరియల్

విక్టోరియ మెమోరియల్

విక్టోరియా మెమోరియల్ ను 1906 - 1921 ల మధ్య నిర్మించారు. ఇది క్వీన్ విక్టోరియా పేరుపై నిర్మితం అయింది. ఇపుడు ఇది ఒక మ్యూజియం. ఇది మైదాన్ గ్రౌండ్ లో హూగ్లీ నది ఒడ్డున కలదు. దీనిని తాజ్ మహల్ నిర్మాణ శైలి లో మకరాన మార్బుల్ రాతి తో నిర్మించారు. నిర్మాణ తీరు కొంత మేరకు తాజ్ మహల్ నిర్మాణం పోలి వుంటుంది. పర్యాటకులు ఇక్కడ కల తోటలలో కూడా విహరించవచ్చు.

Photo Courtesy: Manoj Menon

పార్క్ స్ట్రీట్

పార్క్ స్ట్రీట్

పార్క్ స్ట్రీట్ ప్రదేశాన్ని మదర్ తెరిస్సా సరణి అంటారు. అతి పురాతన కాలంనుండి కలకత్తా మహానగర్ రాత్రి జీవనం వినోదాలు అంటే వివిధ గాయకుల, సంగీత కారుల ప్రదర్శనలు ఇక్కడ సాగాయి. ఈ ప్రదేశంలో అనేక రెస్ట రెంట్ లు, పబ్ లు రుచి కర ఆహారాలతో ఆనందపరుస్తాయి. కలకత్తా నగరంలో ఈ ప్రదేశం ఒక ప్రధాన వాణిజ్య మరియు వినోద ప్రదేశం. దీపావళి, క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భాలలో విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ వుంటుంది.

Photo Courtesy: Manoj Menon

హౌరా బ్రిడ్జి

హౌరా బ్రిడ్జి

హౌరా బ్రిడ్జి హూగ్లీ నది పే వేలాడే ఒక బ్రిడ్జి. హౌరా నగరాన్ని కలకత్తా నగరంతో కలుపుతుంది. దీనికి నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ్ టాగూర్ పేరు పెట్టారు. అయినప్పటికీ హౌరా బ్రిడ్జి గా నే పిలుస్తారు. ఇది ప్రపంచంలో ఆరవ పొడవైన వంతెన. ఈ బ్రిడ్జి ని అనేక హిందీ చలన చిత్రాలలో కూడా షూట్ చేసారు.

Photo Courtesy: Partha Sarathi Sahana

బుర్రా బజార్

బుర్రా బజార్

ఒకప్పుడు చిన్నపాటి టెక్స్ టైల్ మార్కెట్ గా వుండే ఈ ప్రదేశం ఇపుడు కలకత్తా లో అతి పెద్ద వాణిజ్య కేంద్రం గా వుంది. ఈ షాపింగ్ కేంద్రంలో అన్ని రకాల షాపింగ్ ప్రియులకు అన్ని వస్తువులు లభిస్తాయి. దీపావళి వంటి ప్రత్యేక సందర్భాలలో ఈ బజార్ అతి బిజీ గా వుంటుంది. మీరు కోరే, విగ్రహాలు, దుస్తులు, విద్యుత్ లైట్ లు వంటివి అనేకం ఇక్కడ లభిస్తాయి. ఈ ప్రదేశం ఎల్లపుడూ కొనుగోలు దారులతో బిజి గా వుంటుంది.

Photo Courtesy: Praveen Kaycee

జోరాసంకో ఠాకూర్ బారి

జోరాసంకో ఠాకూర్ బారి

ఈ భవనం ఠాకూర్ కుటుంబ పురాతన నివాసంమరియు రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మ స్థలం. ఇది ప్రస్తుతం రవీంద్ర భారతి యూనివర్సిటీ కేంపస్ లో కలదు. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రామాలే కాక, ఠాగూర్ జన్మ మరియు మరణ జయంతో త్సవాలు కూడా నిర్వహిస్తారు.
Photo Courtesy: Chanchal Rungta

చైనా టవున్

చైనా టవున్

బ్రిటిష్ కాలంలో ఈ పట్టణం అభివృద్ధి సమయంలో అంటే 18 - 19 శతాబ్దాలలో కొంతమంది చైనీయులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత వారు ఇక్కడ నుండి కదిలి కలకత్తా తూర్పు ప్రాంతానికి వెళ్ళారు. నేటికీ కొంతమంది ఇక్కడ వుండి అనేక రెస్ట రెంట్ లు నడుపడం తో ఈ ప్రదేశానికి చైనా టవున్ అనే పేరు వచ్చుఇంది. ఇక్కడ రెస్ట రెంట్ లలో రుచికర చైనా వంటకాలు రుచి చూడవచ్చు.
Photo Courtesy: jliptoid

ఇండియన్ మ్యూజియం

ఇండియన్ మ్యూజియం

కలకత్తా లోని ఇండియన్ మ్యూజియం ను 1814 లో స్థాపించారు. ఇది ఒక అతి పురాతన మ్యూజియం. దీనిలో అనేక పురాతన వస్తువులు, ఆయుధాలు, ఆభరణాలు, ఆస్థి పంజరాలు, మమ్మీలు, మొఘల్ పెయింటింగ్ లు ప్రదర్శిస్తారు.

Photo Courtesy: Manoj Menon

సైన్సు మ్యూజియం

సైన్సు మ్యూజియం

సైన్సు మ్యూజియం లో స్పేస్ ఒడిస్సీ, డినా మోషన్, ఎవల్యూషన్ థీం పార్క్, ౩ డి విషణ్ థియేటర్, మిర్రర్ మేజిక్ మరియు అనేక వస్తువులు స్పేస్ సైన్సు , మోషన్, ఎలక్ట్రిసిటీ లకు సంబంధించి ప్రదర్శిస్తారు.

Photo Courtesy: Praveen Kaycee

బొటానికల్ గార్డెన్స్

బొటానికల్ గార్డెన్స్

హుగ్లీ నది ఒడ్డున నగరానికి 8 కి. మీ. ల దూరం లో కల ఈ గార్డెన్స్ 273 ఎకరాలలో విస్తరించి వున్నాయి. దీనిని 1787 లో స్థాపించారు. సుమారు 12,000 వృక్ష జాతులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కల పెద్ద మర్రి చెట్టు ప్రధాన ఆకర్షణ. అందమైన , ఆకర్షణీయమైన తోటలు, పూవులు చూడవచ్చు. ఈ గార్డెన్ లో ఒక లైబ్రరీ కూడా కలదు. అరుదైన వృక్ష జాతులు ఇక్కడ కలవు.

Photo Courtesy: McKay Savage

ఆలిపోర్ జంతు ప్రదర్శనాలయం

ఆలిపోర్ జంతు ప్రదర్శనాలయం

దీనిని కలకత్తా జు అని కూడా అంటారు. ఈ జూ 1876 నుండి ప్రదర్శించ బడుతోంది. ఇక్కడ కల అల్దబ్రా జైంట్ తాబేలు, పేరు అద్వైత సుమారు 250 సంవత్సరాలకు పైగా జీవించి 2006 లో మరణించింది. ఈ జంతు ప్రదర్శనాలయంలో వివిధ రకాల వన్య జీవులే కాక, అనేక వృక్ష జాతులను, పక్షులను కూడా, చూడవచ్చు. పిల్లలతో వచ్చే కుటుంబాలకు ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.

Photo Courtesy: Koshy Koshy

దుర్గా పూజ

దుర్గా పూజ

కలకత్తా పేరు చెప్పగానే చాలా మందికి దుర్గా మాత పూజ గుర్తుకు వస్తుంది. దసరాలలో జరిగీ దుర్గా మాత పూజ ఎంతో అట్టహాసంగా చేస్తారు. ఈ పూజ సుమారు 16 వ శతాబ్దంనుండి ఇక్కడ చేయబడుతోందని చెపుతారు. ఈ నవరాత్రి పండుగ ఏర్పాట్లు సుమారు ఒక నెల ముందు నుండి ఇక్కడ జరుగుతాయి. ఈ సమయంలో కలకత్తా వచ్చే వారికి నగరం అంతా పండుగ వాతావరణం కనపడుతుంది.

Photo Courtesy: Srijan Kundu

మెట్రో రైల్

మెట్రో రైల్

కలకత్తా లోని అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ రవాణా 1984 నుండి అమలులో కలదు. నగరం లో ఒక మూల నుండి మరో మూలకు ఈ మెట్రో రైలు సిస్టం లో ప్రయాణించి ఆనందించవచ్చు. పర్యాటకులు తప్పక ప్రయాణించి ఆనందించ దగిన ఆకర్షణ.

Photo Courtesy: shankar s.

ట్రాం

ట్రాం

కలకత్తా లో కల ట్రాం రవాణా లో ప్రయాణించటం ఒక ప్రత్యేకత. సిటీ లో తిరిగే ఈ ఎలక్ట్రిక్ ట్రాం లు ఆసియా లో అతి పురాతనమైనవి. ఈ ఎలక్ట్రిక్ కార్ లలో సుమారు 200 మంది ప్రతి కార్ లోను(60 మంది కూర్చోనవచ్చు) ప్రయాణించవచ్చు. సిటీ లోని ఆకర్షణలు తేలికగా చూసేందుకు ఈ ట్రాం లు ఎంపిక చేయవచ్చు.
Photo Courtesy: Rajarshi Roychowdhury

రిక్షా

రిక్షా

కలకత్తా నగరం లో మనుషులు చేతితో లాగే రిక్షాలు కూడా ఒక ప్రత్యేకత. ఈ రిక్షాలో ఇరువురు మాత్రమే కూర్చోనవచ్చు. వీటిని వస్తువుల రవాణాకు కూడా ఉపయోగిస్తారు. వర్షాకాలంలో ఈ రిక్షాలు మంచి రవాణా సాధనము. వీటిని అధికంగా రిప్పన్ స్ట్రీట్, న్యూ మార్కెట్ లలో చూడవచ్చు. నేటి రోజులలో మనిషి చేతితో లాగె ఈ రిక్షాలు తొలగించ వలెనని వాటి స్థానంలో సైకిల్ రిక్షాలు ప్రవేశ పెట్టాలని కూడా అనేక డిమాండ్ లు రావటంతో ప్రభుత్వం ఈ డిమాండ్ లను పరిగణిస్తోంది.

Photo Courtesy: Nomad Tales

ఝాల్ మూరి

ఝాల్ మూరి

ఝాల్ మూరి అనే ఈ చిరు తిండి మన ప్రాంతంలో ఘాటు గా వుండే మర మరాల మసాలా. దేనిలో ఉప్పు, ఉల్లి, కొత్తిమీర, పచ్చి మిరప, టమాటో వంటివి కలిపి అతి రుచికరంగా సాయంత్రం చిరుతిండి గా విక్రయిస్తారు. చాలామంది ఆఫీస్ ల నుండి సాయంత్రాలు తిరిగి వచ్చేసమయంలో ఈ చిరుతిండి ని తినటమే కాదు, ఇంటి లోని సభ్యులకు కూడా తీసుకుని వెళతారు. పర్యాటకులు ఈ ఝాల్ మురి తప్పక తిన వలసినదిగా సిఫార్సు చేస్తున్నాము.
Photo Courtesy: Praveen Kaycee

ఫిష్

ఫిష్

బెంగాల్ ఆహారాలలో చేపకు అధిక ప్రాధాన్యత కలదు. ప్రతి ప్రదేశంలోను చేప వంటకాలు అధికం. కూర గా, వేపుడుగా, ఇతర ఆహారాలతో కలిపి కూడా చేప ను వీరు ఆరగిస్తారు. ఈ చేపలు, వివిధ రకాలు మరియు వివిధ సైజులలో వుండి వంటకాలలో అధిక రుచి కలిగిస్తాయి. చేప ఆహారాలు తినే వారు, కలకత్తా నగర పర్యటనలో ఈ చేప వంటకాలు తప్పక తిని తీరాలి. Photo Courtesy: Manoj Menon

బిర్యాని

బిర్యాని

కలకతా లోని బిర్యాని వంటకం నవాబుల బిర్యానిగా ప్రసిద్ధి కెక్కింది. ఈ బిర్యానిలో మాంసం ముక్కలతో పాటు, బంగాళా దుంపలు ముక్కలు కూడా వేసి బహు రుచికరంగా తయారు చేస్తారు. ఇతర బిర్యానిఏ ల వాలే ఘాటు మసాలాలు లేకుండా, కలకత్తా బిర్యాని కమ్మగా వుంటుంది. కలకత్తా నగర పర్యటనలో కలకత్తా బిర్యాని తప్పక తిన వలసిన రుచికర ఆహారంగా చెప్పవచ్చు.

Photo Courtesy: Manoj Menon

రసగుల్లా

రసగుల్లా

కలకత్తా అక్కడ తయారు అయ్యే తియ్యనైన రసగుల్లా లకు ప్రసిద్ధి. స్థానిక ప్రజలు వీటిని అధికంగా తింటారు. రసగులాలు బెంగాలీ సంస్కృతిలో ఒక భాగంగా పరిగనిస్తారు. నగరంలోని ప్రతి దుకాణం ఈ స్వీట్ లను విరివిగా అమ్ముతుంది. ఈ రసగుల్లాలు తయారు అయిన వెంటనే, వేడి వి గా తింటే మరింత రుచి కరంగా కూడా వుంటాయి.

Photo Courtesy: Biswarup Ganguly

ఫుట్ బాల్

ఫుట్ బాల్

ఫుట్ బాల్ క్రీడా కలకత్తా లో ప్రసిద్ధ క్రీడా. ఈ నగరంలో ఆసియా లో ప్రసిద్ధి చెందిన ఫుట్ బాల్ క్లబ్ లు కలవు. కలకత్తా లో 1898 లో స్థాపించిన కలకత్తా ఫుట్ బాల్ లీగ్ ఆసియా లో అతి పురాతనమైనది. ఇక్కడి ఆటగాళ్ళ రక్తంలో ఫుట్ బాల్ ఆసక్తి ప్రతి రక్తనాళం లోనూ ప్రవహిస్తుంది. అనేకమంది పిల్లలు, యువకులు ఇక్కడ కల మైదాన్ గ్రౌండ్ లలో ఉదయం వేళఎంతో శ్రద్ధ తో ఆడటం గమనించవచ్చు.

Photo Courtesy: Dipanker Dutta

ఈడెన్ గార్డెన్స్

ఈడెన్ గార్డెన్స్

ఈడెన్ గార్డెన్స్ అనేది ఒక క్రికెట్ స్టేడియం. ఇది ఇండియాలో సీటింగ్ ఏర్పాట్లలో అతి పెద్ద స్టేడియం మరియు ప్రపంచంలో మూడవ అతి పెద్దది. ఈ స్టేడియం లో స్థానిక క్రికెట్ మ్యాచ్ లు మాత్రమే కాక, అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లు, వన్ డే మ్యాచ్ లు కూడా జరుగుతాయి. ఎ మ్యాచ్ జరిగినప్పటికీ స్టేడియం అంతా పూర్తిగా నిండి పోతుంది. దీని కెపాసిటీ సుమారు ఒక లక్ష సీట్ ల వరకు వుంటుంది.

Photo Courtesy: Chippu Abraham

కల్కొతా నైట్ రైడర్స్

కల్కొతా నైట్ రైడర్స్

కొలకత్తా నైట్ రైడర్స్ అనే ఈ క్రికెట్ జట్టు కలకత్తా కు చెందినది. ఇది బాలి వుడ్ నటుడు షా రుఖ్ ఖాన్ కంపెనీ కి చెందినది. బెంగాలీలు ఈ టీం ను తమ నగరానికి ఒక గర్వ కారణంగా భావిస్తారు. ఈ టీం ఇతర టీం ల తో ఆడి గొప్ప విజయాలు సాధించినది.

Photo Courtesy: Connormah

నోబెల్ ప్రైజ్ గెలుపొందిన వారు

నోబెల్ ప్రైజ్ గెలుపొందిన వారు

వివిధ రంగాలలో నోబెల్ ప్రైజ్ పొందిన బహుమతి గ్రహీతలు కలకత్తా జన్మ స్థానంగా కలరు. మెడిసిన్ లో రోనాల్డ్ రాస్ సాహిత్యంలో రవీంద్రనాథ్ టాగూర్ ఫిజిక్స్ లో డాక్టర్ సి.వి. రామన్, సేవలో మదర్ తెరిస్సా ఆర్ధిక శాస్త్రంలో డా. అమార్త్య సేన్ వంటి వారు కొలకత్తా కు చెందినా వారే.

Photo Courtesy: Playing Futures: Applied Nomadology

ట్రాఫిక్

ట్రాఫిక్

చివరగా, కలకత్తా లో సాధారణంగా అందరూ చూసేది నగరంలోని ట్రాఫిక్. అక్కడి నివాసితుల కంటే అధిక సంఖ్యలో వాహనాలు కలవని చెపుతారు. హెవీ ట్రాఫిక్ కారణంగా వాహనాలు నిలబడటం, సమయం వ్యర్ధం కావటం, ఆక్సిడెంట్ లు జరగటం మొదలైన అసౌకర్యాలు, అధిక కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ జీవనం సాఫీగా సాగిపోతూ వుంటుంది.

Photo Courtesy: Stefan Krasowski

కొలకత్తా అధిక ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X