Search
  • Follow NativePlanet
Share
» »హిమగిరి సొగసులను అందుకోవడానికి

హిమగిరి సొగసులను అందుకోవడానికి

హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాల గురించి కథనం.

ట్రెక్కింగ్. యువతను బాగా ఆకట్టుకొంటున్న సహస పర్యాటకం. ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవారు, అందులో కొంత అనుభవం సాధించనవారు హిమాలయాల్లోని పలు ట్రెక్కింగ్ మార్గాల్లో ప్రయాణించాలని ఉవ్వీళ్లూరుతూ ఉంటారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ కొంత కఠినంగా ఉంటుంది. అంతేకాకుండా వాతావరణం కూడా మనకు పరీక్షపెడుతుంది. అయితే నిపుణుల పర్యవేక్షణలో ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇక్కడ ట్రెక్ చేయడానికి అనుకూలం. అందువల్ల చాలా మంది ఈ సమయంలో ఇక్కడకు ట్రెక్కింగ్ కు వెలుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో ముఖ్యమైన ట్రెక్కింగ్ మార్గాల వివరాలు మీ కోసం...

అన్నపూర్ణ బేస్ క్యాంప్

అన్నపూర్ణ బేస్ క్యాంప్

P.C: You Tube

హిమాలయాల్లోని అన్నపూర్ణ బేస్ క్యాంప్ సెప్టెంబర్ లో ట్రెక్ చేయాలనుకొనేవారి మొదటి ఎంపిక. కొంత కఠినమైన ఈ మార్గంలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగులుస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉండటమే కాకుండా సెప్టెంబర్ లో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ ట్రెక్కింగ్ సాగుతుంది.

కువారీ పాస్

కువారీ పాస్

P.C: You Tube

నందాదేవి అభయారణ్యంలో కువారీ పాస్ ట్రెక్కింగ్ సాగుతుంది. మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగే ఈ ట్రెక్కింగ్ లో అంతరించే స్థితికి చేరుకుంటున్న ఎన్నో అందమైన, అరుదైన పక్షులను, జంతువులను వాటి సహజ ఆవాసాల్లో చూడటానికి వీలవుతుంది.

గోముఖ్ తపోవన్

గోముఖ్ తపోవన్

P.C: You Tube

కొంత కఠినమైన ట్రెక్ మార్గం గోముఖ్ తపోవనం. హిమాలయాల్లోకెల్లా అంతమైన పర్వత శిఖరంగా పేర్కొనే భగీరథీ పర్వత శిఖరం ఈ మార్గంలో మనకు ఎదురుపడుతుంది. దీనితో పాటు మౌంట్ శివలింగ్, మౌంట్ సుదర్శన్, మౌంట్ మేరు వంటి పర్వత శిఖరాలను దాటుకొంటూ మొత్తం 8 రోజుల పాటు ఈ ట్రెక్కింగ్ కొనసాగుతుంది.

చంద్రశిల శిఖరం

చంద్రశిల శిఖరం

P.C: You Tube

మిగిలిన హిమాలయాల ట్రెక్ తో పోలిస్తే ఇది కొంత భిన్నంగా ఉంటుంది. చుట్టూ మంచుపర్వతాలే కాకుండా మనకు పచ్చని చెట్లు కూడా కనిపిస్తాయి. ఈ మార్గంలో మనకు అత్యంత అరుదైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరిగే రెడ్ రాడో పుష్పాలు ఆహ్వానం పలుకుతాయి. మొత్తం ఆరు రోజుల పాటు ఈ ట్రెక్ కొనసాగుతుంది.

రూప్ కుండ్

రూప్ కుండ్

P.C: You Tube

ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా ఈ రూప్ కుండ్ మార్గంలో వెళ్లాలనుకొంటారు. అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ట్రెక్ మరిచిపోలేని అనుభూతులను మిగులుస్తుందనడంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఈ మార్గంలో ఒకవైపు తెల్లటి మంచు కొండలు, మరోవైపు పచ్చని ఫైన్ చెట్లు మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X