Search
  • Follow NativePlanet
Share
» »నీముచ్ : అన్వేషించే పర్యాటకులకు సరికొత్త ప్రదేశం !

నీముచ్ : అన్వేషించే పర్యాటకులకు సరికొత్త ప్రదేశం !

By Mohammad

నీమచ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా పేరు. స్వాతంత్య్రం రాకమునుపు ఇది బ్రిటీష్ సాయుధబలగాల స్థావరంగా ఉండేది. ఆతర్వాత మధ్యప్రదేశ్ లోని మాంద్సౌర్ జిల్లాలో భాగంగా ఉండి, 19 వ శతాబ్దం చివరలో జిల్లాగా రూపుదిద్దుకుంది.

నీమచ్ పర్యాటకులను ఆకర్షించడానికి కారణమేంటంటే ఈ ప్రదేశంలో జరిగే తాజియా యొక్క ప్రత్యేక మొహర్రం ఊరేగింపులు. ఇది 150 సంవత్సరాల వయస్సు గలది. ఈ ఊరేగింపు ఇమామ్ హుస్సేన్ బలిదానం గుర్తుగా జరుగుతున్నది.

ఇది కూడా చదవండి : అమర్ కంటక్ - నర్మదానది జన్మస్థానం !

నీమచ్ చుట్టూ సుఖానంద్ జీ ఆశ్రమం, నవతోరణ్ ఆలయం, మహాత్మా గాంధీ సాగర్ ఆనకట్ట, మహాత్మా గాంధీ సాగర్ అభయారణ్యం, భద్వమాత ఆలయం వంటి ప్రదేశాలు పర్యాటకుల సందర్శనార్థం కోసం ఉన్నాయి.

గాంధీ సాగర్ డాం

గాంధీ సాగర్ డాం

చిత్ర కృప : LRBurdak

గాంధీ సాగర్ డాం

గాంధీ సాగర్ డాం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నీమచ్ దగ్గర మంద్సూర్ జిలాలో ఉన్న ఒక పర్యాటక ఆకర్షణ. భారతదేశంలో రెండవ పెద్ద జలాశయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి వేల సంఖ్యలో వలస పక్షులు వస్తుంటాయి. అందువలన ఈ జలాశయానికి ఇంటర్నేషనల్ బర్డ్ లైఫ్ ఏజెన్సీ గుర్తింపు లభించింది.

శ్రీ కైలేశ్వర్ మహాదేవ్ ఆలయం

శ్రీ కైలేశ్వర్ మహాదేవ్ ఆలయం

చిత్ర కృప : Rahultalreja11

భద్వమాత దేవాలయం

పాలరాయితో అందంగా నిర్మించిన భద్వమాత దేవాలయం నీమచ్ కి తూర్పున 18 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ మాతా విగ్రహాన్ని తొమ్మిది నభదుర్గ విగ్రహాలు అవి బ్రాహ్మి, మహేశ్వరీ, కుమారి, వైష్ణవి, వారాహి, నర్సిన్హి , ఏఅన్ద్రి, శివ్దత్తి మరియు చాముండ చుట్టూరా ఉన్నాయి. భారతదేశం లో ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా, శక్తిగా ఈ భద్వమాత ఆలయాన్ని వర్ణిస్తారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో స్నానం ఆచరిస్తే, శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

గాంధీ సాగర్ అభయారణ్యం

గాంధీ సాగర్ అభయారణ్యం

చిత్ర కృప : Hemant Shesh

గాంధీ సాగర్ అభయారణ్యం

ఇది ప్రకృతి యొక్క అందానికి సాక్ష్యంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నీమచ్ మరియు మంద్సూర్ ల ఉత్తర సరిహద్దుల మీద ఉన్నది. గాంధీ సాగర్ అభయారణ్యం 1974 లో గుర్తించబడింది. రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న ఈ అభయారణ్యం పర్యాటకులకు మనోల్లాసాన్ని ఇస్తుంది అనటంలో సందేహం ఏమాత్రం లేదు. చంబల్ నది మహాత్మా గాంధీ సాగర్ అభయారణ్యం గుండా వెళుతున్నది.

నవతోరణ్ దేవాలయం

నవతోరణ్ దేవాలయం

చిత్ర కృప : Rahultalreja11

నవతోరణ్ దేవాలయం

ఈ దేవాలయం నీమచ్, ఖోర్ గ్రామంలో ఉన్నది. ఆ అందమైన ఆలయం11వ శతాబ్దం నాటిది. ఈ ఆలయ సౌందర్యం కన్నులకు ఇంపుగా ఉంటుంది. ఈ ఆలయ కేంద్రంలో ఉన్న వరాహ విగ్రహం దీనియొక్క గొప్ప ఆకర్షణ. ఈ నవ తోరణ్ ఆలయ అద్భుతమైన అలంకరణ ఆకులు, హారము కలిగి, మకర తలలు మొదలైన ఆకారంలో కలిగి ఉన్నది.

సుఖానంద్ జీ ఆశ్రమ్

సుఖానంద్ జీ ఆశ్రమ్

చిత్ర కృప : LRBurdak

సుఖానంద్ జీ ఆశ్రమ్

ఇది నీమచ్ కి 32 కి.మీ.దూరంలో, రాజస్తాన్ బోర్డర్ మీద ఉన్నది. ఈ ఆశ్రమం ఒక పురాతనమైన రాతిగుహలో ఉన్నది. దాని ప్రాంగణంలో పరమశివుడికి అంకితమైన ఆలయం ఉన్నదని నమ్ముతారు; ఈ ఆశ్రమం అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉన్న స్పాట్ అని ప్రశంసలు అందుకుంటున్నది. ఈ ఆశ్రమ వ్యవస్థాపకుడు, వ్యాసదేవ కుమారుడు, శుకుడు అని భావిస్తారు.

నీమచ్ రైల్వే స్టేషన్

నీమచ్ రైల్వే స్టేషన్

చిత్ర కృప : Rahultalreja11

నీమచ్ ఎలా చేరుకోవాలి ?

  • బస్సు మార్గం : నీమచ్ పట్టణానికి ఉదైపూర్ నుండి ప్రతి రోజూ ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి (127 కి. మీ).
  • రైలు మార్గం : నీమచ్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల నుండి కూడా పలు రైళ్లు వస్తుంటాయి.
  • వాయు మార్గం : నీమచ్ కు ఉదైపూర్ సమీపాన ఉన్న విమానాశ్రయం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X