Search
  • Follow NativePlanet
Share
» » దక్షిణాదిలో ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లలేదా? ఈ సారి మాత్రం మిస్ చేసుకోవద్దు

దక్షిణాదిలో ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లలేదా? ఈ సారి మాత్రం మిస్ చేసుకోవద్దు

ఆగస్టు నెలలో సందర్శించడానికి అనుకూలమైన దక్షిణ భారత దేశంలోని పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

కర్నాటకలోని చిక్కమగళూరు, కేరళలోని అలెప్పే, తమిళనాడులోని యార్కాడు, కర్నాటకలోని శిరిసి, కేరళలోని పొవ్వార్ లు దక్షిణ భారత దేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాలన్న విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం అయిన ఆగస్టు నెలలో ఆ ప్రాంతాలతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు, అక్కడికి ఎలా చేరుకోవాలన్న విషయానికి సంబంధించిన క్లుప్తమైన సమాచారం మీ కోసం.

చిక్కమగళూరు

చిక్కమగళూరు

P.C: You Tube

కర్నాటకలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న చిక్కమగళూరు కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన జిల్లా. పశ్చిమ కనుమల్లో భాగమైన ఈ చిక్కమగళూరు చుట్టు పక్కల చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్ష బుుతువులో ఇక్కడ పర్వత ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులను రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి.

ఆగస్టులో వాతావరణం... 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు....బాబా బుడేన్ గిరి, హెబ్బా ఫాల్స్, కోదండరామ దేవాయం,

ఏమేమి చేయవచ్చు....ములయాన్ గిరి, కుద్రేముఖ్ లాంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్, వైల్డ్ లైఫ్ సఫారీ, రివర్ రాఫ్టింగ్, కుద్రేముఖ్

ఎలా చేరుకోవాలి....చిక్కమగళూరుకు దగ్గరగా మంగళూరు ఎయిర్ పోర్ట్ ఉటుంది. వీటి మధ్య దూరం 170 కిలోమీటర్లు.

అలెప్పే

అలెప్పే


P.C: You Tube

కేరళ పర్యాటక హబ్ గా పేరు గాంచిన అలెప్పే ఆగస్టు లో మరింత అందాలను సంతరించుకొంటుంది. వర్షాల వల్ల అక్కడ నదులు, సరస్సులు పొంగి పొర్లుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి నదుల్లో గూటి పడవల ప్రయాణాన్ని మాత్రం వదులుకోకండి.

ఆగస్టులో వాతావరణం... 17 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు....అలపూజ బీచ్, క్రిష్ణాపురం ప్యాలెస్, పతిరమనాల్, వేంబనాడ్, అలప్పే బీచ్ మొదలైనవి

ఏమేమి చేయవచ్చు.... గూటి పడవల్లో ప్రయాణం, బర్డ్ వాచింగ్, ఆయుర్వేద మసాజ్, స్నేక్ బోటింగ్ రేసింగ్ చూడటం

ఎలా చేరుకోవాలి....అలప్పేకు దగ్గరగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే.

యార్కాడు

యార్కాడు

P.C: You Tube

తమిళనాడులో అంతగా ప్రాచూర్యంలోకి రాని పర్యాటక కేంద్రం యార్కాడు. ఊటి, కొడైకెనాల్ కంటే అందమైన ఈ యార్కాడ్ హిల్ స్టేషన్. తూర్పు కనుమల్లో భాగమైన ఈ యార్కాడ్ గజిబిజిగా లేని ప్రశాంత వాతావరణంలో ప్రక`తితో మమేకం కావాలనుకొనేవారికి ఖచ్చితంగా నచ్చే ప్రదేశం.

ఆగస్టులో వాతావరణం... 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు.... షెవరాయ్ టెంపుల్, షెవరాయ్ పర్వత శిఖరాలు, కిలియూర్ ఫాల్స్, అన్నాపార్క్ మొదలైనవి.

ఏమేమి చేయవచ్చు.... ఎమరాల్డ్ సరస్సులో బోటింగ్, బొటానికల్ గార్డెన్ సందర్శన, పొగాడా పాయింట్ వద్ద నుంచి సూర్యాస్తమయాన్ని చూడటం.

ఎలా చేరుకోవాలి....సేలం ఎయిర్ పోర్ట్ యార్కాడుకు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పొవ్వార్

పొవ్వార్

P.C: You Tube

కేరళలోని త్రివేండ్రం జిల్లాలో ఉన్న పొవ్వార్ ఆగస్టు నెలల్లో సందర్శించదగిన ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాలతో పాటు బొటానికల్ గార్డెన్ వర్షాల వల్ల చేకూరిన కొత్త అందాలతో పర్యాటకులను ఆహ్వానిస్తూ ఉంటాయి.

ఆగస్టులో వాతావరణం... 23 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు.... పొవ్వార్ బీచ్, అజిమాలా ఈశ్వర దేవాలయం, ఎలిఫెంట్ రాక్, కూజిపొల్లాం బొటానికల్ గార్డెన్ మొదలైనవి

ఏమేమి చేయవచ్చు.... నెయ్యార్ నదిలో బోటు ప్రయాణం, విజిన్ జామ్ సీపోర్టులో సాయంకాలం గడపడం, ఆయుర్వేద మసాజ్

ఎలా చేరుకోవాలి....పొవ్వార్ కు దగ్గరగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే.

శిరిసి

శిరిసి

P.C: You Tube

కర్నాటకలో అంతగా ప్రాచూర్యానికి నోచుకోని శిరిసి కూడ ఆగస్టు నెలలో సందర్శించాల్సిన పర్యాటక కేంద్రమే. మిగిలిన సమయాల్లో అంతగా కనబడని జలపాతాల హొయలు వర్షాల వల్ల ఈ శిరిసి చుట్టు పక్కల హోరున అంతెత్తు నుంచి పడుతాయి. ఇక అభయారణ్యాల్లో ఈ వర్షాకాలంలో పక్షుల కువకువ రాగాలు వినడానికి ఎంతో హాయిని గొలుపుతాయి.

P.C: You Tube


ఆగస్టులో వాతావరణం... 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

చూడదగిన ప్రాంతాలు.... ఉచలి ఫాల్స్, సహస్రలింగ, బెన్నేహోల్ ఫాల్స్, గూడవి పక్షుల అభయారణ్యం, శివలింగ ఫాల్స్ మొదలైనవి


ఏమేమి చేయవచ్చు.... బర్డ్ వాచ్, బనవాసి దేవాలయం సందర్శన, మురేగర్ జలపాతం కింద తడవడం మొదలైనవి

ఎలా చేరుకోవాలి.... హుబ్లీ ఎయిర్ పోర్ట్ శిరిసికి దగ్గరగా ఉంది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X