Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటకలోని ప్రకృతి అందాలన్నీ ఇక్కడే, మీరు చూడలేదా?

కర్నాటకలోని ప్రకృతి అందాలన్నీ ఇక్కడే, మీరు చూడలేదా?

శివమొగ్గ చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

కర్నాటకలోని శివమొగ్గా లేదా షిమోగా సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవు. ఒక వైపున జలపాతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే చుట్టూ ఉన్న పచ్చదనం కంటికి ఇంపును కలిగిస్తుంది. అదే విధంగా ప్రముఖ అభయారణ్యాల్లోని పక్షుల కువ కువ రావాలు, చెంగు చెంగున ఎగిరే జింకలును చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు.

ఇలా శివమొగ్గ లో వైవిధ్యతకు కొదువులేని ఎన్నో పర్యాటక ప్రాంతాలు మనలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలమైన ఈ జులై, ఆగస్టు నెలల్లో అక్కడి పర్యాటక ప్రదేశాలు కొత్త అందాలతో కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమోగలో అత్యంత ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం...

కొడచాద్రి

కొడచాద్రి

P.C: You Tube

పడమటి కనుమల్లో అత్యతం అందమైన ప్రదేశాల్లో కొడచాద్రి కూడా ఒకటి. కర్నాటక ప్రభుత్వం చేత కొడచాద్రి వారతస్వ సంపదగా ప్రకటించబడింది. కర్నాటకలోని 10 వ ఎతైన శిఖరం ఈ కొడచాద్రి. ఈ కొండ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మూకాంబికా దేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ మనం అనేక శిథిలమైన కట్టడాలను కూడా చూడవచ్చు. కర్నాటక యువత ఇక్కడకు ఎక్కవగా ట్రెక్కింగ్ చేయాడానికి వస్తుంటారు.

హొన్నమరాడు

హొన్నమరాడు

P.C: You Tube

శరావతి రిజర్వాయర్ కు కూత వేట దూరంలోనే హెన్నామరాడు సరస్సు ఉంది. ఇక్కడ హైకింగ్, బోటింగ్, కయాకింగ్ వంటి జలక్రీడలకు అవకాశం ఉంది. అందువల్ల వీకెండ్ లో ఎక్కువగా యువత ఇక్కడకు వస్తుంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడ చూడటానికి చాలా అందంగా ఉంటాయి.

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

P.C: You Tube

భారత దేశంలో ఎత్తులో రెండోస్థానాన్ని జోగ్ జలపాతం ఆక్రమిస్తుంది. మొత్తం 253 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడే సమయంలో ఈ జలపాతం చేసే సవ్వడులు మనసుకు హాయిని కలిగాస్తాయి. షిమోగ్గా లోని సాగర తాలుకాలో ఉన్న ఈ జోగ్ జలపాతం కర్నాటకలోనే కాకుండా భారత దేశంలోనే ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే పర్యాటక కేంద్రాల్లో ఒకటి.

సక్రేబైలు

సక్రేబైలు

P.C: You Tube

శివమొగ్గ కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే సక్రేబైలు ఉంటుంది. ఇది ఏనుగుల సంరక్షణ కేంద్రం. ఇక్కడ మనం నేరుగా ఏనుగులకు స్నానం చేయించే సౌకర్యం కూడా ఉంది. అయితే ఇందు కోసం ఉదయం 9 గంటల లోపు సక్రేబైలుకు చేరుకోవాల్సి ఉంటుంది.

ఆగుంబే

ఆగుంబే

P.C: You Tube

దక్షిణ భారత దేశ చిరపుంజిగా ఆగుంబేకు పేరు. ఇక్కడ ఎల్లప్పుడూ పచ్చదనం తొనికిసలాడుతూ ఉంటుంది. బీజీ లైఫ్ నుంచి రెండు రోజుల పాటు దూరంగా ఉండాలనుకునే వారు ఎక్కువగా ఈ ఆగుంబేనే ఎంచుకొంటారు. ట్రెక్కింగ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X