Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీలో ఈ వీకెండ్ ను ఇలా గడపండి

ఢిల్లీలో ఈ వీకెండ్ ను ఇలా గడపండి

భారత దేశ రాజధాని ఢిల్లీ పురాణ ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇంద్ర ప్రస్తానం అనే పేరుతో ఇది ఆ కాలంలోనే ఉందని వాదించేవారు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఈ ఢిల్లీ చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది. మోఘల్ పాలనలో ఎన్నో కోటలు నిర్మించబడ్డాయి. ఇక బ్రిటీష్ కాలంలో కూడా కొన్ని ప్రాంతాలను ప్రాచూర్యంలోకి తీసుకువచ్చారు. అటు పై మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇక్కడ పలు ప్రాంతాలు పర్యాటకం కేంద్రాలుగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ సమయంలో ఢిల్లీలో చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనాలు మీ కోసం...

ఎర్రకోట

ఎర్రకోట

P.C: You Tube

ఒక్క భారత దేశంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కోటల్లో మొఘలులు కట్టించిన ఈ ఎర్రకోట చాలా ప్రాచూర్యం పొందింది. ఈ కోట ప్రహరీ గోడలు సుమారు 2 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్నాయి. క్రీస్తు

శకం 1630 లో ఈ కోట నిర్మాణం జరిగింది. మొదట్లో తిరుగుబాటు దారులను బంధించి ఖైదు చేయడానికి ఈ కోటను వినియోగించేవారు. ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. సోమవారం కోటలోకి ప్రవేశం ఉండదు. మిగిలిన రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యాటకులను అనుమతిస్తారు. ప్రతి రోజు సాయంత్రం లేజర్ షో ద్వారా కోట గొప్పతనాన్ని వివరిస్తారు.


ప్రవేశ రుసుం... విదేశీయులకు రూ.500, భారతీయులకు రూ.30, 15 లోపు పిల్లల వరకూ ఉచిత ప్రవేశం.

ఛాందినీ చౌక్

ఛాందినీ చౌక్

P.C: You Tube

న్యూఢిల్లీలో చాందినీ చౌక్ ప్రముఖ షాపింగ్ సెంటర్. పేదల నుంచి ధనిక వర్గాల వరకూ ముఖ్యమైన వస్తువుల కొనుగోలు కోసం ఇక్కడికే వస్తారు. ఇక్కడ బంగారు, వజ్రాల ఆభరణాల నుంచి వంటింటిలో వాడే పోపుల పెట్టె వరకూ దొరకని వస్తువు లేదు. అంతేకాకుండా ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ రుచి చూడాలనుకొనేవారికి ఈ చాంధీని చౌక్ బెస్ట్ ఫ్లేస్.

కుతుబ్ మినార్

కుతుబ్ మినార్

P.C: You Tube

ప్రపంచంలోనే ఇటుకులతో నిర్మించిన శిఖరాల్లో ఇదే అత్యంత ఎతైనది. ఇండో ఇస్లామిక్ వాస్తు శిల్ప శైలికి ఇది ఉదాహరణ. క్రీస్తు శకం 1206లో దీనిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ప్రతి ఏడాది జూన్ 22 న ఈ శిఖరం నీడ భూమి పై పడదు. ఇది భారత దేశంలో ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప నిదర్శనంగా పేర్కొంటారు. అంతేకాకుండా భౌగోళిక శాస్త్ర నిగూతను కూడా ఈ కుతుబ్ మినార్ వివరిస్తుంది.

ప్రవేశ రుసం....విదేశీయులకు రూ.500, భారతీయులకు రూ.30. అదే విధంగా 15 ఏళ్ల పిల్లల వరకూ ప్రవేశం ఉచితం. అన్ని రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రవేశం కల్పిస్తారు.

ఇండియా గేట్

ఇండియా గేట్

P.C: You Tube

ఢిల్లీ అన్న తక్షణం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యం తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన భారత దేశ సైనికుల సంస్మరనార్థం ఈ ఇండియా గేట్ ను నిర్మించారు. ఫ్లండ్ లైట్ల వెలుతురులో సాయంత్రం సమయంలో ఈ ఇండియా గేట్ అందాలను చూస్తూ సమయం అలా గడిపేయవచ్చు. ఇండియా గేట్ వద్ద ఉన్న ఉద్యానవనాలు మనసుకు హాయినిస్తాయి.

గాంధీ మెమోరియల్వ, రాజ్ ఘాట్

గాంధీ మెమోరియల్వ, రాజ్ ఘాట్

P.C: You Tube

జాతిపిత మహాత్మా గాంధీ మరణించడానికి సరిగ్గా 144 రోజుల ముందు నివసించిన గదిని ఆయన సంస్మరణార్థం స్మ`తి వనంగా మార్చారు. ప్రతి రోజు సాయంత్రం ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. ప్రశాంత వాతావరణంలో సమయాన్ని గడపాలనుకొనేవారికి ఈ గాంధి స్మ`తి వనం చాలా బాగా నచ్చుతుంది. ప్రవేశ రుసుం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X