Search
  • Follow NativePlanet
Share
» »ఈ అమ్మవారిని దర్శిస్తే సంతాన, పెళ్లి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం ఎందుకంటే

ఈ అమ్మవారిని దర్శిస్తే సంతాన, పెళ్లి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం ఎందుకంటే

ఆలంపూర్ జోగులాంబ దేవస్థానానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశం అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. ఒక్కొక్క పుణ్యక్షేత్రం విశిష్టత ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదే కోవకు చెందినదే. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. ఈ జోగులాంబ ఆలయం ద్వాదశ శక్తి పీఠాల్లో ఐదవది. జోగులాంబ ఆలయం తెలంగాణలోని ఆలంపూర్ లో ఉంది. ఈ ఆలయానికి దగ్గరగా కృష్ణ, తుంగభద్ర నదుల సంగమం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు విశిష్ట రూపంతో ఉంటారు. జోగులాంబ ఉగ్ర స్వరూపంతో ఉన్నా దేవాలయం ఆవరణంలోని కోనేరు అమ్మవారిని చల్లబరుస్తుందని స్థానికులు చెబుతుంటారు. అమ్మవారి విశిష్ట రూపం దర్శించుకొంటే వాస్తు సమస్యలు తీరుతాయని స్థానిక పూజారులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. వీటి దర్శనం వల్ల కష్టాలన్నీ తొలిగి పోతాయని చెబుతుంటారు. ఇక్కడ పురావస్తు వస్తు ప్రదర్శన శాల కూడా ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న అమ్మవారి పుణ్యక్షేత్రం వివరాలు మీ కోసం

ఈ రన్ వే పై విమానాలే కాదు మీరూ పరుగెత్తవచ్చు...అయితే ఒక్క చిన్నపనిచేసి ఉండాలి<br>ఈ రన్ వే పై విమానాలే కాదు మీరూ పరుగెత్తవచ్చు...అయితే ఒక్క చిన్నపనిచేసి ఉండాలి

1.అష్టాదశ పీఠాల్లో ఒకటి

1.అష్టాదశ పీఠాల్లో ఒకటి

Image Source:

జోగులాంబ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అంతే కాకుండా మొత్తం 18 శక్తి పీఠాల్లో జోగులాంబ దేవాలయం ఐదవది. దీని వెనుక పురాణ కథనం ఉంది. దక్షప్రజాపతి చేసే యాగానికి దాక్షాయణి వెలుతుంది.

2.ఆత్మత్యాగం

2.ఆత్మత్యాగం

Image Source:

అయితే పిలువని పేరంటానికి వచ్చావని తండ్రితో పాటు తోబుట్టువులు కూడా దక్షాయణిని తీవ్రంగా అవమానిస్తారు. దీంతో దాక్షాయణి ఆత్మత్యాగానికి పాల్పడుతుంది. విషయం తెలిసిన పరమ శివుడు తీవ్ర ఆగ్రహంతో శివ తాండవం చేస్తాడు.

3.ధ్వసం చేస్తాడు

3.ధ్వసం చేస్తాడు

Image Source:

తన జటాజూటం నుంచి వీరభద్రుడిని స`ష్టించి దక్షయగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. అటు పై భార్య పార్థీవ శరీరాన్ని భుజం పై వేసుకొని శివతాండం చేస్తాడు. ఈ చర్యకు ముల్లోకాలు భీతిల్లుతాయి. సమస్య పరిష్కారం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో దక్షాయణి శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు.

4.ఊర్థ్వ పన్ను పడిన ప్రాంతమే

4.ఊర్థ్వ పన్ను పడిన ప్రాంతమే

Image Source:

ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పడిపోతుంది. ఆ భాగాలు పడిన ప్రాంతాలే తరువాత శక్తిపీఠాలుగా రూపాంతరం చెందాయి. ఈ నేపథ్యంలోనే దాక్షాయణి ఊర్థ్వ పన్ను ప్రస్తుత ఆలంపూర్ ప్రాంతంలో పడి జోగులాంబ రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది.

5.బల్లులు, తేళ్లు

5.బల్లులు, తేళ్లు

Image Source:

ఈ అమ్మవారు విశిష్ట రూపాన్ని కలిగి ఉంటారు. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతూ అందులో బల్లులు, తేళ్లు, గబ్బిలాలు ఉంటాయి. అంతే కాకుండా తల పై కపాలం కూడా ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా జీవ కళ తగ్గితే అక్కడ బల్లులు సంఖ్య పెరుగుతుందని చెబుతారు.

6.కపాలం కూడా

6.కపాలం కూడా

Image Source:

ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని పురాణాలు చెబుతారు. ఇందుకు ప్రతిరూపంగానే అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అని స్థానిక పూజారాలు వివరిస్తారు.

7.వాస్త దోష నివారణకు కూడా

7.వాస్త దోష నివారణకు కూడా

Image Source:

ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని చాలా సంవత్సరాలుగా స్థానికులు విశ్వసిస్తున్నారు.అందుకే జోగులాంబ అమ్మవారిని గ`హచండిగా పేర్కొంటారు. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

8.విశిష్ట రూపమే కారణం

8.విశిష్ట రూపమే కారణం

Image Source:

అమ్మవారి విశిష్ట రూపమే ఇందుకు ప్రధానకారణమని చెబుతారు. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుందనండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలంపురాన్ని పూర్వం హలంపురం, హటాంపురంగాను వ్యవహరించేవారు.

9.శాసనం స్పష్టం చేస్తుంది

9.శాసనం స్పష్టం చేస్తుంది

Image Source:

ఈ విషయాన్ని ఆలయంలోని శాసనం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆలయాన్ని క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో బాదామీ చాళుక్యులు నిర్మించారు. అటు పై శాతవాహన, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్ షాహీలు ఈ ఆలయాన్ని అభివ`ద్ధి చేశారు.

10ఆగ్నేయ దిశగా

10ఆగ్నేయ దిశగా

Image Source:

జోగులాంబ ఆలయం అలంపురలో ఆగ్నేయ దిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వసం చేశారు. అప్పుడు జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను స్థానికంగా ఉన్న బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపరిచారు.

11.ఆమె ఉగ్రస్వరూపి అయినా కూడా

11.ఆమె ఉగ్రస్వరూపి అయినా కూడా

Image Source:

అటు పై 2005లో జోగులాంబకు ప్రత్యేక దేవాలయం నిర్మించి తిరిగి అక్కడ అమ్మవారితో పాటు చండి, ముండి విగ్రహాలను ప్రతిష్టించారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నా ఆలయ ప్రాంగనంలో ఉన్న కోనేరుఅమ్మవారితో పాటు చుట్టు పక్కల ఉన్న వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం.

12.నిత్యం ఆధ్యాత్మిక శోభ

12.నిత్యం ఆధ్యాత్మిక శోభ

Image Source:

శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక శోభ కనువిందు చేస్తుంది. రోజువారీ పూజలతో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిక కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారిని భక్తులు పేర్కొంటారు.

13సంతాన సమస్యలు ఉన్నవారు

13సంతాన సమస్యలు ఉన్నవారు

Image Source:

ముఖ్యంగా సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమ్మవారిని సందర్శిస్తే సత్వర ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఇక్కడకు ఎక్కువగా కొత్తగా పెళ్లైనవారు, పెళైనా చాలా ఏళ్లుగా సంతానం లేనివారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

14.ముంపునకు

14.ముంపునకు

Image Source:

అలంపూర్ కు ఈశాన్యంలోని కూడవెళ్లి గ్రామంలో క`ష్ణా, తుంభద్రతో మరో ఐదు నదులు కలుస్తాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని సంగం అని అనేవారు. ఇక్కడే సంగమేశ్వర ఆలయం ఉండేది. ఈ గ్రామంతో పాటు ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యాయ్యి.

15.పునర్నించారు

15.పునర్నించారు

Image Source:

ఈ నేపథ్యంలో కూడవెళ్లి గ్రామ ప్రజలు సమీపంలోని గ్రామాల్లో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా సంగమేశ్వర ఆలయాన్ని అలంపూర్ గ్రామంలోని జూనియర్ కళాశాల సమీపంలో పునర్నించారు. ఈ ఆలయ శిల్ప సంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.

16.అందువల్లే ఆలయాల నగరం

16.అందువల్లే ఆలయాల నగరం

Image Source:

ఆలంపూరం సమీపంలో పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకే చోట ఉంటాయి. అందువల్లే అలంపురాన్ని ఆలయాల పట్టణంగా పేర్కొంటారు. ఈ దేవాలయాల్లో కేవలం హిందూ దేవతలకు చెందిన శిల్పాలే కాకుండా జైన బౌద్దుల శిల్పాలు కూడా మనం చూడవచ్చు.

17.పురావస్తు ప్రదర్శన

17.పురావస్తు ప్రదర్శన

Image Source:

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దీనిని 1952లోనే ఏర్పాటు చేశారు. ఇందులో క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకూ ఉన్న కాలానికి సంబంధించిన అనేక వస్తువులు ఇక్కడ బద్రపరచబడ్డాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీనిని సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు.

18.నవ బ్రహ్మ ఆలయాలు

18.నవ బ్రహ్మ ఆలయాలు

Image Source:

అలంపుర్ లోనే నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అను పేర్లతో వాటిని భక్తులు కొలుస్తారు. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేసి ఈ దేవాలయాలను నిర్మించినట్లు చెబుతారు. ిందులో బ్రహ్మ దేవాలయం పెద్దది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

19.ఇలా వెళ్లవచ్చు

19.ఇలా వెళ్లవచ్చు

Image Source:

హైదరాబాద్ నంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెలుతాయి. కర్నూలు పట్టణానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే జోగులాంబ ఆలయం ఉంటుంది. కర్నూలు నుంచి సొంత వాహనాల్లో వీకెండ్ రోజుల్లో కూడా ఎక్కువ మంది ఈ దేవాలయానికి వెలుతుంటారు.

20.నేరుగా బస్సు సౌకర్యం

20.నేరుగా బస్సు సౌకర్యం

Image Source:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ నగరాలతో పాటు కర్నాటక నుంచి కూడా కర్నూలుకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా కర్నూలుకు దేశంలోని వివిధ పట్టణాల నుంచి కూడా నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X