Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్రవరి నెలలో ఈ ప్రదేశాలు చాలా అందంగా..ఆహ్లాదంగా.. ఉంటాయి

ఫిబ్రవరి నెలలో ఈ ప్రదేశాలు చాలా అందంగా..ఆహ్లాదంగా.. ఉంటాయి

ఫిబ్రవరి నెలలో ఈ ప్రదేశాలు చాలా అందంగా..ఆహ్లాదంగా.. ఉంటాయి..

పబ్లిక్ హాలిడేస్ లేని నెల ఫిబ్రవరి. ఈ నెలలో పండగలు, పంబాలు ఏవి లేవు. వాలెంటెన్స్ డే తప్ప. ఇది తప్ప మరో విశేషమంటూ ఏవీ లేవు. ఈ నెలలో హాలిడేస్ లేకపోవచ్చమోగానీ, ఈ నెలల్లో సందర్శించడానికి మాత్రం కొన్ని అనువైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు ఇతర పర్యాటక ప్రదేశాల్లా కాదు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని..హాయిని..గొలిపిస్తూ చరిత్రను పొందే భాగ్యం కల్పిస్తాయి.

ఫిబ్రవరి నెలలో హాలిడేస్ లేకున్నా..తన సోయగాలతో మనల్ని ఊరిస్తున్న ఆ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడం ఆనందదాయకం. ముఖ్యంగా వాలెంటైన్ డే సందర్భంగా లవర్స్ ఈ ప్రదేశాలను సందర్శించిడం ఒక మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. అలాగే మొదట సారిగా తనలోని ప్రేమను వ్యక్తపరచడానికి ఈ ప్రదేశాలు చాలా ఆహ్లాదంగా, మనస్సును హత్తుకునే విధంగా ఉంటాయి. మరి అలాంటి ప్రదేశాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అరకువ్యాలీ :

అరకువ్యాలీ :

ఆంద్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది అరకు లోయ. ఇది వైజాగ్ లో ఉంది. ఈ అరకులోయలో పండించే కాఫీ సువాసనల అరకు వ్యాలీ మొత్తం వ్యాపించి ఉంటాయి. అరకు లోయ అందాలను మొదట సారి చూసే వారు, ఆ అందాలకు దాసోహంఅవ్వాల్సిందే. అంతటి ప్రకృతి అందాలు కనువిందు చేస్తూ సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరిలో సందర్శకులు కాస్త ఎక్కువగానే ఉంటారు. అరకు లోయ చేరుకోవడానికి హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళి, అక్కడి నుండి 11 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అరకు లోయ చేరుకోవచ్చు.

రామగిరి ఖిల్లా:

రామగిరి ఖిల్లా:

శాతవాహనులు, కల్యాణ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, గోల్కొండ సుల్తాన్ లు రామగిరి కేంద్రంగా పాలన చేశారు. ఆయా పాలాన కాలంలో వీళ్లు ఇక్కడ అనేక కళాఖండాలను నిర్మించారు. దీనికి తోడు ప్రకృతి రమణీయతకు రామగిరి క్షేత్రంగా కొలువుదీరిఉండటంతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ రామగిరి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాలను ఆనుకొని రామగిరి ఖిల్లా ఉంది. కరీంగనగర్ నుండి మంథని వెళ్లే మార్గంలో బేగం పేట చేరుకోవాలి.అక్కడి నుండి సుమారు 10కిలోమీటర్ల కాలినడకన వెళ్తే గుట్టపైకి చేరుకోవచ్చు.

కొడైకెనాల్:

కొడైకెనాల్:

తమిళనాడులో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ . సముద్ర మట్టానికి సుమారు 2133మీటర్ల ఎత్తులో ఉంది. కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ ట్రిప్ వెళ్లాలంటే కొడైకెనాల్ బెస్ట్ ప్లేస్. దట్టమైన అడవుల్లో మంత్రముగ్థులను చేసే ప్రకృతి సౌందర్యంతో నిండిన చెట్లు, రాళ్లు, జలపాతాలు, పూదోటలు సందర్శకులను నిత్యం అలరిస్తుంటాయి. హైదరాబాద్ నుండి మధురై అక్కడి నుండి కొడైకెనాల్ వెళితే ఇక మీరు ఊహించుకున్న సుందర ప్రదేశాలు మీ కళ్లముందే కనిపించి కనువిందు చేస్తాయి.

నంది హిల్స్:

నంది హిల్స్:

కర్ణాటకలో ఓ ప్రముఖ పర్యాటక ప్రదేశం. బెంగళూరు నగరానికి సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. 1478మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్ లాంటి కార్యకలాపాలకు తగిన ప్రదేశం. భౌగోళికంగా స్కందగిరికి చాలా దర్గలో ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న కొండలు పర్వతారోహకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఇంకా నందీహిల్స్ దగ్గరలో టిప్పు సుల్తాన్ ప్యాలెస్, కోట భోగనందీశ్వరాలయం శిథిల దశలో ఇక్కడ కనిపిస్తాయి.

కుమారకోమ్:

కుమారకోమ్:

కుమరకోమ్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది చిన్న ద్వీపాల సమూహం. కొట్టాయంకి సుమారు 15కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం అందమైన నదీ ప్రవాహాలతో, ఆకుపచ్చని ప్రకృతితో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. పక్షిప్రేమికులను అందమైన ప్రదేశం. ిక్కడ వివిధ రకాల పక్షులను దగ్గరనుండి చూడవచ్చు. కుమారకోమ్ లో లభించే సీ ఫుడ్ ను పర్యాటకులు అమితంగా ఇష్టపడుతారు. కొమారకోం చేరుకోవడానికి బస్సు, రైలు మార్గాలున్నాయి. విమాన మార్గంలో వెళ్లాలనుకుంటే 89కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచ్చి విమానశ్రయానికి చేరుకుని అక్కడి నుండి టాక్సీ లేదా బస్సుల ద్వారా కుమారకోమ్ చేరుకోవచ్చు.

ఖజురహో:

ఖజురహో:

మధ్యప్రదేశ్ లో ఉన్న ఖజురహోలో ఫ్రిబవరి నెలలో డ్యాన్స్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ డ్యాన్ వేడుకలో పాల్గొనడానికి భారతదేశంలోని సంప్రదాయ నృత్యాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో..ఖజురహోలో డాన్స్ ఫెస్టివల్లో అలా ఉంటుంది. ఈ వేడకను చూడటానికి పర్యాటకులతో పాటు కళాకారులు కూడా బారులుతీరుతారు. మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ నృత్యాలను చూడాలంటే ఖజురహో కాంప్లెక్స్ కి వెళ్ళి అక్కడి చిత్రగుప్త టెంపుల్, విశ్వనాథ్ టెంపుల్ చేరుకోవచ్చు.

గోవా:

గోవా:

భారతదేశ పశ్చిమభాగన ఆనుకుని ఉన్న ఇక చిన్న రాష్ట్రం . మహారాష్ట్ర, అరేబియా సముద్రం సరిహద్దుగా ఉన్న ప్రదేశం. గోవాలో ఎటు చూసినా బీచ్ లే కనబడుతాయి. గోవాలో సీఫుడ్స్, నైట్ క్లబ్బులు, షాపింగ్ మాల్స్, రోడ్ సైడ్ పబ్ లతో పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.హైదరాబాద్ నుండి గోవాకి టూరిజం వారి 5రోజుల టూర్ ప్యాకేజీలున్నాయి. కాచిగూడ టు యశ్వంత్పూర్ రైల్వే ఎక్స్ ప్రెస్ ఉంది. వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుని అక్కడి నుండి గోవా వెళ్లొచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X