Search
  • Follow NativePlanet
Share
» »చిటపట చినుకుల్లో తడుస్తూ లోనావాల అందాలను చూడటానికి వెల్దామా?

చిటపట చినుకుల్లో తడుస్తూ లోనావాల అందాలను చూడటానికి వెల్దామా?

లోనావాల చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

పశ్చిమ కనుమల్లో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో లోనావాల కూడా ఒకటి. పూనే నుంచి 65 కిలోమీటర్లు, ముంబై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాల ప్రముఖ హిల్ స్టేషన్. ప్రశాంత వాతావరణంలో వీకెండ్ ను గడపాలనుకొనేవారికి ఈ లోనావాలా రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మంచు పొరలను కల్పి ఉండే ఈ హిల్ స్టేషన్ లో ట్రెక్కింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఈ నేపథ్యంలో లోనావాల చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

బుషీ డ్యాం

బుషీ డ్యాం

P.C: You Tube

వర్షాకాలంలో లోనావాల లో చూడదగిన పర్యాటకప్రాంతాల్లో బుసీ డ్యాం ఒకటి. దీనిని ఇంద్రానీ నది పై నిర్మించారు. ఈ వర్ష రుతువులో డ్యాం నిండినప్పుడు గేట్లు ఎత్తివేస్తారు. అప్పుడు ఉరకలు వేస్తూ ముందుగుసాగే ఇంద్రనీ నది అందాలు చూడాల్సిందే. వయసు భేదాన్ని మరిచి చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరూ ఈ డ్యాం దిగువ భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్ల పై ఆ నీటి జల్లులో తడుస్తూ స్నానం చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. డ్యాంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

పానా డ్యాం

పానా డ్యాం

P.C: You Tube

లోనావాల చుట్టు పక్కల సందర్శించాల్సిన పర్యాటక కేంద్రాల జాబితాలో పానా డ్యాం ముందు వరుసలో ఉంటుంది. చుట్టూ పచ్చటి అడవులు వాటి మధ్య ఉన్న ఈ డ్యాంలో బోటింగ్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ విహరించడానికి ఎంతో మంది ఉత్సుకత చూపిస్తారు. ట్రెక్కింగ్ కు కూడా అవకాశం ఉంది. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ ప్రాంతం స్వర్గధామం.

తుంగర్లీ సరస్సు

తుంగర్లీ సరస్సు

P.C: You Tube

వర్షాకాలంలో తుంగర్లీ సరస్సు సరికొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. సరస్సు ఒడ్డున చేతిలో గొడుకు పెట్టుకొని మన పాదాలు సర్సులోని నీటిని ముద్దాడుతుంటే అదే సమయంలో పై నుంచి వర్షపు తుంపరులు పడుతూ ఉంటే ఊహించుకొంటూనే ఎంతో అందంగా ఉంది కదూ. ఈ ఊహా నిజం కావాలంటే తుంగర్లీ సరస్సును సందర్శించాల్సిందే.

టైగర్స్ లీప్

టైగర్స్ లీప్

P.C: You Tube

లోనావాల చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలల్లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం టైగర్ లీప్. ఒక పులి పైకి ఎగుతున్నట్లు మనకు ఇక్కడ పర్వత శిఖరం కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడి నుంచి ఎంతో అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడి అందాలు మరింత ఆకట్టు కొంటాయి.

లయన్స్ పాయింట్

లయన్స్ పాయింట్

P.C: You Tube

లోనావాల దగ్గర ఉన్న మరో అందమైన ప్రదేశం లయన్స్ పాయింట్. ఏటువాలుగా ఉన్న ప్రదేశం పైకి ఎక్కి సూర్యాస్తమయాలను చూడటం చాలా అందంగా ఉంటుంది. అందువల్లే ప్రక`తి ప్రేమికులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా రాత్రి పూట ట్రెక్కింగ్ కు కూడా చాలా అనుకూలమైన ప్రాంతం. అందువల్ల యువత వీకెండ్ రోజుల్లో ఎక్కువగా ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఒంటె పై ప్రయాణం ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

రాజ్ మాచీ ఫోర్ట్

రాజ్ మాచీ ఫోర్ట్

P.C: You Tube

గత కాలపు చరిత్రకు సజీవ సాక్షం రాజ్ మాచీ కోట. ఈ కోట పై భాగానికి చేరుకొని చుట్టూ ఉన్న పర్వత పచ్చటి మైదానాలను, నదీ లోయలను, జలపాతాలను చూస్తూ సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు. పశ్చిమ కనుమల్లో ఈ వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేసే వారు ఎక్కువగా రాజ్ మాచీ ఫోర్ట్ ను ఎంచుకొంటారు. ఇప్పుడిప్పుడే బైకర్స్ తమ బైకుల ద్వారా ఈ కోట పై భాగానికి చేరుకోవడానికి ఉత్సహం చూపుతున్నారు.

 తికోన

తికోన

P.C: You Tube

ఈ కోట పై భాగానికి చేరుకోవడం కొంత క్లిష్టమైనా ట్రెక్కింగ్ అంటే ఇష్టమున్నవారికి ఈ ప్రయత్నం ఎంతో నచ్చుతుంది. ముఖ్యంగా చిటపట చినుకుల్లో తడుస్తూ ఉందుకు వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే యువత ముఖ్యంగా కఠిన మార్గాల్లో ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారు ఈ తికోన ను ఎంచుకొంటారు.

 విసాపూర్

విసాపూర్

P.C: You Tube

సముద్ర మట్టానికి 1084 మీటర్ల ఎత్తులో ఉన్న విసాపూర్ కోటను చేరుకోవడం చరిత్రలోకి తొంగిచూడటమే. ఆకాంలో పర్వతాల పై అత్యంత భద్రమైన కోటను నిర్మించడం భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కానం. ఈ కోటకు దగ్గరగా అనేక ధార్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X