Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని 8 భయానక రైల్వే స్టేషన్ లు !

ఇండియాలోని 8 భయానక రైల్వే స్టేషన్ లు !

రైళ్లు సాధారణంగా ప్రయాణీకులను ఒక చోట నుండి ఇంకో చోటుకు తీసుకెళతాయని తెలుసు. కానీ అవే రైళ్లు మిమ్మల్ని దెయ్యాల బోనులోకి తీసికెళతాయని ఎప్పుడైనా ఊహించారా ?

By Mohammad

రైళ్లు సాధారణంగా ప్రయాణీకులను ఒక చోట నుండి ఇంకో చోటుకు తీసుకెళతాయని తెలుసు. కానీ అవే రైళ్లు మిమ్మల్ని దెయ్యాల బోనులోకి తీసికెళతాయని ఎప్పుడైనా ఊహించారా ? ఇటీవల వార్తల్లో నిలిచిన బెంగాల్ లోని బేగుంకొడార్ రైల్వే స్టేషన్ గురించి తెలిస్తే మీరే షాకవుతారు. సుమారు 42 ఏళ్ల తర్వాత దీనిని పర్యాటకుల కోసం 2009 లో మమతా బెనర్జీ తెరచి ఉంచింది. 1967 లో దెయ్యాలు తిరిగితున్నాయని మూతపడిన ఈ రైల్వే స్టేషన్ మళ్లీ తెరుచుకోవడంతో మరోసారి దెయ్యాల స్టేషన్ లు వార్తల్లో నిలిచాయి.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ - 15 భయానక ప్రదేశాలు !

మనం ఇప్పటివరకు భయానక ప్రదేశాల గురించి విన్నాం కానీ, రైల్వే స్టేషన్ ల గురించి వినలేదు. మన దేశంలో 8 వరకు దెయ్యాల స్టేషన్ లు ఉన్నట్లు, అక్కడ అడపాదడప దెయ్యాలు ప్రయాణీకులకు కనపడుతున్నట్లు ప్రచారంలో ఉన్నది. మన ఇండియాలో ఇలాంటి సాధారణమే ! మరి ఆ హంటెడ్ రైల్వే స్టేషన్ లు ఏవి ? ఎక్కడున్నాయో తెలుసుకుందాం పదండి !

ఇది కూడా చదవండి : ఈ ప్రదేశాలను సందర్శించే ధైర్యం ఉందా?

బరోగ్ స్టేషన్

బరోగ్ స్టేషన్

కల్నల్ బరోగ్ నిర్మించిన టన్నెల్ నెం. 33 షిమ్లా వెళ్లేదారి లో వుంది. దీనిగుండా ప్రయాణిస్తున్నప్పుడు దీని సృష్టికర్త బారోగ్ రూపం కనిపిస్తుందని ప్రయాణికులు అంటున్నారు. ఒకప్పుడు దీన్ని మూసేయాలని ప్రభుత్వం మెటల్ డోర్ చేసి ప్రవేశద్వారంలో పెట్టినా.. మరుసటి రోజే అది విరిగిపోయింది. దాంతో ఇక్కడ దెయ్యం వుందని అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది.

చిత్ర కృప : Kshitiz Sharma

బేగున్ కొడార్ రైల్వే స్టేషన్

బేగున్ కొడార్ రైల్వే స్టేషన్

బేగున్ కొడార్ రైల్వే స్టేషన్, కోల్కత్త కు 260 కిలోమీటర్ల దూరంలో కలదు. 1967 కు పూర్వం ఈ స్టేషన్ లో రాత్రి పూట తెల్లని చీరలో ఒక స్త్రీ కనపడేదని , ఆమెను చూసిన వారు చనిపోతున్నారని కధనం. అందుకే అప్పట్లో ఈ స్టేషన్ ను మూసేసారు. మరలాసరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంటే, 2009 లో మమతా బెనర్జీ ప్రభుత్వం తెరిచింది. ఆసక్తి గల పర్యాటకులు అప్పటి నుండి తరచూ ఈ స్టేషన్ ను సందర్శిస్తున్నారు.

చిత్ర కృప : Shaaz Hussain

ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్

ద్వారకా సెక్టార్ 9 మెట్రో స్టేషన్

ద్వారకా సెక్టార్ మెట్రో స్టేషన్, ఢిల్లీ మహా నగరంలో కలదు. ఖచ్చితంగా చెప్పలంటే స్టేషన్ లో అయితే కాదు కానీ, స్టేషన్ పక్కనే ఒక స్త్రీ తెల్లని చీరతో తిరుగుతుందని వార్త ప్రచారంలో ఉన్నది. రాత్రి పూట ఆ ఆత్మ కార్ల వెంట పరుగెడుతుందని, కార్ డోర్ తడుతుందని, చెంప దెబ్బ కొడుతుందని కధనం.

చిత్ర కృప : Kai Schreiber

రవీంద్ర సరోబర్ మెట్రో రైల్వే స్టేషన్

రవీంద్ర సరోబర్ మెట్రో రైల్వే స్టేషన్

ఈ స్టేషన్ కోల్కత్త మెట్రో సిటీ లో కలదు. ఇక్కడ కూడా దెయ్యాలు తిరుగుతున్నాయనే కధ ప్రచారంలో ఉన్నది. రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్ లు దూసుకొస్తున్న రైలు మీద కి జంప్ చేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ అక్కడ వారి నీడలు కనిపిస్తున్నాయని చెబుతారు.

చిత్ర కృప : ABP

ఎంజి రోడ్ మెట్రో స్టేషన్

ఎంజి రోడ్ మెట్రో స్టేషన్

ఈ స్టేషన్ నోయిడా లో కలదు. ఇక్కడ ఒక ముసలి అవ్వ ట్రైన్ యాక్సిడెంట్ లో పట్టాలు దాటుతుండగా చనిపోయింది. ఆ అవ్వ ఆత్మ రూపంలో ట్రైన్ వెనక భాగంలో కూర్చొని నాలుక, కళ్ళ ను బయటకు పెడుతుందని కధనం.

చిత్ర కృప : Piyush Bansal

నైని రైల్వే స్టేషన్

నైని రైల్వే స్టేషన్

నైని స్టేషన్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ చేరువలో కలదు. స్టేషన్ లో వింతైన ఆకారాలు, చిత్రాలు, నీడలు కనిపిస్తున్నాయని కధనం. ఆ ఆత్మలు ఎవరో కాదట స్వాతంత్ర సంగ్రామంలో బందీలుగా ఉన్న పోరాట యోధులట. వారిని స్టేషన్ పక్కనే ఉన్న నైని జైల్ లో బంధించారు.

చిత్ర కృప : dueenakh

చిత్తూర్ రైల్వే స్టేషన్

చిత్తూర్ రైల్వే స్టేషన్

చిత్తూర్ స్టేషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది జులై మాసం. చిత్తూర్ స్టేషన్ లో అక్టోబర్ 31, 2013న న్యూ ఢిల్లీ - బౌండ్ కేరళ ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది. ప్లాట్ ఫామ్ నిర్జీవంగా ఉన్న సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సి ఆర్ పీ ఎఫ్ జవాన్ పై కాల్పులు జరిగాయి. గాయాల పాలైన అతడిని చిత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు, ఆ తర్వాత చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికి అతని ఆత్మ 'న్యాయం కోసం' స్టేషన్ లో తిరుగుతుందని కధనం.

చిత్ర కృప : Akshar Pathak

లూథియానా రైల్వే స్టేషన్

లూథియానా రైల్వే స్టేషన్

లూథియానా రైల్వే స్టేషన్ దేశంలో రద్దీగా ఉండే స్టేషన్ లలో ఒకటి. ఇక్కడ రిజర్వేషన్ గదికి పక్కనే చిన్న గది ఒకటి ఉంది. అందులోంచి గట్టిగా అరుపులు వినిపిస్తుంటాయని కధనం. రిజర్వేషన్ ఉద్యోగి సుభాష్ , 2004 లో ఇక్కడే తన విధులు నిర్వహిస్తుండేవాడట. ఉద్యోగం మీద తనకున్న ప్రేమతో ఇప్పటికీ చనిపోయిన తర్వాత కూడా ఆ గదిలోనే విధులు నిర్వహిస్తున్నాడని ప్రచారంలో ఉన్నది.

చిత్ర కృప : Siddharth Setia

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X