Search
  • Follow NativePlanet
Share
» » సౌత్ ఇండియా లో ట్రెక్కింగ్ ప్రదేశాలు !

సౌత్ ఇండియా లో ట్రెక్కింగ్ ప్రదేశాలు !

సాధారణంగా, ట్రెక్కింగ్ ప్రదేశాలు పొడవుగా వుండి, వాహనాలు లభ్యంగా లేని ప్రదేశాలు అయివుంటాయి. మంచుతో ఘనీభవించిన హిమాలయాలు, ట్రెక్కర్ల ప్రాణానికి ప్రమాదం అయినప్పటికీ, ఎంతో పేరు గాంచాయి. అయితే, నేటి యువత పర్యటనలలో సాహస కార్యాలు అయిన ట్రెక్కింగ్ ల వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ట్రెక్కింగ్ చేయాలంటే, అంత దూరం వెళ్ళ నవసరం లేదు. దక్షిణ భారంత దేశంలో వివిధ ప్రదేశాలలోని అనేక స్మారకాలు, టెంపుల్స్, విస్తారమైన వైల్డ్ లైఫ్ సంక్చ్లురిలు, టీ, కాఫీ తోటలు, మొదలైన వాటితో పాటు వాటిలోనే ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశాలు కూడా కలవు.

సెలవులు వచ్చాయంటే చాలు, ప్రత్యేకించి యువకులు వీటికి ఆకర్షించ బడుతున్నారు. అందాల మున్నార్ లోని పచ్చిక మైదానాలు, కూర్గ్ కొండలు, లేదా పెరియార్ అడవులు వంటివి ట్రె క్కింగ్ విహారాలకు అనుకూలం. మరి దక్షిణ ఇండియా లోని అటువంటి ట్రెక్కింగ్ అనుకూల ప్రదేశాలు ఏవో పరిశీలిద్దాం.

 సౌత్ ఇండియా లో ట్రెక్కింగ్ ప్రదేశాలు !
సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు


తమిళ్ నాడు లోని నీల గిరి కొండలు, లేదా నీలగిరి పశ్చిమ కనుమలలో ఒక భాగం. ఇవి కర్నాటక, కేరళ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. తమిళ్ నాడు లోని నీల గిరి జిల్లలో కల ఊటీ, కోటగిరి, కూనూర్ ప్రదేశాలు ట్రెక్కింగ్ కు అనుకూలమైనవి. ఒక మాదిరి ఏటవాలు కొండలు, అనుకూలమైన వాతావరణం ట్రె క్కర్ల కు మంచి సౌకర్యంగా వుంటాయి. అతి వేడి, లేదా అతి చల్లదనం లేని ఏప్రిల్ నుండి జూన్ లేదా సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెలలు నీలగిరి లో ట్రెక్కింగ్ చేసేందుకు అనుకూల మైనవి. ఇక్కడకల అటవీ అధికారులు ట్రెక్కింగ్ కు ముందస్తు అనుమతులు కూడా ఇస్తారు.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

మీ సౌత్ ఇండియా పర్యటనలో కర్నాటక రాష్ట్రం లోని కూర్గ్ ప్రాంతం కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమే. పశ్చిమ కనుమలలోని ఈ ప్రదేశం వర్షాకాలం అయిన జూన్ - సెప్టెంబర్ తప్పించి మిగిలిన కాలం ట్రెక్కింగ్ కు అనుకూలంగా వుంటాయి. జనవరి నుండి మార్చ్ వరకు అనుకూల సమయం. కర్ణాటకలో బ్రహ్మగిరి పర్వత శ్రేణులు, పుష్పగిరి కొండలు అనుకూల ప్రదేశాలు. జలపాతాలు కల ఇరుప్పు ఫాల్స్, అబ్బే ఫాల్స్ కొండలు, తడియాన్దమోల్ మరియు నాగర్ హోలే నేషనల్ పార్క్ లు కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమే. అయితే ఈ ప్రాంతంలో వాతావరణం, అక్కడ కల జంతువుల గురించి అధిక సమాచారం తెలిసి వుండాలి.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు


కేరళ లోని పీర్ మేడ్ ప్రదేశాన్ని సందర్శకులు దాని అందాలను చూసేందుకే కాదు, ట్రెక్కింగ్ కు కూడా వస్తారు. ఇక్కడ ట్రెక్కింగ్ మాత్రమే కాక, పార గ్లైడింగ్, హార్స్ రైడింగ్, సైక్లింగ్ క్రీడలు కూడా ఆనందించవచ్చు. పీర్ మేడ్ సమీపంలో కల కుట్టి కానం, కాల తొట్టి , వగమోన్ కొండ చరియలు ట్రెక్కింగ్ కు అనుకూలం. పీర్ మేడ్ కు 4 కి. మీ. ల దూరం లో కల పీరు కొండలు కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమైనవే. ఈ ట్రెక్కింగ్ టూర్ కు ఏప్రిల్ - జూన్ మరియు సెప్టెంబర్ - నవంబర్ నెలలు అనుకూలం.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

ఆంద్ర ప్రదేశ రాష్ట్రం లోని విశాఖపట్నం లో కల అనంతగిరి హిల్స్ కూడా ట్రెక్కింగ్ ఆనందాలకు అనుకూలమే. ఈ పర్వత శ్రేణుల చుట్టూ ట్రెక్కింగ్ కు అనుకూలమైన అనేక చిన్న చిన్న కొండలు, అటవీ ప్రదేశాలు కలవు. ఇక్కడి అడవులు అంత దట్టమైన కావు. కనుక ట్రెక్కింగ్ తేలికగా వుంటుంది. ఈ ప్రాంతం మొదటి సారి ట్రెక్కింగ్ చేసేవారికి అనుకూలం. మీ ఈ ట్రెక్కింగ్ టూర్ ల లో అందమైన ప్రకృతి దృశ్యాలు అనేకం చూసి ఆనందించవచ్చు.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

కర్నాటక రాష్ట్రంలోని షిమోగా లో కల కోడచాద్రి కొండలు ట్రెక్కింగ్ కు అనుకూల ప్రదేశాలు కలిగి వున్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే, శారీరక సామర్ధ్యం అధికంగా వుండాలి. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూల సమయం. కోడచాద్రి లోని కరి కట్టే గేటు ఒక మంచి ట్రెక్కింగ్ ప్రదేశం. 12 - 14 కి. మీ. ల దూరం 7 నుండి 8 గంటల లోపు ట్రెక్ చేసేలా వుంటుంది. ట్రెక్కింగ్ సమయంలో ఇక్కడ కల గణేశ గుహ, హిండ్లు మనే ఫాల్స్, బెలకల్లు తీర్థ ప్రదేశాలు చూడవచ్చు. అటవీ అధికారుల ముందస్తు అనుమతులతో వసతి కొరకు టెంట్ లు కూడా వేసుకోనవచ్చు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

కేరళ రాష్ట్రం లోని మున్నార్ ఒక అతి సుందరమైన హిల్ స్టేషన్. ట్రెక్కింగ్ కు ప్రేసిద్ధి. ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ లో ఎన్నో సుందర ప్రదేశాలు చూడవచ్చు. అనేక వంపు సొంపులు కల మార్గాలు, తేయాకు తోటల మధ్య చేసే ట్రెక్కింగ్ ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. మున్నార్ లో అనముడి అతి పెద్ద శిఖరం. ఈ శిఖరం ఎక్కేందుకు సాహసిక ట్రెక్కర్లు ఇష్టపడతారు. ఇక్కడి తేయాకు తోటల మధ్య చేసే ట్రెక్కింగ్ మీకు మరువలేని అనుభవాలను అందిస్తుంది.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

కేరళ రాష్ట్య్రం లోని వయనాడ్ ప్రదేశంలో కల చేమ్బ్రా శిఖరం అతి ఎత్తైనది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయటం సాహసంతో కూడినది. ట్రెక్కింగ్ పరికరాలను జిల్లా టూరిసం ప్రమోషన్ కౌన్సిల్ సంస్థ సరఫరా చేస్తుంది. శిఖరం పైకి చేరినవారు, ఇప్పటి వరకూ ఎప్పుడూ ఎండిపోని ఒక హార్ట్ షేప్ లో కల ఒక సుందరమైన సరస్సు చూడవచ్చు. శిఖరం పై భాగం నుండి వయనాడ్ జిల్లా పూర్తిగా కనపడుతుంది. ప్రకృతి ప్రియులు చేమ్బ్రా శిఖరం చుట్టుపట్ల ఎన్నో అందమైన దృశ్యాలను తనివితీరా చూసి ఆనందించవచ్చు.

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

సౌత్ ఇండియా లోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు

కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో కల ఈ ప్రదేశం కర్నాటకతో సరిహద్దు పంచు కొంటుంది. పశ్చిమ కనుమల లోని అందమైన ఈ ప్రదేశంకు అనేకమంది ఫోటోగ్రాఫర్ లు, ప్రకృతి ప్రియులు, ట్రె క్కర్లు తప్పక వస్తారు. పైతమాల ట్రెక్కింగ్ చేయాలంటే, జూన్ - అక్టోబర్ లేదా జనవరి - మార్చ్ నెలలు అనుకూలం. ఏనుగులు, జలగల సమస్యలు ఇక్కడ సాధారణంగా వుంటాయి. కొండపై కల ఒక పరిశీలనా టవర్ వాలీ లోని సుందర దృశ్యాలు చూపుతుంది. టవర్ వద్ద నుండి దట్టమైన అడవులు మొదలు అవుతాయి. పైతలమాల ట్రెక్కింగ్ కు ఉదయం వేళ అనుకూలం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X