Search
  • Follow NativePlanet
Share
» » మైసూరుకు వెళ్లి ఏమి చేయాలబ్బా

మైసూరుకు వెళ్లి ఏమి చేయాలబ్బా

మైసూరు పర్యాటకంలో చేయదగిన పనుల గురించి కథనం.

ముఖ్యంగా నాలుగు గోడల మధ్య దీర్ఘ చతురస్రాకారపు బాక్స్ ముందు కొర్చొని బోర్ కొడుతూ ఉంది కదా. మీ కోసమే మరో కొన్ని గంటల్లో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ లో ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలి? వెళ్లిన తర్వాత ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా? అలాంటి ఆలోచనలు ఉన్నవారి కోసమే ఈ కథనం. బెంగళూరు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరు కు వెళ్లి అక్కడ ఏమి చేయాలని ఈ కథనం మీకు వివరిస్తుంది. మరెందుకు ఆలస్యం చదవండి, వెళ్లండి, ఎంజాయ్ చేయండి.

మైసూరు ప్యాలెస్

మైసూరు ప్యాలెస్

P.C: You Tube

మొదట ఓటు ప్యాలెస్ కే వెయ్యండి. అవును మైసూరును సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటారు. ఈ రాచనగరిలోని ప్యాలెస్ ను అంబావ్యాలీ ప్యాలెస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇండో ప్యాశ్చత్య శైలితో నిర్మితమైన

ఈ ప్యాలెస్ ను చూడటానికే చాలా మంది ఈ రాచనగరి మైసూరుకు వస్తుంటారు.

ఎంట్రీ ఫీ విద్యార్థులను రూ.10, పిల్లలకు రూ.30 పెద్దలకు రూ.50

సమయం ఉదయం 10. గంటల నుంచి 5.30 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల నుంచి 7.45 వరకూ లైటింగ్, సౌండ్ షో

 బృందావన్ గార్డెన్స్

బృందావన్ గార్డెన్స్

P.C: You Tube
సాయంత్రం సమయంలో మైసూరు నగరంలో ఏమి చేయాలన్న సందేహమే వద్దు. మీ కోసం ఆ రాచనగరిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బృందావన్ గార్డెన్ రారమ్మని పిలుస్తోంది. పిల్లలు, పెద్దలతో పాటు ప్రతి

ఒక్కరికీ ఈ ప్రాంతం ఎంతగానో నచ్చుతుంది. వివిధ రంగులు, ఆకారాల్లోని చెట్లు, ఫౌటెంన్లు మదిని పులకింప జేస్తాయి.

ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.5

సమయం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకూ

పట్టు చీరలు కొనండి

పట్టు చీరలు కొనండి

P.C: You Tube

స్వచ్ఛమైన పట్టు వస్త్రాల కొనుగోలు చేయాలంటే మైసూరు కు మించిన ప్రాంతం మరొక్కటి లేదు. ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్యాక్టరీ నుంచి మనకు స్వచ్ఛమైన పట్టు చీరలు సరసమైన

ధరలకు దొరుకుతాయి.

జంతుప్రేమికులు మీరైతే

జంతుప్రేమికులు మీరైతే

P.C: You Tube

మీరు జంతు ప్రేమికులైతే మైసూరులోని జూ మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడ వివిధ దేశాలకు చెందిన ఎన్నో రకాల జంతువులను చూడవచ్చు. ఇదిలా ఉండగా మైసూరు జూలో కనిపించే కొన్ని రకాల

జంతువులు పక్షులు భారత దేశంలో మరే ఇతర జూలో కూడా కనిపించవు.

ఎంట్రీ ఫీ మామూలు రోజులో పెద్దలకు రూ.50, చిన్న పిల్లలకు రూ.20, అదే విధంగా వీకెండ్స్ లో అయితే ఈ ధర వరుసగా రూ.60, రూ.30

కారంజీ లేక్ సందర్శన

కారంజీ లేక్ సందర్శన

P.C: You Tube

ప్రక`తి ప్రేమికులు మీరైతే మైసూరులోని కారంజీ లేక్ మీకు పచ్చటి కార్పెట్ ను పరుస్తుంది. ఇక్కడ బోటింగ్ కు కూడా అవకాశం ఉంది.

ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5, ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం రూ.25 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

సమయం మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ

మైసూరు పాక్, బిసీబెలే బాత్ టేస్ట్ చేయడం మరిచిపోకండి

మైసూరు పాక్, బిసీబెలే బాత్ టేస్ట్ చేయడం మరిచిపోకండి

P.C: You Tube

మైసూరులో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అత్యుత్తమైన టేస్టీ మైసూర్ పాక్ దొరుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి మైసూర్ పాక్ వంటకాన్ని పరిచయం చేసింది ఈ రాచనగరి. అంతే కాకుండా కర్నాటక వంటకాలు అన్న తక్షణం మనకు గుర్తుకు వచ్చే బిసీబెలెబాత్ కూడా ఈ మైసూరులో చాలా బాగుంటుంది.

త్రీడీ సెల్ఫీ గ్యాలరీ

త్రీడీ సెల్ఫీ గ్యాలరీ

P.C: You Tube

మైసూరులోని ప్రఖ్యాతి గాంచిన స్యాండ్ మ్యూజియంలో త్రీడీ సెల్ఫీ గ్యాలరీ ఉంది. ముఖ్యంగా 3 డీ విధానంలో రూపొందిన చిత్రాలను చూడవచ్చు. అక్కడ సెల్ఫీ తీసుకునొ మీకు నచ్చిన, మిమ్ములను మెచ్చిన వారికి పంపించి ఆనందం పొందవచ్చు.

రాజు, రాణి వైభోగం కోసం

రాజు, రాణి వైభోగం కోసం

P.C: You Tube

రాచనగరి మైసూరులో మీరు కూడా రాజు, రాణిలాగా మారిపోవచ్చు. కొద్దిగా సొమ్ము ఖర్చుపెట్టాలేకాని మిమ్ములను రాజు రాణిలా భావించి సేవలు అందించడానికి ఎన్నో హోటల్స్ ఇక్కడ స్వాగతం పలుకుతూ
ఉంటాయి. ముఖ్యంగం ఒకటి కంటే ఎక్కువ రోజులు మైసూరులో ఉండి పర్సు బరువును తగ్గించుకోవాలనుకొన్నవారికి మాత్రమే ఈ సూచన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X