Search
  • Follow NativePlanet
Share
» »రాంచి పర్యాటక వెళొద్దాం పదండి?

రాంచి పర్యాటక వెళొద్దాం పదండి?

ఎం.ఎస్ థోని స్వస్థలం రాంచి చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

క్యాప్టన్ కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని స్వస్థలం రాంచి అన్న విషయం అందరికీ తెలిసిందే. రాంచీ జార్ఘండ్ రాజధాని. ఈ రాంచీ ఉత్తమ పర్యాటక కేంద్రం కూడా. ఈ నేపథ్యంలో రాంచి, రాంచి చుట్టు పక్కల చూడదగిన ప్రాంతాలతో పాటు అక్కడ దొరికే విభిన్న ఆహార పదార్థాలకు సంబంధించిన కథనం మీ కోసం...

అత్యంత రుచి కరమైన ఆహారం

అత్యంత రుచి కరమైన ఆహారం

P.C: You Tube

రాంచీ పట్టణం అత్యంత రుచికరమైన ఆహారానికి పెట్టింది పేరు. ఇక్కడ పూరి నుంచి మొదలుకొని జిలేబీ వరకూ ప్రతి ఒక్క ఆహార పదార్థం రుచిగానే ఉంటుంది. ముఖ్యంగా పూరి అందులోకి ఇచ్చే కుర్మా. మిగిన ప్రదేశాల్లో దొరికే వాటితో పోలిస్తే ఇక్కడ పూరి, ఆలూతో చేసిన కుర్మా చాలా రుచిగా ఉంటుంది.

పటకుల్లి వ్యాలీ

పటకుల్లి వ్యాలీ

P.C: You Tube

జార్ఘండ్ లో రాంచికి దగ్గర్లో ఉన్న పటకుల్ వ్యాలీ అంత్యంత అందమైన ప్రాంతం. ఒంపులు తిరిగిన ఈ ప్రాంతంలో ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేమం లేదు.

చాట్ షాప్

చాట్ షాప్

P.C: You Tube

రాంచీలో ఏ వీధిలో చూసిన చాట్స్ అమ్మే దుకాణాలే కనిపిస్తాయి. ఉదయంతో పోలిస్తే సాయంకాలమే ఈ చాట్స్ దుకాణాలు ఎక్కువగా తీస్తారు. అందువల్ల పర్యాటకులు ఎక్కువగా సాయంకాలమే ఈ దుకాణాలు ఉన్న వీధుల్లో తిరుగుతూ కనిపిస్తారు.

అండ్రే హౌస్

అండ్రే హౌస్

P.C: You Tube

రాంచి పర్యాటకానికి వెళ్లినవారు తప్పకుండా అండ్రే హౌస్ ను సందర్శిస్తారు. ఇక్కడ అనేక అందమైన వస్తువులు, ఫర్నీచర్, దుస్తులు, మహిళల మేకప్ కిట్ లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

మోమోస్ రుచి

మోమోస్ రుచి

P.C: You Tube

రాంచి మోమోస్ కు పెట్టింది పేరు. ముఖ్యంగా నేపాల్ నుంచి వచ్చినవారు ఇక్కడ ఎక్కవగా వీటిని తయారు చేసి అమ్ముతుంటారు. అందువల్ల ఈ మోమోస్ కు అంత రుచి. రాంచి వెళ్లిన పర్యాటకులు వీటిని తప్పకుండా రుచి చూస్తారు.

దుర్వా డ్యామ్

దుర్వా డ్యామ్

P.C: You Tube

రాంచిలో సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాల్లో ధుర్వా డ్యామ్ ప్రముఖమైనది. ఇక్కడ బోటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ దుర్వాడామ్ అటు పిల్లలతో పాటు పెద్దలకు కూడా తప్పకుండా నచ్చుతుంది.

మోరదాబాద్ మైదానం

మోరదాబాద్ మైదానం

P.C: You Tube

రాంచి భారతీయ సంస్క`తి సంప్రదాయాలకు, జానపథ కథలకు నిలయం. రాంచిలోని మోరదాబాద్ మైదానంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా జానపద న`త్యాల ప్రదర్శన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందువల్లే రాంచిలో ఒక రోజు రాత్రి ఉండాలనుకొనేవారు ఖచ్చితంగా ఈ మైదానాన్ని సందర్శిస్తూ ఉంటారు.

నక్షత్ర ఉద్యానవనం

నక్షత్ర ఉద్యానవనం

P.C: You Tube

జార్ఘండ్ అటవీశాఖ నిర్వహణలో ఉన్న ఉద్యానవనం రాంచీలోని రాజ్ భవన్ కు దగ్గర్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రతి మొక్క చాలా అందంగా ఉంటుంది. వివిధ లతలు, తీగలను వివిధ రకాల ఆకారాల్లో కత్తిరించిన విషయం మనకు అద్భుతమనిపిస్తుంది.

రాంచి సరోవరం

రాంచి సరోవరం

P.C: You Tube

రాంచి సరోవరం రాంచి నగరం మధ్య భాగంలో ఉంటుంది. ఇక్కడ కూడా బోటింగ్ కు అవకాశం ఉంది. రాంచీలోని జీ.పీ.వోకు దగ్గర్లో ఉన్న ఈ సరోవరం పిక్నిక్ స్పాట్ కూడా. అందువల్లే వీకెండ్ రోజుల్లో ఇక్కడ ఎక్కువ మంది పర్యాటకులు కనిపిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X