Search
  • Follow NativePlanet
Share
» » ప‌చ్చ‌ని ప్ర‌పంచ‌పు ప‌ర్యాట‌క‌ అనుభవం.. ఖిర్సు మైదానాల్లో విహారం!

ప‌చ్చ‌ని ప్ర‌పంచ‌పు ప‌ర్యాట‌క‌ అనుభవం.. ఖిర్సు మైదానాల్లో విహారం!

ప‌చ్చ‌ని ప్ర‌పంచ‌పు ప‌ర్యాట‌క‌ అనుభవం.. ఖిర్సు మైదానాల్లో విహారం!

మ‌న‌లో చాలామందికి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇలాంటివారు నిత్యం అలాంటి స‌రికొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటివారి కోసం ప్ర‌కృతి అందాల‌తో నిండిన ఓ అద్భుత‌మైన ప్ర‌దేశం గురించి తెలుసుకోబోతున్నాం. అవే, ఖిర్సు ప‌ర్యాట‌క మైదానాలు. ఈ లోయలతో నిండిన ప‌చ్చ‌ని ప్ర‌పంచం.. శీతాకాలం వ‌చ్చిందంటే ప్ర‌కృతి ప్రేమికుల‌ను మ‌రింత ఆక‌ర్షిస్తుంది.

ఉత్తరాఖండ్‌లో ఖిర్సులాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే, ఖిర్సుమైదాల‌కంటూ చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఇక్క‌డికి ఒక్క‌సారి వ‌స్తే చాలు. మ‌ళ్లీ తిరుగుప్ర‌యాణం అయ్యేందుకు స‌సేమీరా అంటూ చిన్న‌పిల్ల‌ల్లా మారాం చేస్తారు. శీతాకాలంలో ఉత్తరాఖండ్‌లోని ఖిర్సు లోయ‌ల అందాల‌ను చూసిన త‌ర్వాత మళ్లీ మళ్లీ ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారంటే న‌మ్మండి. మ‌రీముఖ్యంగా, స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గ‌డిపేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశంగా దీనిని చెప్పుకోవ‌చ్చు.

ఖిర్సు పార్క్

ఖిర్సు పార్క్

ఖిర్సులోని అందమైన మైదానాలలో ఖిర్సు పార్క్ ఒక‌టి. ఈ పార్క్ స‌హ‌జ‌సిద్ధ అందాలు చూప‌రుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. ఈ సీజ‌న్‌లో ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. ఇక్క‌డి అందాల‌ను చూసిన త‌ర్వాత మీరు ఖచ్చితంగా జమ్మూ-కాశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్‌ని మరచిపోతారు. ఎటుచూసినా.. చుట్టూ ఎత్త‌యిన పర్వతాలు మరియు దేవదార్ చెట్లు ఖిర్సు పార్క్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు ఇక్కడ ఎదుర‌య్యే అనుభ‌వాలు జీవితంలో మ‌ర్చిపోలేరు. అందుకే, ప్ర‌త్యేకించి ఈ సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఇక్కడ విహరించడానికి వస్తారు.

దేవల్‌గర్ రోడ్

దేవల్‌గర్ రోడ్

ఖిర్సులోని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో దేవ‌ల్‌గ‌ర్ రోడ్‌ను అస్సలు మ‌ర్చిపోవ‌ద్దు. ఖిర్సు పర్వతం మీద ఉన్న దేవల్‌గర్ రోడ్ ఒక మతపరమైన ప్రదేశం. ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ప్రధాన నగరం నుండి దేవల్‌ఘర్ రోడ్డు వైపు వెళుతున్నప్పుడు చుట్టుపక్కల ప్ర‌కృతి0 దృశ్యాన్ని చూసేందుకు రెండు క‌ళ్లూ చాల‌వంటే న‌మ్మండి. మంచు కురిసే సమయంలో ఎక్కడ చూసినా తెల్ల‌ని దుప్ప‌టి క‌ప్పుకున్న నేల పొర‌లు మాత్రమే కనిపిస్తాయి. అందమైన హిమపాతం చూసిన తర్వాత, ఖచ్చితంగా ఇక్క‌డే ఉండిపోతే ఎంత‌బావుంటుంది అని కోరుకునేవారు బ‌హుశా ఉండ‌క‌పోవ‌చ్చు.

కండోలియా ఆలయం

కండోలియా ఆలయం

ఇక్క‌డి పర్వతం పైభాగంలో ఉన్న కండోలియా ఆలయం ఖిర్సులో సందర్శనీయ ప్ర‌దేశాల‌లో ఒక‌టి. దీనిని మ‌త‌ప‌ర‌మైన ప‌విత్ర ప్ర‌దేశంగా భావిస్తారు. ఈ ఆల‌య నిర్మాణ శైలి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసే ఈ ఆల‌య చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాలు స‌రికొత్త ప‌ర్యాట‌క అనుభూతిని ప‌రిచ‌యం చేస్తాయి. ఇక్క‌డి ఆలయం చుట్టూ పచ్చని అడవులు.. తెల్లటి మంచుతో కప్పబడిన పర్వతాలు.. ఎత్త‌యిన‌ దేవదారు చెట్లు ఈ ప్రదేశానికి మ‌రింత అందాన్ని తెచ్చిపెడ‌తాయి. మంచు కురిసే సమయంలో కండోలియా ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పవిత్ర ఆలయానికి చేరుకోవాలంటే కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ఖిర్సులో ఈ కార్యకలాపాలను ఆస్వాదించండి

ఖిర్సులో ఈ కార్యకలాపాలను ఆస్వాదించండి

ఖిర్సులోని ఈ ఉత్తమ ప్రదేశాలను సందర్శించడంతో పాటు, మీరు అనేక సాహస కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ ట్రాకింగ్‌తోపాటు మంచు ముద్ద‌ల‌మ‌ధ్య‌ స్నో రైడ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. ప్ర‌శాంతంగా యాపిల్ తోటలలో నడకకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది.

Read more about: khirsu uttarakhand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X