Search
  • Follow NativePlanet
Share
» » త్రిస్సూర్ వేడుకలు - ఏనుగుల పండుగ !

త్రిస్సూర్ వేడుకలు - ఏనుగుల పండుగ !

పండుగ మనుషులకు కాదు...ఏనుగులకు అంటే నమ్ముతారా ? ఏర్పాట్లు అన్నీ మనుషులవే. కాని పండుగ మాత్రం ఎనుగులకి. త్రిస్సూర్ పూరం అనేది కేరళ లోని త్రిస్సూర్ పట్టణంలో ప్రతి ఏటా జరిగే ఒక పండుగ. ఏనుగుల ఊరేగింపు ఈ వేడుకలలో భారీ ఎత్తున జరుగుతుంది. కేరళ లో దేవాలయ పండుగలు అధికం. ఈ పండుగలలో వారు ఏనుగులకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తూ వుంటారు. కేరళ రాష్ట్ర జంతువు అయిన ఏనుగు అంటే వారు అమితంగా ప్రేమిస్తారు. ఎ పండుగ నిర్వహించినా దానిలో కనీసం ఒక ఏనుగు అయినా సరే ఉండాల్సిందే. కేరళ లోని త్రిస్సూర్ లో ఈ సంవత్సరం మే 9 వ తేదీ నుండి ఏనుగుల ఘీన్కారాలతో అట్టహాసంగా ఈ పండుగ ప్రారంభం కానుంది.

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

త్రిస్సూర్ ఏనుగుల పండుగ సుమారు 200 సంవత్సరాల కిందట ఇక్కడ మొదలైంది. అప్పటి ఆ ప్రాంత పాలకుడు, తెగల మధ్య పోరాటాలను అరికట్టేందుకు ఈ పండుగ నిర్వహించాడు. ప్రతి సంవత్సరం వద్దక్కునాతాన్ టెంపుల్ లో ఈ పండుగ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర దేవాలయాల దేవతలను కూడా ఇక్కడకు ఆహ్వానిస్తారు.

Pic Credit: Brian Holsclaw

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ప్రధాన ఉత్సవానికి ఏడూ రోజుల ముందే ఈ వేడుకలు మొదలవుతాయి.

Pic Credit: Brian Holsclaw

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగులను పోటీలు పది మరీ ఈ వేడుకలలో అలంకరిస్తారు.

Pic credit: Wiki Commons

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఈ వేడుకలలో సుమారు 250 మంది కళాకారులు పాల్గొంటారు. రాత్రివేళ పటాకులు కాలుస్తారు.

Pic Credit: Wiki Commons

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ప్రధాన పండుగ ఉత్సవం మొదలైన రోజు నుండి ఏడవ రోజున వైభవోపేతంగా ఫైర్ వర్క్స్ తో నిర్వహిస్తారు.
Pic Credit: Challiyil Eswaramangalath Pavithran Vipin

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

ఏనుగుల ఘీంకారాలు - భక్తుల నృత్యాలు !

వద్దక్కునాతాన్ టెంపుల్
వద్దక్కునాతాన్ టెంపుల్ సుమారు 200 సంవత్సరాల ప్రాచీనమైనది. లోపల ఒక మ్యూజియం కూడా కలదు. ప్రతి సోమవారం మరియు పబ్లిక్ హాలిడే లలో ఇది మూసి వుంటుంది.

Pic Credit: Wiki Commons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X