Search
  • Follow NativePlanet
Share
» » మంత్రాలయం - మహిమాన్విత ప్రదేశం!

మంత్రాలయం - మహిమాన్విత ప్రదేశం!

ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో మంత్రాలయం పుణ్య క్షేత్రం కలదు. అత్యద్భుతం అయిన ఈ ప్రదేశాన్ని పుణ్య క్షేత్రం అంటే పర్యటనా ప్రాధాన్యత తగ్గించి నట్లే. ఎంతో అందమైన ఈ మంత్రాలయం పవిత్రమైన తుంగభద్రా నది ఒడ్డున కలదు. శ్రీ మధ్వాచార్య ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంతం బోధన గావించిన మహా జ్ఞాని, వేదాంత పండితుడు అయిన శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయిన బృందావనం ఇక్కడ కలదు.

శ్రీ రాఘవేంద్ర స్వామీ 16 వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప మహిమాన్విత పండితుడు. శ్రీ రాఘవేంద్రస్వామి ఇక్కడకు వచ్చిన భక్త పర్యాటకులకు ఒక దివ్యత్వాన్ని కలిగిస్తాడు. ఈ దివ్యత్వాన్ని అనుభవిన్చేదుకు భక్తుడైన ప్రతి పర్యాటకుడు మంత్రాలయం తప్పక దర్శించి తీరాలి. టెంపుల్ పరిసరాలలోకి ప్రవేశిస్తే చాలు మహిమాన్విత రాఘవేంద్ర ఆశీస్సులు లభించి జ్ఞానం పొందుతారు. ఈ పవిత్ర బృందావన ప్రదేశానికి ప్రతి రోజూ వేలాది భక్తులు వస్తారు. అధిక భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వామీ బృందావనానికి పూజలు చేసి ఆరాధిస్తారు. ఆ పుణ్య పురుషుడి యొక్క నివారణా మహిమలను స్వయంగా అనుభవించి ఆనందిస్తారు.

ఎండలు, వానలు, వరదలు, కరవులు కాలం ఏదైనప్పటికీ ఈ ప్రదేశానికి ప్రజలు నిరంతరం అధిక సంఖ్యలో వచ్చి బృందావన దర్శనం చేసుకుంటారు. మంత్రాలయ ప్రదేశం ప్రత్యేకించి వేకువ ఝామున లేదా రాత్రి బాగా పోయిన తర్వాతా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. మరపు రాని అనుభవాలను ప్రతి ఒక్క భక్తుడు అస్వాదిస్తాడు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం అంటే ఆగష్టు - సెప్టెంబర్ నెలలో జరిగే శ్రీ రాఘవెంద్రుల ఉత్సవ వేడుకలు ప్రతి వారిని సంతోషింప చేస్తాయి.

 మంత్రాలయం - మహిమాన్విత ప్రదేశం!

మంత్రాలయానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో మరొక అద్భుత ప్రదేశం అయిన బిచాలి గ్రామం కలదు. ఇది అప్పన్నాచార్య జన్మ స్థలం. ఈయన శ్రీ రాఘవేంద్ర స్వామీ భక్తుడు, మహిమాన్వితుడు. తుంగభద్రా నదీ ప్రవాహ ధ్వనులు, చల్లని గాలి, ఎల్లపుడూ సాగే మంత్రాల ధ్వనులు ఈ ప్రదేశ మహిమను మరింత పెంచి భక్తులు నిరంతరం అక్కడకు వచ్చేలా చేస్తాయి.

శ్రీ రాఘవేంద్ర స్వామీ ప్రసిద్ధులైన శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని అనేక సంవత్సరాల సాధన తో ప్రచారం చేసారు. ఇక్కడ కల చిన్న కొండపై కల ఒక పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం లో ఆయన సుమారు పన్నెండు సంవత్సరాల దీర్ఘకాలం తపస్సు చేశాడని చెపుతారు.

మీరు మంత్రాలయం వెళ్ళినపుడు, ఈ ప్రదేశాన్ని తప్పక మీరు చూడవలసిన ప్రదేశాల జాబితాలో చేర్చండి. దైనందిన మీ ఒత్తుడులకు కనీసం కొంత కాలం దూరంగా ఉండాలంటే, మంత్రాలయం వంటి మహిమాన్విత ప్రదేశం తప్పక చూసి తీరాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X