Search
  • Follow NativePlanet
Share
» »క‌ళాత్మ‌క వ‌స్తువుల భాండాగారం.. సాలార్ జంగ్ మ్యూజియం

క‌ళాత్మ‌క వ‌స్తువుల భాండాగారం.. సాలార్ జంగ్ మ్యూజియం

క‌ళాత్మ‌క వ‌స్తువుల భాండాగారం.. సాలార్ జంగ్ మ్యూజియం

అల‌నాటి రాచ‌రిక‌పు చారిత్ర‌క నేప‌థ్యాన్ని క‌ళ్లారా చూడాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. అవ‌కాశం దొరికితే ఆ మ‌దురానుభూతిని పెందుందుకు ఉత్సుక‌త చూపేవారికి కొద‌వే ఉండ‌దు. అలాంటివారి గ‌మ్య‌స్థానం హైద‌రాబాద్‌లోని సాలార్ జింగ్ మ్యూజియం అని చెప్పొచ్చు. గ‌జిబిజి న‌గ‌రంలో నిక్షిప్తమైన ఈ మ్యూజియం చ‌రిత్ర‌ప్రేమికులకు కేర‌ఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంద‌న‌డంలో సందేహ‌మే లేదు. మ‌రెందుకు ఆల‌స్యం.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని సంత‌రించుకుంటోన్న భాగ్య‌న‌గ‌ర‌పు మ‌ణిహారం సారార్ జింగ్ మ్యూజియం విశేషాల‌ను తెలుసుకుందాం రండి!

ప్ర‌పంచంలోని విభిన్న యూరోపియ‌న్‌, ఆసియా, దూర ప్రాశ్చ్య దేశాల‌ క‌ళాత్మ‌క వ‌స్తువుల భాండాగారం సాలార్ జంగ్ మ్యూజియం. భాగ్య‌న‌గ‌రం హైదరాబాద్‌లో కొలువై ఉన్న ఈ సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దదిగా పేరుగాంచింది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన కలాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు.

అక‌ట్టుకునే భిన్న‌మైన ఆకృతులు

అక‌ట్టుకునే భిన్న‌మైన ఆకృతులు

ఈ సేక‌ర‌ణ‌లో అగ్ర‌భాగం మూడ‌వ సాలార్ జంగ్‌ సేక‌రించారు. 1914లో సాలార్ జంగ్‌ త‌ర్వాత హెచ్ఈహెచ్ ప్ర‌ధాన మంత్రి నిజాం ఏడ‌వ న‌వాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సేక‌రించారు. దేశ‌విదేశాల‌లో ప‌ర్య‌టించి, అద్భుత‌మైన క‌ళాఖండాల‌ను సేక‌రించి ఈ ప్యాలెస్ ఉంచారు. ప్ర‌ధానంగా ఇక్క‌డి మ్యూజియంలో నాణేల సేక‌ర‌ణ గ్యాల‌రీ సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. డిస్‌ప్లేలో నాణేల‌ను ముద్రించిన రాజుల చ‌రిత్ర‌తో కూడిన పూర్తి వివ‌రాలు ఇక్క‌డ పొందుప‌ర‌చారు. అలాగే, దీనిని ఆనుకుని ఉండే ఫ‌ర్నీచ‌ర్ గ్యాల‌రీ చూప‌రుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తుంది. పూర్తిగా చెక్క‌తో చేయ‌బ‌డిన ఫ‌ర్నీచ‌ర్‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతారు. వీటి త‌యారీతోపాటు అక‌ట్టుకునే భిన్న‌మైన ఆకృతులు సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

అలనాటి అపురూప కళాఖండాలు

అలనాటి అపురూప కళాఖండాలు

ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్‌ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. భాగ్య‌న‌గ‌రంలో దాగిన అపురూప చారిత్ర‌క బాండాగారం సాలార్‌ జంగ్‌ మ్యూజియంను కనులారా వీక్షించేందుకు సిద్ధ‌మ‌వ్వండి.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్‌కు చాలా సమీపంలో ఉంది. సాలార్ జంగ్ మ్యూజియం బస్టాండ్‌కు చేరుకోవడానికి ఐదు నిమిషాల సమయం పట్టే హైదరాబాద్ బస్ స్టాండ్ నుండి ఉప్పుగూడ వైపు బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుండి మ్యూజియంకు కేవలం రెండు నిమిషాల నడక దూరంలో ఉంది. సొంత‌వాహ‌నంలో అయితే, హైదరాబాద్ బస్ స్టాండ్ నుండి మ్యూజియంకు కేవలం రెండు నిమిషాలు పడుతుంది. నడకను ఇష్టపడేవారు హైదరాబాద్ బస్ స్టేషన్ నుండి మ్యూజియం చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది.

ఉత్త‌మ స‌మ‌యం..

ఉత్త‌మ స‌మ‌యం..

సాలార్ జంగ్ మ్యూజియం సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం. హైదరాబాద్ నగరంలో అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావ‌ర‌ణం చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ‌స‌మేతంగా విహ‌రించేందుకు ఇదే ఉత్త‌మ‌మైన స‌మ‌యంగా చెప్పొచ్చు. మ్యూజియం సంద‌ర్శ‌న కోసం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అనువైన సమయం.

Read more about: salar jung museum hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X