Search
  • Follow NativePlanet
Share
» »మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు...దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే నాశనం...

మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు...దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే నాశనం...

అచంటకు సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

పరమశివుడి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిథి, వారం, నక్షత్రమే కాకుండా నిర్మలమైన మనస్సుతో తనను ఏ రూపంలోనైనా, ఏ సమయంలోనైనా కొలిచినా సదరు భక్తులను కరుణిస్తానని చెబుతున్న బోళా శంకరుడు. ఈ కోవకు చెందినదే అచంట గ్రామం. ఆచంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. మండలము.

ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశంఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం

ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయములు బహుళ ప్రసిద్ధి చెందినవి. రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. ఆ కథను అసరించే ఇక్కడి స్వామిని అచంటేశ్వరుడని ఆ గ్రామాన్ని అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది కొంత వింతగా ఉన్న చాలా కాలంగా ఈ విషయాన్ని ఇక్కడి స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడి లింగరూపంలోని పరమశివుడిని దర్శిస్తే ఏడు జన్మల పాపం వెంటనే తొలిగిపోతుందని నమ్ముతారు.

1. అక్కడ ఉండటం వల్లే

1. అక్కడ ఉండటం వల్లే

Image source:


ఆచంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. మండలము.ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయములు బహుళ ప్రసిద్ధి చెందినవి. రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. ఆ కథను అసరించే ఇక్కడి స్వామిని (ఆ చన్నున) అచంటేశ్వరుడని ఆ గ్రామాన్ని అనే పేరుతో పిలుస్తున్నారు.

2. బ్రాహ్మణుడు ఇక్కడకు చేరుకుంటాడు

2. బ్రాహ్మణుడు ఇక్కడకు చేరుకుంటాడు

Image source:


కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జరుపుకోవాలని భావించిన తమిళనాడుకు చెందిన ఒడనంబి అనే బ్రాహ్మణ భక్తులు తమిళనాడు నుంచి బయలు దేరుతారు. కొన్ని రోజుల ప్రయాణం చేసిన తర్వాత ప్రస్తుతం అంచ ఉన్న గ్రామానికి చేరుకుంటాడు. రాత్రి బస కోసం ఓ ఇంటిలో బస చేస్తారు. అయితే అటు పై ఒడనంబికి అది ఒక వేశ్య ఇల్లు అని తెలుస్తుంది.

3.సర్వ శుఖలాలసుడై

3.సర్వ శుఖలాలసుడై

Image source:


అయినా ఆమె ఆతిథ్య సేవలకు ముగ్థుడైన ఒడనంబి తాను బ్రాహ్మణుడు, తాను శివరాత్రి లోపు కాశీకి చేరుకోవాలన్న ధ్యాసను కూడా మరిచిపోయి ఆ వేశ్య ఇంటిలోనే సర్వ శుఖలాలసుడై ఉండి పోతాడు. ఆ వేశ్య కూడా ప్రతి రోజూ బ్రాహ్మణుడైన ఒడనంబికి పలు రకాల పిండి వంటలతో భోజనం సమకూర్చడమే కాకుండా తన అంద చెందాలతో విందు చేస్తుంటుంది. దీంతో ఒడనంబి ఇంటిని కూడా విడవ కుండా అక్కడే ఉండిపోతాడు.

4. శివ పంచాక్షరీ జపములు వినిపిస్తాయి

4. శివ పంచాక్షరీ జపములు వినిపిస్తాయి

Image source:


ఈ క్రమంలో ఒడనంబి, వేశ్య మంచం పై పూర్తిగా వివస్త్రలై స్వర్గ సుఖాలు అనుభవించే సమయంలో ఒడనంబి చెవికి వేదమంత్రోచ్చాటన మరియు శివపంచాక్షరీ జపములు వినిపిస్తాయి. దీంతో ఆ రాత్రియే శివరాత్రి అని గుర్తు చేసుకుంటారు. ఆ వేదమంత్రోచ్ఛాటన మరియు శిపంచాక్షరీ జపములు శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా ఒడనంబి అర్థం చేసుకుంటాడు.

5. మిక్కిలి బాధపడుతాడు

5. మిక్కిలి బాధపడుతాడు

Image source:


తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అయితే వేశ్య అంద చందాలకు, ఆమె అందించే స్వర్గ సుఖాలకు బానిసై ఇక్కడే ఉన్నానని బాధపడుతాడు. ఏమి చేయాలనే విషయం పై మధనపడుతుంటాడు. కొద్ధి సమయం తర్వాత నిగ్రహం కోల్పోయి పిచ్చివాని వలే ఆ ఇంటి అంతా కలియతిరుగుతూ తన తలను గోడకు కొట్టు కుంటూ ఉంటాడు. తాను దైవ ద్రోహం చేశానని భాదపడుతూ బలవన్మరణానికి పాల్పడాలని నిశ్చయించుకుంటాడు.

6. ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా

6. ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా

Image source:


ఇంతలో బ్రహ్మణుడైన ఒడనంబి దృష్టి మంచం పై ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా (వివస్త్రయై) నిద్రిస్తున్న ఆ వేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై పడుతుంది. మరుక్షణం ఒడనంబికి ఈశ్వరుడు లింగరూపుడై ఆ వక్షాగ్రభాగమున ఉన్నట్లు భావిస్తాడు. అంతే కాకుండా ఆ వేశ్య ఉన్న ఆ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతాయి. దీంతో ఒండనంబి ఆ ఇంటిని కైలాశంగా భావిస్తాడు.

7.సొమ్మసిల్లి పడిపోతాడు

7.సొమ్మసిల్లి పడిపోతాడు

Image source:


దీంతో బ్రాహ్మణుడైన ఆ ఒడనంబి భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షభాగమును పూజించడం మొదలు పెడుతాడు. అలా ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోతాడు. అపుడు వెలుగులు విరజిమ్ముచూ పరమశివుడు ప్రత్యక్షమాయెను. భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకోమంటాడు.

8. అదే రూపంలో ఉండాలని

8. అదే రూపంలో ఉండాలని

Image source:


అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయే. నీ ఆజ్జలేనిదే ఎటువంటి కార్యము జరగదు అని పలు విధాలుగా స్వామి వారిని కీర్తిస్తాడు. అంతే కాకుండా నేను ఏ రూపంలో పూజించానో అదే రూపంలో ఇక్కడ ఉండిపోవాలని కోరుకోవడమే కాకుండా మోక్షాన్ని ప్రసాధించాల్సిందిగా ఆ పరమశివుడిని ఒడనంబి వేడుకుంటాడు.

9. వేశ్యకు కూడా

9. వేశ్యకు కూడా

Image source:


దీంతో పరమశివుడు ఆ ఒడనంబి అచంచల భక్తికి మెచ్చుకోవడమే కాకుండా ఆ భక్తుడికి సకల అతిథ్య మర్యాదలు చేసి తాను ఇక్కడ ప్రత్యక్షమవడానికి కారణమైన వేశ్యకు కూడా మోక్షం ప్రసాదిస్తున్నానని చెబుతాడు. అంతే కాకుండా శివరాత్రి పర్వదినాన ఈ అంచలోని తన లింగరూపాన్ని దర్శించి అంచచలమైన భక్తితో తనను కొలిచిన వారి ఏడు జన్మల పాపాలు తొలిగిపోతాయని వరమిస్తాడు.

10 ఎంతగానో సంతోషిస్తారు

10 ఎంతగానో సంతోషిస్తారు

Image source:


దీంతో ఒడనంబితో పాటు ఆవేశ్య కూడా ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ వేశ్య పడుకున్న చోట స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలుస్తాడు. ఆ ఇల్లు దేవాలయంగా రూపాంతరం చెందుతుంది. ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములు ఉంటాయి. ఇక ప్రాకారము లోపల అనేక చిన్న దేవాలయములు కూడా మనం చూడవచ్చు. ప్రధాన దేవాలయంతో పాటు ఈ గుళ్లను భక్తులు దర్శిస్తారు.

11. వేడుకగా శివరాత్రి ఉత్సవాలు...

11. వేడుకగా శివరాత్రి ఉత్సవాలు...

Image source:

గుడినానుకొని పుష్కరిణి ఉంటుంది. ఇక దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణము కూడా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరపపడుతాయి. ఇక ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉంటుంది.

12. విభిన్న కథనాలు

12. విభిన్న కథనాలు

Image source:


ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి, పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయం. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు. శృంగవరపుకోట దానశాసనగ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్తుడని క్రీ.శ.5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు వుండేదని కచ్చితంగా తెలుస్తోంది.

13. ఇతర ఆలయాలు

13. ఇతర ఆలయాలు

Image source:


ఉమా రామలింగేశ్వర ఆలయం, ఆచంట - ఆచంటలోని ఉమారామలింగేశ్వరాలయం బాగా ప్రాచుర్యం పొందింది. ఆలయంలోని రామలింగేశ్వరుణ్ణి సంబోధిస్తూ మేకా బాపన్న కవి వంటివారు ఆచంట రామేశ్వర శతకం వంటి రచనలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ మదన గొపాల స్వామి ఆలయము, శ్రీ ముత్యాలమ్మ ఆలయము, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయము కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత చెందాయి.

14. ప్రపంచానికి మార్గదర్శం...

14. ప్రపంచానికి మార్గదర్శం...

Image source:


అచంట ప్రముఖ పర్యాటక కేంద్రంగానే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా విశ్వవ్యాప్తంగా తన కీర్తిని చాటుకుంది. ముఖ్యంగా ఈ అచంటకు చెందిన నెక్కంటి సుబ్బారావు అనే ప్రముఖ రైతుశాస్త్రవేత్త. ఐఆర్ 8 రకం వరి వంగడాన్ని తయారుచేసి ప్రపంచ కరువు తగ్గటానికి దోహదపడ్డారు. వ్యవసాయాన్ని విద్యాలయాల్లో కాక తన స్వంత పొలంలో ప్రయోగాల ద్వారా నేర్చుకుని దిగుబడుల్లో వ్యవసాయశాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించే పంటతీసిన వ్యక్తి.

15. ఎలా చేరుకోవాలి...

15. ఎలా చేరుకోవాలి...

Image source:


అచంట గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో పాలకొల్లుకి 16 కి.మీ రోడ్ మార్గం తణుకుకి 30 కి.మీ దూరంలో ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, అందుబాటులో ఉంటాయి. ట్యక్సీలు కూడా ఉంటాయి. రాజమండ్రి అచంటకు దగ్గరగా ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుంచి ట్యాక్సీలు కూడా అదుబాటులో ఉంటాయి. రాత్రి బస అక్కడ అంత సౌకర్యంగా ఉండదు. అందువల్ల వెనక్కు వచ్చి రాజమండ్రిలో ఉండటం మంచిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X