Search
  • Follow NativePlanet
Share
» »జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !

By Mohammad

అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద ధేయూర్, ఒజార్ వద్ద విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలు.

ఈ ఎనిమిది అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలంనాటివి. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంధాలైన గణేష మరియు ముద్గాల పురాణాలలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల శిల్ఫశైలి ఎంతో అందంగా ఉంటుంది.

ప్రతి హిందూ మతస్తుడు తన జీవితంలో ఆనందాలను అదృష్టాలను పొందేందుకు కనీసం ఒకసారైనా ఈ అష్టవినాయకుల ఎనిమది దేవాలయాలు దర్శించి తరించవలసిందే. ఈ దేవాలయాలన్నింటికి ఒక ఉమ్మడి అంశం ఏమంటే, వాటిలో ప్రతి ఒక్కటి స్వయంభూ దేవాలయమే.

సిద్ధి వినాయక దేవాలయం, సిద్ధాటెక్

సిద్ధి వినాయక దేవాలయం, సిద్ధాటెక్

చిత్ర కృప : Borayin Maitreya Larios

1. సిద్ధి వినాయక దేవాలయం

గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము కూడి వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్ధాటెక్ వద్దగల సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనపడుతుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత అంటే, ప్రదక్షిణం. పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది.

2. మయూరేశ్వర దేవాలయం

మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. సమీపంలో పెద్ద దీపమాల అంటే ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

మయూరేశ్వర దేవాలయం, మోర్గాంవ్

మయూరేశ్వర దేవాలయం, మోర్గాంవ్

చిత్ర కృప : k_hemangi

3. బల్లాలేశ్వర దేవాలయం

బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అన్ని దేవాలయాల వలే కాక ఈ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.

4. గిరిజాత్మక దేవాలయం

గిరిజాత్మక దేవాలయం గుహలు కల ఒక కొండ పైభాగాన కలదు. దీనిని దర్శించాలంటే 300 మెట్లు ఎక్కాలి. కష్టమైనప్పటికి పైకి వెళితే అక్కడి అందచందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.

గిరిజాత్మక దేవాలయం, లేన్యాద్రి

గిరిజాత్మక దేవాలయం, లేన్యాద్రి

చిత్ర కృప : vaibhav karlekar

5. చింతామణి దేవాలయం

చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి రూపం కలిగి ఉంటాడు.

6. విఘ్నేశ్వర దేవాలయం

ఓజార్ వద్ద గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరం బంగారంతో తయారు చేయబడ్డాయి. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగాంవ్ మరియు జున్నార్ ల నుండి ఓజార్ 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలలో చేరవచ్చు.

విఘ్నేశ్వర దేవాలయం, ఓజార్

విఘ్నేశ్వర దేవాలయం, ఓజార్

చిత్ర కృప : rajeshpai

7. మహాగణపతి దేవాలయం

మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దదిగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇది రంజన్ గాంవ్ లో కలదు.

8. వినాయక దేవాలయం

చివరగా, మహాడ్ గ్రామంలో వరద వినాయక దేవాలయం కలదు. ఈ దేవాలయ విగ్రహం ఒక సరస్సు ఒడ్డున లభిస్తే దానిని దేవాలయంలోపల ప్రతిష్టించారు. నేడు మనం చూసే వరద వినాయక దేవాలయం వాస్తవానికి పేష్వా పాలకులచే పునరుద్ధరించబడిన దేవాలయం.

వినాయక దేవాలయం, మహాడ్

వినాయక దేవాలయం, మహాడ్

చిత్ర కృప :Aniket Suryavanshi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X