Search
  • Follow NativePlanet
Share
» » టూర్ ప్రోగ్రాం - హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - హైదరాబాద్ !

టూర్ ప్రోగ్రాం - హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - హైదరాబాద్ !

హైదరాబాద్ లో వుండి లాంగ్ వెకేషన్ పై వెళ్ళాలనుకుంటే, ఈ టూర్ ప్రోగ్రాం సూచించ దగినది. తొమ్మిది రోజుల బిజి ప్రోగ్రాం. కనులకు విందు, మనస్సుకు పసందు. ఈ ప్రయాణం మీకు తప్పక అనుకూలం. ఈ జర్నీ ని మీకు విశ్రాంతిగా, తేలిక ప్రయానంగా వుండాలని చిన్న చిన్న దశలుగా విభజించడమైనది. ఈ ట్రిప్ లో ఊటీ ట్రైన్ విహారం ఆనందించండి లేదా కావేరి నదీ తీర ఆనందాలు ఆనందించండి. లేదంటే, ఒక విండో వద్ద కూర్చుని మంచి కాఫీ తాగుతూ సుందర దృశ్యాలను ఆనందించండి. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మూడు రాత్రులు కూర్గ్ లో, నాలుగు రాత్రులు ఊటీ లో మరియు ఒక రాత్రి మైసూరు లో గడపవచ్చు. ఖచ్చితమైన వివరాలకు మ్యాప్ కూడా పరిశీలించండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

మీరు ఉదయమే ఎర్లీ గా బయలు దేరితే బెంగుళూరు హై వే నెం. 7 చేరే సరికి 7 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి బెంగుళూరు 570 కి. మీ. ల దూరం. హై వే నెం.7 పై నేలమంగల బై పాస్ రోడ్డు మీదుగా నైస్ రోడ్డు చేరి సమయం పొదు పు చేయండి. మైసూరు చేరే సరికి కొంచెం లేట్ లంచ్ చేసే సమయం అవుతుంది.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

మైసూరు నుండి హున్సుర్ రోడ్ కు తిరగండి. ఆ రోడ్డు పై మడికేరి చేరవచ్చు. కూర్గ్ చేరేందుకు 3 గంటల సమయం పడుతుంది. మీ సందర్శనకు ముందే హోటల్ బుక్ చేయండి. కూర్గ్ లో ఆరంజ్ కౌంటీ మరియు క్లబ్ మహీంద్ర మంచి వసతులు సౌకర్యంగా వుంది కుటుంబ సభ్యులు ఆనందించే లా వుంటుంది.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

కూర్గ్ ను సౌత్ కాశ్మీర్ అంటారు. ఇక్కడి వాతావరణం, ప్రజలు మీరు కళలు కనే లోకాల లోకి తీసుకు వెళతాయి. కూర్గ్ లో మీ మొదటి రోజున దుబారే ఎలిఫెంట్ క్యాంపు లో ఎలిఫెంట్ రైడ్, చుట్టూ నీరు కల నిసర్గధామ, మానవ నిర్మిత హారంగి డాం, టిబెట్ జాతీయుల మరో ప్రపంచం బైలకుప్పే చూడండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

కూర్గ్ ను స్కాట్లాండ్ అఫ్ ఇండియా అంటారు. కూర్గ్ ప్రతి సందర్సకుడిని సాదరంగా స్వాగతిస్తుంది. మీ రెండవ రోజు ఉదయమే కూర్గ్ లోని రాజా సీట్ వద్ద సన్ రైజ్, అబ్బే ఫాల్స్, మిమ్మల్ని చరిత్రలోకి తీసుకు వెళ్ళే గడ్డిగే, సుందర దృశ్యాల భాగామందల మరియు తలకావేరి లు చూడండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

కూర్గ్ నుండి వయా బందిపూర్ ఊటీ కి బయలు దేరండి. ఈ మార్గం చాలా అందంగా వుంటుంది. తెప్పకాడు వద్ద మీరు వయా మాసినగుడి లేదా అధిక దూరమైనా గూడలూర్ ద్వారా ప్రయానించండి. మాసిన గుడి రూట్ లో 36 హెయిర్ పిన్ వంపులు కలవు. కనుక సుమారు 225 కి. మీ. ల దూరం కల ఈ ప్రయాణం మీరు ఎంపిక చేసుకున్న రోడ్డులో చేయండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

ఊటీ గురించి ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తారు. వాటిని తీసుకోండి. ఊటీ మొత్తం చూసేందుకు 3 రోజుల సమయం చాలు. మొదటి రోజు మీ ఉత్సాహం పెంపొందేలా నీడిల్ రాక్ నుండి సూర్యోదయం చూసి ఆనందించండి. తర్వాత ముడుమలై నేషనల్ పార్క్ కు, అందమైన పై కారా జలపాతాలకు వెళ్ళండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

రెండవ రోజు ఊటీ లో ట్రెక్కింగ్ లేదా కాలి నడక కు సిద్ధం అవండి. దొడ్డ బెట్ట శిఖరం అద్భుతంగా వుంటుంది. ఇక్కడ నుండి మీరు మైసూరు చాముండి హిల్స్ దృశ్యం చూడవచ్చు. శిఖరంపై కొంత సమయం గడిపి మధురమైన అనుభవాలను పొందండి. లంచ్ టైం కు మరల ఊటీ చేరండి. ప్రసిద్ధ ఊటీ లేక్ చూడండి. మధ్యాహ్న సమయం లో ఈ సరస్సు అందంగా వుంటుంది. అక్కడే మీరు అందమైన ఊటీ రోజ్ గార్డెన్ లు కూడా తప్పక చూడాలి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

ఇప్పటికి ప్రకృతి దృశ్యాలు అనేకం చూసి ఆనందించిన మీరు ఇక్కడ ఊటీ లోని ప్రసిద్ధ ఎమరాల్డ్ సరస్సు, అక్కడ కల హిమపాతం చూసి ఆనందించండి. కూనూర్ వెళ్ళే టాయ్ ట్రైన్ తప్పక ఎక్కండి. చివరకు ఊటీ లో కల కలహాట్టి జలపాతాలు చూడండి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

స్వర్గం లాంటి ఊటీ ని వదలి మీరు ఇపుడు రాజ దర్పాల మైసూరు చూడబోతున్నారు. ఒక్క రోజులో మైసూరు సిటీలో అనేకం చూడవచ్చు. మైసూరు పాలస్, బ్రిన్దవన్ గార్డెన్స్, కే ఆర్ ఎస్ డాం, మైసూరు జూ లు చూడండి. మైసూరు పాక్ స్వీట్ తిని ఆనందించండి. మైసూరు పురాతన ప్రపంచ అందాలు మిమ్ములను అబ్బుర పరుస్తాయి.

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

టూర్ ప్రోగ్రాం హైదరాబాద్ - కూర్గ్ - ఊటీ - మైసూరు - హైదరాబాద్

మైసూరు నుండి వెనక్కు వచ్చేటపుడు, బెంగుళూరు రోడ్డులో శ్రీరంగపట్న చూడండి. ఇక్కడ శ్రీ రంగనాథుడి గుడి 9 వ శతాబ్దం నాటిది కలదు. ఆ దేముడి ఆశీర్వాదం పొందండి. ఇక నేరుగా హైదరాబాద్ కు ప్రయానించండి. కూర్గ్ లో మీరు తాగిన రుచికర ఇండియన్ కాఫీ, ఊటీ లో తాగిన అద్భుత ఇండియన్ టీ లు మీకు ఈ ట్రిప్ ను జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X