Search
  • Follow NativePlanet
Share
» »గాలిబీడు ట్రెక్ వెళ్లారా?

గాలిబీడు ట్రెక్ వెళ్లారా?

గాలిబీడు ట్రెక్కింగ్ స్పాట్ గురించి కథనం.

By Kishore

ఇప్పుడంతా ట్రెక్ యుగం. వీకెండ్ వచ్చిందంటేప్రకృతిలో విహరించాలని యువత తహతహ లాడుతూ ఉంటుంది. ఇందు కోసం ట్రెక్కింగ్ ను ఎంచుకొంటూ ఉంటారు. అయితే ప్రతి సారి ఒకే మార్గంలో ట్రెక్కింగ్ చేయడం అన్నా కూడా యువతకు నచ్చదు. ప్రతి సారి కొత్త కొత్త ప్రదేశాల్లో విహరించాలని భావిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే ఈ కథనం. ఇందులో ఇప్పటి వరకూ అంతగా ప్రాచూర్యంలోనికి రాని ఒక సరికొద్ద ట్రెక్కింగ్ స్పాట్ గురించి వివరించాము. మరెందుకు ఆలస్యం అది ఏంటో తెలుసుకొని ఈ వీకెండ్ లో అక్కడికి వెళ్లడానికి సిద్ధమవ్వండి

మహిళలకు 'ఆ' సమయంలో మాత్రమే ఇక్కడ అనుమతిమహిళలకు 'ఆ' సమయంలో మాత్రమే ఇక్కడ అనుమతి

కుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకేకుంభమేళ జరిగే సమయంలో మాత్రమే ఈ దేవి దర్శనం...అందుకే

1. గాళిబీడు ట్రెక్

1. గాళిబీడు ట్రెక్

వారాంతాలను చక్కగా గడపడానికి అనువైన ప్రాతం ఈ గాళిబీడు ట్రెక్ మార్గం. అయితే ఇది అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అందువల్లే ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్లేవారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఒక్కసారి ఈ మార్గంలో ట్రెక్ వెళ్లితే ఆ అనుభవం జీవితాంతం మనలను వెంటాడుతూనే ఉంటుంది.

2. కొడుగు మీకు తెలుసుకదా

2. కొడుగు మీకు తెలుసుకదా

ట్రెక్కింగ్ ప్రియులకు కొడుగు కొత్త ప్రదేశం కాదు. అయితే కొడగులో ఉన్న గాళిబీడు ట్రెక్ మార్గం మాత్రం నూతన అనుభవం అని చెప్పవచ్చు. అయితే ఈ మార్గం కొంత కఠినంతో కూడుకొన్నది. అందుకు కారణం ఇక్కడ దారి సరిగా లేకపోవడమే.

3. ఎన్ని వింతలో

3. ఎన్ని వింతలో

ఈ ట్రెక్ మార్గంలో చుట్టూ పచ్చదనం పరుచుకొన్న కొండలే కనిపిస్తాయి. దారి పొడగునా గల గల పారే సెరయేళ్లు మిమ్ములను పలకరిస్తాయి. ఇక కొడుగు కాఫీ తోటలకు ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఈ మార్గంలోని ట్రెక్కర్లకు ఆ కాఫీ తోటల పరిమళాలు రారమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి.

4. మ్యాపుల సహాయంతో వెళితే అంతే

4. మ్యాపుల సహాయంతో వెళితే అంతే

మ్యాపుల సహాయంతో వెళితే దారి తప్పడం ఖచ్చితం. అందువల్ల ఈ మార్గంలో ట్రెక్ వెళ్లాలనుకొంటే మాత్రం స్థానికులను వెంటబెట్టుకొని వెళ్లడం మరిచిపోవద్దు. అంతే కాకుండా స్థానిక పోలీసు స్టేషన్, అటవీ శాఖ అనుమతులు తప్పక తీసుకోవాలన్న విషయం మరిచిపోకండి.

5. ట్రెక్కింగ్ క్లబ్బుల జతలో అయితే మంచిది

5. ట్రెక్కింగ్ క్లబ్బుల జతలో అయితే మంచిది

ఇలాంటి కఠినమైన, నూతన ట్రెక్కింగ్ ప్రదేశాలకు వెళ్లడానికి మీరు, మీకు తెలిసిన స్నేహితులు మాత్రం గుంపుగా వెళ్లాలనుకోవడం సరికాదు. ట్రెక్కింగ్ కోసం అనేక క్లబ్బులు వెలిసాయి. ఈ క్లబ్బుల సహాయం తీసుకుంటే ఎంచక్కా మన వీకెండ్ ట్రెక్కింగ్ అనుభవాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X