Search
  • Follow NativePlanet
Share
» »మన దేశంలో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం కుతుబ్ మీనార్ వెనుక అసలు రహస్యం

మన దేశంలో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం కుతుబ్ మీనార్ వెనుక అసలు రహస్యం

ఢిల్లీ సుప్రసిద్ధ ఆకర్షణల్లో కుతుబ్ మినార్ ఒకటి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల మినార్ ఇది. ఇండో ఇస్లామిక్ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఈ కుతుబ్ మినార్ ఢిల్లీలో మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంపెక్స్ లో ఉంది. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కుతుబ్ మీనార్ ను నమోదు చేశారు.

ఎన్నో ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయమైన ఈ కుతుబ్ మీనార్ ఒక మంచి విహార ప్రదేశం. పర్యాటకుల సందర్శనకు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంది. మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రాత్మక కట్టడమే కుతుబ్ మీనార్. మరి ఈ చారిత్రక కట్టడం గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం...

ఎర్ర ఇసుక రాయి, పాలరాళ్ళను కుతుబ్ మీనార్ నిర్మాణం

ఎర్ర ఇసుక రాయి, పాలరాళ్ళను కుతుబ్ మీనార్ నిర్మాణం

కుతుబ్ మీనార్ ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం వల్ల దీనికి అతని పేరు మీదుగా కుతుబ్ మీనార్ గా పిలుస్తున్నారు. ఎర్ర ఇసుక రాయి, పాలరాళ్ళను కుతుబ్ మీనార్ నిర్మాణానికి వాడినట్లు నిర్మాణ శైలి తెలుపుతున్నది.

PC: commons.wikimedia.org

కుతుబ్ మీనార్ అనగా ‘ధృవపుస్తంభం

కుతుబ్ మీనార్ అనగా ‘ధృవపుస్తంభం

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా ‘ధృవపుస్తంభం'. కుతుబ్ మీనార్ ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి.

PC: commons.wikimedia.org

ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం

ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం

కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ ఉన్నాయి. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, ఇల్ టుట్ మిష్ పూర్తికావించాడు.దీని ప్రాంగణం లో ఢిల్లీ ఇనుప స్థంబం, ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్ ఉన్నాయి.

PC: commons.wikimedia.org

దీనికి పునరుద్ధరణ మెరుగుదల పనులు ఎక్కువగా ముస్లీం రాజుల కాలంలోనే

దీనికి పునరుద్ధరణ మెరుగుదల పనులు ఎక్కువగా ముస్లీం రాజుల కాలంలోనే

కాలక్రమంలో జరిగిన అనేక భూకంపాలకూ, పిడుగు పాట్లకూ ఎన్నో సార్లు తట్టుకుని నిలబడింది. అక్కడక్కడ దెబ్బతిన్న బాగాలను వివిధ సందర్భాలలో బాగు చేశారు. దీనికి పునరుద్ధరణ మెరుగుదల పనులు ఎక్కువగా ముస్లీం రాజుల కాలంలోనే జరిగాయి. ఫిరోజ్ షా తుగ్లక్ మరియు సికందర్ లోడి వంటి వారు పునర్నిర్మాణంలో పాలు పంచుకున్నట్లు మీనార్ ఉపరితలంలో దొరికిన ఆధారాలు చెబుతున్నాయి.

PC: commons.wikimedia.org

సందర్శనకు అనుమతి లేదు

సందర్శనకు అనుమతి లేదు

1981కి ముందు కుతుబ్ మీనార్ సందర్శకుల కోసం లోనికి అనుమతినిచ్చేవారు. కానీ 1981 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో సుమారు 45 మంది పర్యాటకులు మరణించడం వల్ల అప్పటి నుండి సందర్శనకు అనుమతి లేకుండా చేశారు.

PC: commons.wikimedia.org

ప్రమాద వశాత్తు కరెంటు పోవటంతో

ప్రమాద వశాత్తు కరెంటు పోవటంతో

ప్రమాద వశాత్తు కరెంటు పోవటంతో ఏర్పడిన చీకటి వల్ల కలిగిన భయం వల్ల ఏర్పడిన తొక్కిసలాట ప్రధాన కారణం అయ్యింది. ఇది ఒక ప్రధాన కారణం అయినా, నిరంతరం ఎక్కువగా సందర్శకులు ఎక్కువదిగుతుండటం వల్ల కట్టడానికి ఎక్కువ నష్టం కలుగుతుందన్న భయంతో ఆ తర్వాత దీని అధిరోహణను నిషేధించారు.

PC: commons.wikimedia.org

కుతుబ్ మీనార్ అసలు రహస్యం

కుతుబ్ మీనార్ అసలు రహస్యం

కుతుబ్ మీనార్ అసలు పేరు విష్ణుద్వజం?

కుతుబ్ మీనార్ అసలు పేరు విష్ణుద్వజం? కుతుబ్ మినార్ ఆవరణలోనే ఉన్న లోహశాస్త్ర విచిత్రం లాంటి ఇనుప స్థంభంపై 4వ శతాబ్దానికి చెందిన బ్రహ్మీ లిపిలో రాయబడిన శాసనాల ద్వారా కుతుబ్ మినార్ పూర్వపు విష్ణుధ్వజం అని తెలుస్తున్నంది. హిందు శిల్పకళా నైపుణ్యం ప్రతిబింబించేలా స్థంభంపై అలంకరించిన గరుడు శిల్పం ఉంది. కుతుబ్ మినార్ ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని క్రుష్ణ పాదం అని పిలుస్తారు. దీనిని విజయ స్తూపంగా ముస్లీం పాలకులు పేర్కొన్నారు. మహ్మద్ ఘోరి ప్రుద్విరాజ్ పై సాధించిన విజయానికి ఇది చిహ్నం అని చెబుతారు.

PC: commons.wikimedia.org

అయితే స్థంబం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల

అయితే స్థంబం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల

అయితే స్థంబం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం అది ఒక ప్రాచీన వేధశాలలా ఉందంటూ కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొందరు చరిత్ర కారుల పరిశీలనల ప్రకారం క్రీస్తుకు పూర్వమే 280లో సముద్ర గుప్తుడనే రాజు నిర్మించిన వేదశాల అని చెబుతారు.

PC: commons.wikimedia.org

స్థంభంపై నిర్మాణానికి సంభంధించిన రాతలలో

స్థంభంపై నిర్మాణానికి సంభంధించిన రాతలలో

స్థంభంపై నిర్మాణానికి సంభంధించిన రాతలలో శ్రీ విశ్వకర్మ ప్రసాద రచిత అనే మాటలు ఉన్నాయంటే విశ్వకర్మ ఆశీర్వాదాలతో నిర్మించబడిన అనేక అర్థంలో వాడారు. ఇది హిందు మైథాలజీకి దగ్గరగా ఉంది.

PC: commons.wikimedia.org

ఇనుప స్థంభంపై

ఇనుప స్థంభంపై

ఇనుప స్థంభంపై రాతలను కుతుబ్ మినార్ కు అన్వయించటం ఎలా కుదురుతుందని ఇది ఉదయగిరి నుండి క్రీ.శ 10వ శతాబ్దంలో ఇక్కడిక మార్చారని వాటి అన్వయాన్ని ఈ మీనార్ పై చెయ్యటం కుదరదనీ వాదిస్తున్నారు.

PC: commons.wikimedia.org

విష్ణుదేవాలయం కొరకు నిర్మించిన ఈ స్థంభం

విష్ణుదేవాలయం కొరకు నిర్మించిన ఈ స్థంభం

ఆరు టన్నులకు పైగా బరువున్న 7.21 మీటర్ల పొడవున్న 98శాతం స్వచ్చమైన చేత ఇనుముతో తయారైన ఈ లోహ శాస్త్ర వింతను రెండవ చంద్రగుప్త మిక్రమాదిత్యుడు ఉదయగిరిలోని ఒక విష్ణువు ఆలయం ముందు నిర్మించాడు. విష్ణుదేవాలయం కొరకు నిర్మించిన ఈ స్థంభం కాబట్టి దీనిని విష్ణు ద్వజంగా పిలుస్తారు. కానీ అది మీనార్ కు సంభందించిన అంశం కాదని కొందరి వాదన.

PC: commons.wikimedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X