Search
  • Follow NativePlanet
Share
» »సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతం అందుకే ఇక్కడ...

సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతం అందుకే ఇక్కడ...

సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమైన బ్రహ్మకపాలం గురించి.

By Kishore

బ్రహ్మకపాలం అనే చోట బ్రహ్మ ఐదో తల పడిందని చెబుతారు. ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ ఐదో తలకు మోక్షం పొందిందనేది పురాణ కథనం. బ్రహ్మకపాలం చా ర్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్రహ్మకపాలం ఉంది. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడకు పిండప్రదానం చేయడానికి వస్తుంటారు. బ్రహ్మ ఐదో తలను శివుడు ఖండించడం వల్లే బ్రహ్మకు నాలుగు తలలు మాత్రమే కనిపిస్తాయి. అంతే కాకుండా బ్రహ్మకు దేవాలయాలు లేకపోవడానికి ఈ తలను ఖండించడానికి మధ్య ఒక ఘటన కూడా ఉందని పురాణాలు చెబుతాయి. ఆ పురాణ కథనంతో పాటు బ్రహ్మకపాలం హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కావడానికి గల కారణాలు ఈ కథనంలోొ తెలుసుకొందాం.

ఈ అమ్మవారిని దర్శిస్తే సంతాన, పెళ్లి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం ఎందుకంటేఈ అమ్మవారిని దర్శిస్తే సంతాన, పెళ్లి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం ఎందుకంటే

1. పురాణాల ప్రకారం

1. పురాణాల ప్రకారం

Image Source:

పురాణాల ప్రకారం బ్రహ్మను సృష్టికర్త భావిస్తారు. అంటే అతను సమస్త జీవ రాశుల పుట్టుకకు మూలం. అదే విధంగా విష్ణువును స్థితి కారకుడని అంటారు. అంటే విష్ణువు ఈ జీవరాసులకు ఎప్పుడు ఏమి ఇవ్వాలన్న దాని పై నిర్ణయం తీసుకుంటారు.

2. పరమశివుడిని లయకారకుడిగా

2. పరమశివుడిని లయకారకుడిగా

Image Source:

ఇక పరమశివుడిని లయకారకుడిగా పేర్కొంటారు. అంటే ఆయన ఏ ఏ జీవరాసిని ఎప్పుడు అంతం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయం పై నిర్ణయం తీసుకుంటారు. అందువల్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయకారకులుగా హిందూ పురాణాలు పేర్కొంటాయి.

3. ఐదు తలలు

3. ఐదు తలలు

Image Source:

సాధారణంగా బ్రహ్మకు ఐదు తలలు ఉంటాయి. ఇందులో నాలుగు నలుదిక్కులను చూస్తూ ఉంటే ఐదో తల మాత్రం పై వైపునకు ఉంటుంది. అందువల్లే బ్రహ్మకు పంచముఖుడని కూడా పేరు.

4. గర్వం తలెత్తుతుంది

4. గర్వం తలెత్తుతుంది

Image Source:

ఈ నేపథ్యంలో ఒక సారి బ్రహ్మకు విపరీతమైన గర్వం తలెత్తుతుంది. తానే త్రిమూర్తుల్లో గొప్పవాడనే ఆలోచన తలెత్తుతుంది. తాను జీవ రాసులను సృష్టించకపోతే అటు విష్ణువుతో పాటు ఇటు పరమ శివుడికి పని ఏమి ఉండదని తన చుట్టూ ఉన్న మిగిలిన దేవతలు, మునులతో పేర్కొంటారు.

5. విష్ణువుతో వాదనకు దిగుతాడు

5. విష్ణువుతో వాదనకు దిగుతాడు

Image Source:

బ్రహ్మకు విధేయులైన కొంతమంది దేవుళ్లు, మునులు బ్రహ్మ చెప్పినది అక్షరాల సత్యం అని బ్రహ్మను పొగుడుతారు. దీంతో బ్రహ్మ మరింత గర్వంతో రెచ్చిపోతాడు. ఈ సమయంలోనే బ్రహ్మ విధేయులైన కొంతమంది వైకుంఠానికి వెళ్లి విషయాన్ని విష్ణువుతో చెబుతారు.

6. వినిపించుకోడు

6. వినిపించుకోడు

Image Source:

దీంతో బ్రహ్మ విధేయులకు, విష్ణు భక్తులకు తీవ్ర వాగ్వాదం చెలరేగుతుంది. విష్ణువు బ్రహ్మకు ఎంత సర్థిచెప్పినా ప్రయోజనం లేకపోతుంది. త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేద భావం ఉండదని ముగ్గురూ సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోడు.

7. విష్ణువు ఒప్పుకొంటాడు

7. విష్ణువు ఒప్పుకొంటాడు

Image Source:

దీంతో అన్యమనస్కంగానే విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ గొప్పవాడని ఒప్పుకొంటాడు. దీంతో విజయ గర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని వాదనకు దిగుతాడు.

8. శివుడు ఒప్పిస్తాడు

8. శివుడు ఒప్పిస్తాడు

Image Source:

దీంతో అటు కైలాసవాసులకు, ఇటు బ్రహ్మ విధేయులకు మధ్య తీవ్రమైన గొడవ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పరమశివుడు బ్రహ్మతో వాదనకు దిగి త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదం ఉండబోదని ఒప్పిస్తాడు.

9. అయినా ఐదో తలతో

9. అయినా ఐదో తలతో

Image Source:

పైకి త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకొంటాడు. అయితే బ్రహ్మకు ఉన్న ఐదో తలలో మాత్రం తాను గొప్పవాడని భావిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టుతాడు. ఇక వేళ ఈ ఆలోచనా ఇలాగే కొనసాగితే స`ష్టిలో అల్లకల్లోలం జరుగుతుందని భావిస్తాడు.

10. పరమశివుడు ఐదో తలను ఖండిస్తాడు

10. పరమశివుడు ఐదో తలను ఖండిస్తాడు

Image Source:

దీంతో రానున్న ఉపద్రవాన్ని తప్పించడం కోసం పరమశివుడు తన త్రిశూలంతో బ్రహ్మ ఐదో తలను ఖండించి వేస్తాడు. ఆ తల ప్రస్తుతం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలకనంద నదీ తీరంలో పడిపోయిందని చెబుతారు.

11. మొక్షం పొందిన చోటు

11. మొక్షం పొందిన చోటు

Image Source:

అటు పై మోక్షం పొందిందని పురాణ కథనం. ఇది జరిగిన తర్వాత బ్రహ్మకు గర్వం తగ్గిపోయి మిగిలిన ఇద్దరితో కలిసి తన విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాడని చెబుతారు.

12. మరో కథనం ప్రకారం

12. మరో కథనం ప్రకారం

Image Source:

మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకు మెచ్చి మూడు బానాలు అంజేస్తాడు. వాటిని ఎవరి పై ప్రయోగించినా సమ్మోహనానికి గురయ్యి వారిలో శ`ంగార కోర్కెలు పెరిగిపోతాయని చెబుతాడు.

13సదరు బానాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడం కోసం

13సదరు బానాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడం కోసం

Image Source:

ఈ నేపథ్యంలో ఈ బానాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడం కోసం మన్మథుడు అందులో ఒక బానాన్ని బ్రహ్మ దేవుడి పైనే ప్రయోగిస్తాడు. దీంతో బ్రహ్మలో కూడా ఆ కోర్కెలు పెరిగిపోతాయి.

14. శతరూపను

14. శతరూపను

Image Source:

దీంతో బ్రహ్మే తన పనిలో సాయం చేయడం కోసం స`ష్టించిన శతరూప అనే అందమైన యువతిని మోహిస్తాడు. ఆమె ఎక్కడికి పోయినా తన కామపు కోరికలతో ఆమెను చూస్తూ ఉంటాడు. చివరికి బ్రహ్మ నుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళుతుంది.

15. ఐదో శిరస్సు

15. ఐదో శిరస్సు

Image Source:

అయినా కూడా బ్రహ్మ తనకు ఉన్న ఐదో శిరస్సుతో ఆమెను కామించడం మొదలు పెడుతాడు. దీంతో స`ష్టి కార్యం మొత్తం నిలిచిపోతుంది. విషయం గ్రహించిన పరమశివుడు తన అంశ అయిన వీరభద్రుడిని స`ష్టించి బ్రహ్మ ఐదో తలను ఖండించాల్సిందిగా ఆదేశిస్తాడు.

16. ఐదో శిరస్సును

16. ఐదో శిరస్సును

Image Source:

వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండిస్తాడు. ఆ తలను బ్రదీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీ తీరంలో విసిరి వేస్తాడు. అలా బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మ కపాలంగా పేర్కొంటున్నారు.

17. వావివరసలు మరిచి

17. వావివరసలు మరిచి

Image Source:

ఇదిలా ఉండగా బ్రహ్మ వావివరసలు మరిచి కన్న కూతురు లాంటి శతరూప ను కోరుకోవడం వల్ల భూ మండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శాపం పెడుతాడు. అందువల్లే బ్రహ్మకు కేవలం రెండు చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఘటనకు జరగడానికి ముందే అక్కడ దేవాలయాలు వెలిసినట్లు పురాణ కథనం.

18. నాలుగు వేదాలు చదివేది అందుకే

18. నాలుగు వేదాలు చదివేది అందుకే

Image Source:

ఇక చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఎల్లవేళలా మిగిలిన నాలుగు తలలతో నాలుగు వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా బ్రహ్మ శిరస్సు పడి , ఆ శిరస్సుకు మోక్షం కలిగినందువల్లే ఈ బ్రహ్మ కపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు.

19. ఇక్కడ పిండప్రదానం

19. ఇక్కడ పిండప్రదానం

Image Source:

ఇక్కడ పితృదేవతలు పిండప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా మరెక్కడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని, సంవత్సరీకం చేయకపోయినా పర్వాలేదని చెబుతారు. అందువల్లే ఈ బ్రహ్మకపాలం వద్ద పెద్ద వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

20. ఎలా వెళ్లాలి

20. ఎలా వెళ్లాలి

Image Source:

చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మకపాలం ఉంది. బద్రీనాథ్ వరకూ వాహనాలు వెలుతాయి. అక్కడి నుంచి నడక దారిన బ్రహ్మ కపాలం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X