Search
  • Follow NativePlanet
Share
» » బెంగుళూరు నుండి మంగళూరు కు రోడ్డు ప్రయాణంలో ....

బెంగుళూరు నుండి మంగళూరు కు రోడ్డు ప్రయాణంలో ....

సాధారణంగా బెంగుళూరు నుండి మంగళూరు కు ఒక వారాంతంలో వెళ్లి ఆనందించి రావచ్చు. మంగళూరు కర్ణాటక లో ఒక అందమైన నగరం. ఒక ఓడరేవు పట్టణం. మంగళూరు చుట్టుపట్ల కూడా అనేక ఆకర్షణలు కలవు. బెంగుళూరు మరియు మైసూరు ల తర్వాత చాలామంది పర్యాటకులు మంగళూరు నగరం చూసేందుకు ఇష్టపడతారు. మంగళూరు వెళ్ళే మార్గంలో కూడా మీరు అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన, శ్రావణ బెలగోళ, కునిగల్ మొదలైన ప్రదేశాలు కూడా చూడవచ్చు. మరి మంగళూరు వెళ్ళిన వారు అక్కడ కల పర్యాటక రాదేశాలు ఏమి చూడాలి ? అనేది పరిశీలించండి.

బెంగుళూరులో ప్రయాణం మొదలు

బెంగుళూరులో ప్రయాణం మొదలు

మన ప్రయాణం బెంగుళూరు లో మొదలు పెడదాం. బెంగుళూరు నుండి మంగళూరు దూరం 364 కి. మీ. లు. ఈ దూరం ప్రయాణించేందుకు సుమారు 6 లేదా 7 గంటల సమయం పడుతుంది. మార్గం లో మీరు కూనిగల్, హస్సన్, సకలేశ్ పూర్ వంటి కొన్ని ప్రసిద్ధి పట్టణాలు కూడా చూడవచ్చు.

కునిగల్

కునిగల్

కునిగల్ తుంకూర్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఇది గుర్రపు శాలలకు ప్రసిద్ధి. రేస్ లలో పాల్గొనే అతి వేగమైన గుర్రాలను ఇక్కడ పెంపకం చేస్తారు. ఒక్క గుర్రాల పెంపక ప్రదేశం సందర్శించండి. వాటిని పెంచి పోషించి రేస్ లలో ఎలా పాల్గొనేలా చేస్తారో తెలుసుకోనండి.

Photo Courtesy: Yogendra Joshi

చన్నరాయ పట్న - బాహుబలి

చన్నరాయ పట్న - బాహుబలి

చన్నరాయ పట్న అక్కడ కల ప్రసిద్ధ భారి విగ్రహం లార్డ్ బాహుబలి కి పేరుగాంచినది. ఇది సమీప ప్రదేశం అయిన శ్రావణ బెలగోళ లో కలదు. ఈ దేవుడి సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. పూవులు, వెండి, బంగారం వంటివి దేవుడి పాదాల చెంత వుంచి ప్రార్ధిస్తారు.

Photo Courtesy: Ananth H V

హస్సన్

హస్సన్

హస్సన్ ను కర్నాటక శిల్ప కళల రాజధానిగా చెపుతారు. ఈ ప్రదేశం హోయసల పాలకుల ఆధ్వర్యం లో అభివృద్ధి చెందినది. ఇక్కడ అనేక జైన మందిరాలు కలవు. కాని నేడు అవి శిధిలమై కనపడతాయి. శివుడి దేవాలయాలు కూడా అనేకం చూడవచ్చు. పర్యాటకులకు ఇక్కడి హోటళ్ళ లో మంచి వసతి లభిస్తుంది.

సకలేశ్ పూర్

సకలేశ్ పూర్

హస్సన్ నుండి తర్వాత వచ్చే ప్రదేశం చిన్న హిల్ స్టేషన్ అయిన సకలేశ్ పూర్. పడమటి కనుమలలో కల ఈ కొండలు కాఫీ మరియు యాలకులు లేదా సుగంధ ద్రవ్యాల పంటలకు ప్రసిద్ధి. ఇక్కడే కల బిస్లె రేసేర్వ్ ఫారెస్ట్ మరియు పుష్పగిరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు చూడవచ్చు.

Photo Courtesy: L. Shyamal

మంగళూరు

మంగళూరు

మంగళూరు ను కర్నాటక రాష్ట్ర ప్రవేశ ద్వారం అంటారు. పడమటి కనుమల మరియు అరేబియన్ మహా సుముద్రాల మధ్య కల ఒక సుందరమైన పట్టణం మంగళూరు. ఇక్కడి బీచ్ ఇసుకలో ఆనందించవచ్చు. లేదా సమీపంలోని కొండలపై ట్రెక్కింగ్ ఆనందించవచ్చు. మంగళూరు లో మంగళా దేవి టెంపుల్ ప్రసిద్ధి చెందినది. చాలామంది పర్యాటకులు తప్పక మంగళా దేవి టెంపుల్ దర్శించి మాత ఆశీర్వాదాలు పొందుతారు.

Photo Courtesy: Shuba

ఆహారాలు

ఆహారాలు

మీ ప్రయాణంలో ఉడుపి హోటళ్ళు అనేకం తగులుతాయి. మంగళూరు లో కూడా ఉడుపి హోటళ్ళు రుచి కర వంటకాలను మీకు అందిస్తాయి. ఉడుపి పట్టణం నోరు ఊరే రుచికర వంటకాలకు ప్రసిద్ధి. ఈ ఆహారాలు మీరు ఇంతవరకూ తిన్న ఆహారాలకంటే భిన్నంగా వుండి మరో మారు మిమ్ములను మంగళూరు కు ఆహ్వానిస్తాయి.

Photo Courtesy: GracinhaMarco Abundo

హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X