Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూర్ నుండి ఆగుంబెకు ఒక శీతాకాలపు యాత్ర

బెంగుళూర్ నుండి ఆగుంబెకు ఒక శీతాకాలపు యాత్ర

ఆగుంబె కర్ణాటక మల్నాడ్ ప్రాంతంలో "షిమోగా" జిల్లాలో ఉన్నది. తరచుగా "దక్షిణ చిరపుంజి" అని పిలుస్తారు. ఆగుంబె చిరపుంజి తరువాత భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల రెండవ ప్రాంతం. 375 కిలోమీటర్ల రైడ్ తర్వాత వా

ఆగుంబెను తరచుగా దక్షిణ చిరపుంజిగా సూచిస్తారు. ఈ అద్భుతమైన శీతాకాలంలో బెంగుళూర్ నుండి ఆగుంబెకు రోడ్ యాత్ర.

మీకు వారాంతంలో వచ్చే శెలవులను బాగా ఎంజాయ్ చేయటానికి బెంగుళూర్ లో ఒక చల్లని శీతాకాల ఉదయం అనువైన వాతావరణంలో రోడ్ ట్రిప్. చాలా ఆలోచించిన తర్వాత ఒక శుక్రవారం ఉదయం రోడ్ ట్రిప్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఆగుంబెకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.

agumbe places to visit

PC: wikimedia.org

ఆగుంబె కర్ణాటక మల్నాడ్ ప్రాంతం లో షిమోగా జిల్లాలో ఉన్నది. తరచుగా దక్షిణ చిరపుంజి అని పిలుస్తారు. ఆగుంబె చిరపుంజి తరువాత భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల రెండవ ప్రాంతం. 375 కిలోమీటర్ల రైడ్ తర్వాత వాయువ్య బెంగుళూర్ వద్ద ఈ అందమైన ప్రదేశాన్ని మీరు చేరవచ్చు.

agumbe places to visit

PC: wikimedia.org

దారి : బెంగుళూర్-తుంకూర్-షిమోగా-తీర్థహళ్లి-కుప్పలి--ఆగుంబె (రాత్రికి బస)

ఆగుంబె - శ్రింగేరి-చిక్ మగలూర్ - ముల్లయనగిరి - హసన్ -బెంగుళూర్

agumbe places to visit

PC: google.map

1వ రోజు: సిటీ నుండి తొందరగా స్టార్ట్ అయ్యాక అనేక చోట్ల ఆగి ఆగి ప్రయాణం చేసాము. కానీ ఎలాగైనా సరే రాత్రికి గమ్యం చేరుకోవాలనుకున్నాం. ప్రయాణంలో మొదట తుంకూర్ వద్ద ఆగాము. ఆకలితో ఉన్న కడుపులు నింపుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించాం. తొందరగా ప్రదేశాన్ని చేరడానికి రోడ్లు చాలా చక్కగా ఖాళీగా అనువుగా ఉన్నాయి. షిమోగా నుండి 11కి.మీ. వున్న గజనూర్ డ్యామ్ చూడటానికి మేము సిద్ధమయ్యాం.

తరువాత వచ్చే నెక్స్ట్ స్టాప్ సక్రేబైలులో గల గజనూర్ డ్యామ్ ఫోటోగ్రఫీ సెషన్స్ కి చాలా అనువైన ప్రదేశం. ఇది హైవే మీద ఉన్న ఒక ఏనుగుల శిక్షణ శిబిరం. ఈ శిక్షణ శిబిరం అనేకమంది పర్యాటకులను ఆకర్షించటం లేదు. ఇక్కడ దాదాపుగా ఎక్కువగా ఖాళీగా ఉంటుంది.

agumbe places to visit

PC: wikimedia.org

షిమోగా నుండి తీర్థల్లి రహదారి తుంగభద్రా నదితో దారి పొడగునా చెట్లతో కప్పబడి ఒక స్వర్గంలాగా వుంటుంది. తర్వాత మనం కుప్పలికి పయనం కొనసాగిస్తాం. ఇది ప్రఖ్యాత కన్నడ కవి కువెంపు పుట్టిన స్థలం.

agumbe places to visit

PC: wikimedia.org

మన తదుపరి స్టాప్ కుందాద్రి. ఇక్కడ కొండ పై నుండి మనం సూర్యోదయం మరియు అద్భుతమైన సూర్యస్తమయంను చూడవచ్చు. ఇక్కడ అందమైన జైన దేవాలయం చూడవచ్చును.

కొండ క్రింది నుండి పైకి సాగివున్న రోడ్డు బాగా అభివృద్ధి చెందింది. కొండ పైకి చేరుకోవడం సులభమే.

agumbe places to visit

PC: wikimedia.org

చివరకు మేము మా గమ్యమైన ఆగుంబెలో చేరుకున్నాం. ఇక్కడ ప్రఖ్యాతమైన దొడ్డమనేలో బస చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుందని నిశ్చయించుకున్నాం. మాల్గుడి డేస్ తెలిసిన వారికి ఎవరికైనా దొడ్డమనే వీక్షించాలని వుంటుంది. ఈ దొడ్డమనేకి 150సం. వారసత్వం గల ఆ ఇంట్లో నివశిస్తున్న కస్తూరి అక్క మమ్మల్ని స్వంత మనుషులు లాగా ఆదరించింది.

agumbe places to visit

PC: wikimedia.org

2వ రోజు: కస్తూరి అక్క వండి పెట్టిన వేడివేడి బ్రేక్ ఫాస్ట్ తో రెండవ రోజు ప్రారంభమైనది. బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత మేము ఆ ప్రాంతమంతా తిరగాలని నిశ్చయించుకున్నాం. ఆగుంబెను శక్తివంతమైన కింగ్ కోబ్రా స్థావరంగా భావిస్తారు. మీకు ఆసక్తి ఉంటే రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లోకి వెళ్లి సరీసృపాలు గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

ఆగుంబెలో ప్రొద్దున సమయాలలో సాధారణంగా పొగమంచుతో కూడుకొని వుంటుంది. కొంచెం చినుకులతో కూడిన వాతావరణం చూడటానికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. మేము ఇక్కడ నుండి శ్రింగేరికి బయల్దేరాలనుకున్నాం. ఆగుంబె ఘాట్ స్టేషన్ 13 హెయిర్ పిన్స్ లాంటి వంపులు కలిగివుంది. ఇది కూడా ఒక ఫోటోజెనిక్ స్టాప్.

agumbe places to visit

PC: wikimedia.org

శ్రింగేరిని దర్శించుకున్నతర్వాత మేము చిక్ మగలూరు దారిలో బెంగుళూరు తిరుగు ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాం. మేము చిక్ మగలూరుకు మధ్యాహ్నం 3:00 గం.కి చేరుకున్నాము. ఇక్కడ రాత్రి బస చేసిన తర్వాత ముల్లయనగరికి బయల్దేరాం.

ముల్లయనగిరి కర్నాటకలో ఉన్న అత్యున్నత శిఖరాలలో ఒకటి. దీని యొక్క ఎత్తు 1925 మీ. దీనిని ట్రెక్కర్స్ స్వర్గంగా పిలుస్తారు.

తర్వాతి రోజు మేము తొందరగా బెంగుళూరు చేరుకోవాలని నిశ్చయించుకున్నాం. ఈ టూర్ ద్వారా మేము మా ఎనర్జీని తిరిగి సంపాదించుకొన్నాం. ఈ ఆగుంబె ప్రయాణం మీరు తక్కువ ఖర్చుతో చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X