Search
  • Follow NativePlanet
Share
» »ఆద్యంత ప్రభు-ఒకే విగ్రహంలో వినాయకుడు-హనుమంతుడు కొలువైన క్షేత్రం.!

ఆద్యంత ప్రభు-ఒకే విగ్రహంలో వినాయకుడు-హనుమంతుడు కొలువైన క్షేత్రం.!

కైలాసమును, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అది అసాధ్యమైన పని అని మనకు తెలుసు. అలాంటి అనుభూతిని కలిగించే ఆలయం ఒకటి ఉందంటే ఎంత భాగ్యమో కదా..

కైలాసమును, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అది అసాధ్యమైన పని అని మనకు తెలుసు. అలాంటి అనుభూతిని కలిగించే ఆలయం ఒకటి ఉందంటే ఎంత భాగ్యమో కదా..ఆ విషయం తెలిసిందంటే చాలు ఎలాగైనా సరే ఆ భూ కైలాసాన్ని చూసి తీరాల్సిందేనని మనసు పరుగులు తీయటం ఎవరికైనా సహజం అయితే మరెందుకు ఆలయం వెంటనే చెన్నైకి వెళ్ళి చూసొద్దా పందండి..!

మధ్యకైలాష్ ఆలయం ఎక్కడ ఉంది

మధ్యకైలాష్ ఆలయం ఎక్కడ ఉంది

చెన్నై నగరంలోని అడయార్ కస్తూరిభాయ్ నగర్ రైల్వేస్టేషన్ నుండి ఓఎంఆర్ రోడ్ కు వెళ్లే మార్గంలో కొలువై ఉన్న ఆలయం మధ్యకైలాష్. భక్తుల కొంగుబంగారమై కోర్కెలను తీరుస్తూ అలరిస్తోంది. ఈ ఆలయంలో విగ్రహం చాలా ప్రత్యేకం. చూశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఆద్యంత ప్రభు-ఆనంద వినాయకుని ఆలయంలో

ఆద్యంత ప్రభు-ఆనంద వినాయకుని ఆలయంలో

ఈ విగ్రం పేరు ఆద్యంత ప్రభు. తమిళనాడులో చెన్నై నగరం అడయార్ ప్రాంతంలో మధ్యకైలాష్ లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఇందులో సగం వినాయకుడు , సగం హనుమంతుడు కొలువై ఉన్నారు. ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు. ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని ఆద్యంత ప్రభు అన్నారు.

హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే

హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే

హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే. ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ హనుమంతుడు పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఆలయ విశిష్టత

ఆలయ విశిష్టత

కొన్ని సంవత్సరాల క్రితం తిరువేంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కసి ప్రస్తుతం మధ్యకైలాష్ ఆలయం వెలసిన చోట "చిన్న వినాయక విగ్రహాన్ని" ప్రతిష్టించాడు.

చిరు వినాయకుడి విగ్రహాన్ని

చిరు వినాయకుడి విగ్రహాన్ని

ఈ చిరు వినాయకుడి విగ్రహాన్ని గమనించిన పాదచారులు ప్రతిరోజూ పూజలు చేయసాగారు. భక్తుల తాకిడిని గుర్తించిన తిరువేంకటస్వామి తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన తరువాత ఆలయ అభివృద్ధికి కృషి చేశాడు. అలా రూపుదిద్దుకున్న ఆలయానికి భక్తుల రాక మరింతగా పెరగసాగింది.

స్వామివారి ఆలయానికి 1984లో కుంభాబిషేకం

స్వామివారి ఆలయానికి 1984లో కుంభాబిషేకం

భక్తులు అందించిన విరాళాలతో స్వామివారి ఆలయానికి 1984లో కుంభాబిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆదిత్య (సూర్యుడు), పరమేశ్వరుడు, అభిరామి అమ్మవారు, మహావిష్ణువు, ఆంజనేయస్వామి, ఆద్యంత ప్రభువు తదితర దేవతలకు ప్రత్యేక మంటపాలను నిర్మించారు. ఇలా క్రమంగా రూపుదిద్దుకున్నదే ప్రస్తుత మధ్యకైలాష్ ఆలయం.

కర్మకార్యాలకు ప్రత్యేక అనుమతి

కర్మకార్యాలకు ప్రత్యేక అనుమతి

పూర్వీకుల కర్మకార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్యకైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్ళల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడే వారికోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి.

మధ్యకైలాష్ ఆలయంలోని

మధ్యకైలాష్ ఆలయంలోని

మధ్యకైలాష్ ఆలయంలోని మంటపాలు, విగ్రహాలు వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నాయి. బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమకు కైలాసాన్ని దర్శించినంత అనుభూతి కలుగుతోందని చెబుతున్నారంటే, ఈ ఆలయం వారిలో ఎంత భక్తిపారవశ్యాన్ని నింపుతోందో అర్థం చేసుకోవచ్చు.

మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు

మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు

ప్రతి సంవత్సరం మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో బొజ్జ గణపయ్య ఆలయం నుంచి బయలుదేరి వీధి విహారం చేస్తారు. భక్తుల హారతులను అందుకుని వారికి తన కరుణా కటాక్ష వీక్షణాలను అందిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు

మధ్యకైలాష్‌లో వినాయక చతుర్థి వేడుకలు

అలాగే తమిళ మహాకవి భారతీయార్ అభిమానుల ఆధ్వర్యంలో మధ్యకైలాష్ ఆలయంలో ప్రతియేటా భారతీయార్ విగ్రహాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఇదే సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. పూర్వీకుల కర్మకార్యాలు నిర్వహించేందుకు కూడా ఈ మధ్యకైలాష్ ఆలయంలో ప్రత్యేక అనుమతి ఉంది. అమరులైన పూర్వీకులకు తమ ఇళ్లల్లో కర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు లేనివారు, గుళ్ళల్లో ఈ కార్యాలు చేసేందుకు ఇష్టపడే వారికోసం ప్రత్యేకించి ఈ ఆలయంలో వసతి కల్పిస్తున్నారు.

అడయార్ ఎలా వెళ్ళాలి ?

అడయార్ ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గం అడయార్ కు సమీపాన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి విమానాలు వస్తుంటాయి. విమానాశ్రయం బయట టాక్సీ లేదా క్యాబ్ లను అద్దెకు తీసుకొని అడయార్ చేరుకోవచ్చు.

రైలు మార్గం
తిరుమయిలై MRTS స్టేషన్ అడయార్ సమీపాన కలదు. ఇదొక మెట్రో స్టేషన్. సమీపాన ఉన్న ప్రధాన స్టేషన్ లు ఎగ్మోర్, చెన్నై సెంట్రల్ స్టేషన్ లు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు ఈ స్టేషన్ ల మీదుగా వెళ్తాయి.

రోడ్డు / బస్సు మార్గం
చెన్నై లోని కోయంబేడు బస్ స్టాండ్ నుండి అడయార్ కు సిటీ బస్సులు తిరుగుతాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కన్యాకుమారి, మధురై, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు చెన్నై కు వస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X