Search
  • Follow NativePlanet
Share
» »ఈ అడవిలో కాకులు కనపడవు...కారణం ఇదే

ఈ అడవిలో కాకులు కనపడవు...కారణం ఇదే

యుగాంతంతో ముడిపడిన యాగంటి విశిష్టలతో కూడిన కథనం

By Beldaru Sajjendrakishore

కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. పురాణ కథనం ప్రకారం ఇక్కడ అగస్తముని తపస్సు చేసే సమయంలో కాకులు ఆయనకు భంగం కలిగించాయి. దీంతో కోపగించుకున్న ఆ ముని ఈ క్షేత్రం పరిసరాల్లో ఒక కాకి కూడా ఉండకూడదని శాపం పెట్టాడు. అందువల్లే ఈ యాగంటి పరిసర ప్రాంతాల్లో మిగిలిన పక్షలు అన్ని కనిపించినా కాకులు మాత్రం కనిపించవు. ఇది ఒక్కటే కాదు యాగంటిలో ప్రతి విషయం నిఘూడ రహస్యమే. ముఖ్యంగా ఈ క్షేత్రానికి యుగాంతంతో సంబంధం ఉంది. ఈ విషయాన్ని వీరబ్రహ్మంగారు తన కాలజ్జానంలో కూడా తెలిపారు. ఇందుకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ఉమామహేశ్వరుడి రూపంలో

1. ఉమామహేశ్వరుడి రూపంలో

Image source

యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా విశిష్ట ఆదరణ ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో పరమశివుడు శ్రీ ఉమామహేశ్వరుని పేరుతో లింగ రూపంలో వెలిసాడు.

2. తొలుత వెంకటేశ్వరుడి విగ్రహాన్ని

2. తొలుత వెంకటేశ్వరుడి విగ్రహాన్ని

Image source

తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్థలపురాణం.

3. స్వయంభువుగా వెలిసిన

3. స్వయంభువుగా వెలిసిన

Image source

దీంతో స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు.

4. ఐదు అంతస్తుల గోపురం

4. ఐదు అంతస్తుల గోపురం

Image source

ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. గర్భగుడిలో లింగతో పాటు ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఆలయం రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళంగా విభజించబడి ఉంది.

5. అగస్త్య పుష్కరిణి

5. అగస్త్య పుష్కరిణి

Image source

ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం.

6. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెలుతున్నాయి.

6. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెలుతున్నాయి.

Image source

ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెలుతుందనేది ఇప్పటికీ నిగూడ రహస్యమే

ఇందుకు సంబంధించిన మరిన్ని కథనాల కోసం. ఇందుకు సంబంధించిన మరిన్ని కథనాల కోసం.

7. సహజ సిద్ధమైన కొండగుహలు

7. సహజ సిద్ధమైన కొండగుహలు

Image source

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు.

8. బ్రహ్మం గారు

8. బ్రహ్మం గారు

Image source

ఆ ప్రక్కనే ఉన్న మరో గుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు కాలజ్జానం ఉపదేశించాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు.

9. స్వయంభువుగా వెలిసిన నంది

9. స్వయంభువుగా వెలిసిన నంది

Image source

ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.

10. అంతకంతకూ పెరిగి పోతున్నాడు

10. అంతకంతకూ పెరిగి పోతున్నాడు

Image source

ఈ బసవన్న ఆకారంలో అంతకంతకు పెరిగిపోతూ ఉంటాడు. గతంలో ఈ విగ్రహం చుట్టూ నాలుగు స్థంభాలు కూడా ఉండేవి. వీటి మధ్యలో నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలయ్యేది ప్రస్తుతం ఇందుకు అవకాశం లేదు.

11. 20 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున

11. 20 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున

Image source

ఈ విషయాన్ని పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడం విశేషం. 20 ఏళ్లకు ఒక అంగుళం చొప్పున పెరి పోతున్నాడు. అయితే ఇలా పెరగడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికతీ తెలియరాలేదు.

12. కలియుగాంతంలో రంకె వేస్తాడు

12. కలియుగాంతంలో రంకె వేస్తాడు

Image source

కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న పుణ్యక్షేత్రాల్లో యాగంటి కూడా ఒకటి కావడం విశేషం.

13. కాకులు కనిపించవు

13. కాకులు కనిపించవు

Image source

ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు.

యుగాంతానికి సంబంధించిన మరో కథనం కోసం...యుగాంతానికి సంబంధించిన మరో కథనం కోసం...

14. . తపస్సు చేసే సమయంలో

14. . తపస్సు చేసే సమయంలో

Image source

ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు.

15. భంగం కలిగించాయి..

15. భంగం కలిగించాయి..

Image source

ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

16. మరో కథనం..

16. మరో కథనం..

Image source

పూర్వం చిట్టప్ప అనే శివభక్తుడు పరమశివుడి గురించి ఇక్కడ ఘోర తపస్సు చేశాడు. శివుడు అతనికి పులి రూపంలో దర్శనమిచ్చాడు. దీంతో చిట్టప్ప నే కంటి శివ...నే కంటి శివ (నేను శివుడిని చూశాను...నేను శివుడిని చూశాను) అని ఆనందంతో నాట్యం చేశాడు.

17. నే...కంటి........యాగంటిగా మారింది....

17. నే...కంటి........యాగంటిగా మారింది....

Image source

అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని నే కంటి....నే కంటి అని పేరుతో పిలిచేవారు. కాల క్రమంలో అది యాగంటిగా మారిందని కూడా కథనం. ఇప్పటికీ ఇక్కడ చిట్టప్ప తప్పస్సు చేసిన గుహను చూడవచ్చు.

18. అంతగా సౌకర్యవంతంగా లేవు

18. అంతగా సౌకర్యవంతంగా లేవు

Image source

యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగానపల్లిలో వసతులున్నాయి. అందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారు తిరిగి బనగానె పల్లె కాని దగ్గర్లో ఉన్న నంద్యాలకు కాని వెళుతుంటారు.

19. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి...

19. ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి...

Image source

ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.

20. మరిన్ని పర్యాటక ప్రాంతాలు

20. మరిన్ని పర్యాటక ప్రాంతాలు

Image source

యాగంటికి దగ్గరాగే కాకుండా కర్నూల్ జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మహానంది, అహోబిలం, కర్నూల్ ఫోర్ట్, మంత్రాలయం తదితర పర్యాటక ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి.

Read more about: mahanandi kurnool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X