Search
  • Follow NativePlanet
Share
» »అటల్ బిహారీ వాజపేయి మౌంటనీరింగ్...ఇది సాహస పర్యాటక శిక్షణకు కేరాఫ్

అటల్ బిహారీ వాజపేయి మౌంటనీరింగ్...ఇది సాహస పర్యాటక శిక్షణకు కేరాఫ్

మనాలిలో ఉన్న ఏబీవీఐఎంఏఎస్ శిక్షణ సంస్థతో పాటు భారత దేశంలో అందుబాటులో ఉన్న సాహసక్రీడలకు సంబంధించిన కథనం.

మేఘాలను తాకే పర్వతాల మెడలను వంచి వాటి శిఖరాలను తాకాలని ఉందా? ఉరకలు వేసే నదీ జలాలలతో పోడీ పడుతూ రబ్బరు బోటులో వెళ్లాలని ఉందా? పర్వాత శిఖరాల పై సైకిల్ తో విన్యాసాలు చేయడానికి మనస్సు ఉవ్విల్లూరుతోందా? అయితే మీ మనసు సాహస క్రీడలకు సంబంధించిన పర్యాటకం కోసం తహతహ లాడుతున్నట్లు అర్థం.

అయితే ఎటువంటి శిక్షణ లేకుండా ఈ సాహస క్రీడల్లో పాల్గొనడం అంత క్షేమం కాదు. ఇందుకోసమే ప్రత్యేక శిక్షణ కేంద్రం ఉంది. దాని పేరే ది అటల్ బిహారీ వాజపేయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలీడ్ స్పోర్ట్స్ (ఏబీవీఐఎంఏఎస్).

ఈ కేంద్రంతో పాటు ఇక్కడ ఎకో టూరిజం పై కూడా శిక్షణ ఇస్తారు. ఈ కేంద్రంతో పాటు మన దేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల సాహస క్రీడలకు సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం....

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

సాహసక్రీడలు, పర్యాటకాలంటే ఇష్టపడేవారికి శిక్షణ ఇప్పడానికి భారత దేశంలో వేళ్లమీద లెక్కపెట్టకలిగినన్ని శిక్షణా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

అందులో మనాలిలో ఉన్న ది అటల్ బిహారీ వాజ్ పేయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలీడ్ స్పోర్ట్స్ (ఏబీవీఐఎంఏఎస్) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఇది భారత దేశంలోనే అతి పెద్ద అడ్వెంచర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రం. మొత్తం 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. బియాస్ నది ఒడ్డున ఉన్న ఈ శిక్షణ కేంద్రంలో ఎన్నో రకాల అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి ప్రాధమిక, అడ్వాస్డ్ శిక్షణ లభిస్తుంది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఒకేసారి 260 మందికి ఇక్కడ వసతి కల్పించగలరు. 680 సీటింగ్ సామర్థ్యం ఉన్న అడిటోరియం ఇక్కడ ఉంది. ఇక్కడ మ్యూజియం, గ్రంధాలయం కూడా ఉంది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఏబీవీఐ ఏబీవీఐఎంఏఎస్ ద్వారా ఇక్కడ ఇప్పటి వరకూ 40వేల మంది శిక్షణ పొందారు. ఏబీవీఐఎంఏఎస్ భారత దేశంలో పర్యాటక రంగం ముఖ్యంగా అడ్వెంచర్ టూరిజం అభివ`ద్ధికి ఎంతగానో దోహదం చేసింది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

యువతలో అడ్వెంచర్ స్పోర్ట్స్ పట్ల మక్కువ పెంచడంలో ఈ సంస్థ క`షి ఎంతో ఉంది. ఈ సంస్థ స్కేయింగ్, ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్, రివర్ క్రాసింగ్, జిప్ లైనింగ్ తదితరాలు ముఖ్యమైనవి

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఇలా ఒకటేమిటి భారత దేశంలో అందుబాటులో ఉన్న అన్ని రకాల అడ్వెంచర్ స్పోర్ట్స్ లో శిక్షణ ఇస్తుంది. మన దేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వత రాష్ట్రాల్లో స్కేయింగ్ ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం పొందుతున్న క్రీడ.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

మంచుకొండల్లో మంచు పై జారుతూ వెళ్లడమే స్కేయింగ్. ఈ క్రీడకు గాలి వీచే దిశ తెలియడంతో పాటు అత్యాధునిక క్రీడ పరికరాలు కావాలి. ఇందుకు సంబంధించిన సమస్త సమాచారం మనకు ఈ ఏబీవీఐఎంఏఎస్ లో దొరుకుతుంది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఇక మౌంటనెరింగ్. నిటారుగా ఉన్న పర్వతాలను ఎక్కడమే మౌంటనెరీంగ్. దీనికి శారీరక, మానసిక ద`డత్వం ఎంతో అవసరం. ప్రత్యేకమైన తాళ్లు కూడా అవసరం. ఒక్కొక్క సారి విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

ఇక ట్రెక్కింగ్. అడ్వెంచర్ టూరిజంలో తక్కువ ఖర్చుతో కూడుకొన్నది ట్రెక్కింగ్. పర్వత శిఖరాల పైకి గాని, లేదా అడవుల్లోకి కాని నడుచుకొంటూ వెళ్లడాన్నే క్లుప్తంగా ట్రెక్కింగ్ అని అంటారు. ఉత్తర భారత దేశంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలో కూడా ట్రెక్కింగ్ చాలా ప్రాచూర్యంతో కూడుకొన్నది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

రివర్ రాఫ్టింగ్ కూడా ఇటీవల ప్రాచూర్యం పొందుతున్న సాహస క్రీడ. ఈ రివర్ రాఫ్టింగ్ కోసం ఎంతో మంది విదేశీయులు కూడా భారత దేశం వస్తున్నారు. కర్నాటకలో కబిని రివర్ రాఫ్టింగ్ కు అనుకూలం. ముఖ్యంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

పర్వత శిఖరాల పైకి లేదా పర్వత శిఖరాల పైన సైకిల్ తో చేసే విన్యాసాన్నే మౌంట్ బైకింగ్ అని అంటారు. కర్నాటకలోని భీమేశ్వర మౌంట్ బైకింగ్ కు చాలా అనుకూలం. ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతూ ఉంది.

ఏబీవీఐఎంఏఎస్

ఏబీవీఐఎంఏఎస్

P.C: You Tube

పారగ్లైడింగ్, స్కైడైవింగ్ కొంత ఖర్చుతో కూడుకున్నవే అయినా ఇటీవల ఎగువ మధ్యతరగతి, సంపన్నుల కుటుంబాలకు చెందిన యువత ఈ క్రీడల పట్ల మక్కువ చూపిస్తున్నారు. స్కైడైవింగ్ మైసూరులో అందుబాటులో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X