Search
  • Follow NativePlanet
Share
» »వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు

వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు

మనుషి మొహం కలిగిన వినాయకుడు ఉన్న క్షేత్రం ఆది వినాయక దేవాలయం.

భారత దేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ అనేక దేవతలను పూజిస్తారు. పురాణాలను ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. అందులో ఉన్న అనేక ఆచారాలను ఇప్పటికీ పాటిస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఆ పురాణాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఈ పురాణాలను అనుసరించే భారత దేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజులు అనేక దేవాయాలను కట్టించారు. ఆ దేవాలయాలు ఆయా రాజుల శక్తికి, యుక్తికి కూడా ప్రతీకలని భావిస్తారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందులోనూ తమిళనాడులో అటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక దేవాలయానికి సంబంధించిన విచిత్ర కథనం మీ కోసం...

తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్తలకోనకు ఎందుకు ఆ పేరు వచ్చింది...ఇది మంచి ట్రెక్కింగ్ స్పాట్

వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...వరాహం...సింహం...మనిషి రూపంలో వెలిసిన విష్ణుమూర్తి ఇక్కడే...ఏడాదికి ఒక్కసారే దర్శనం...

శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమేశంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube

తమిళనాడులోని ఆది వినాయక మందిరంలో ప్రధాన దైవం విఘ్నాథిపతి అయిన వినాయకుడు. భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం భిన్నమైనది.

వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతంవినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
సాధారణంగా ప్రపంచంలో చాలా చోట్ల గజముఖుడిగా వినాయకుడిని పూజిస్తారు. అయితే ఈ దేవాలయంలో మాత్రం గణపతికి మనుష్య ముఖం ఉంటుంది.

శివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనేశివ పార్వతుల వివాహం జరిగిన చోటు...మూడు యుగాల నుంచి హోమగుండం వెలుగుతున్న ప్రాంతం...సందర్శిస్తే వెంటనే

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
అంటే ఏనుగు వలే తొండం, దంతాలు కాకుండా మానులు దేవతవలే మనుషికి ఉన్న మొహం ఇక్కడ గణపతికి ఉంటుంది. అందువల్లే ఈ దేవాలయం అత్యంత ప్రాముఖ్యత కలిగింది.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఇక్కడి భక్తులు గత జన్మలో చేసిన పాపాలను ఈ ఆది వినాయకుడు పోగొట్టుతాడని భావిస్తూ ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఇక్కడ మొదట ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది శ్రీరాముడు. తన పూర్వజన్మలో చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడ శ్రీరాముడు ఈ గణపతికి ప్రత్యేక పూజలు చేశాడని చెబుతాడు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఆ సంప్రదాయమే ఇప్పటికీ నడుస్తోంది. సాధారణంగా ఇటువంటి పూజలు నదీ, సముద్ర తీరాల్లో చేస్తారు. అయితే ఇక్కడ మాత్రమే మనం దేవాలయంలో ఇటువంటి పూజలను చేయడం చేవచ్చు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ముఖ్యంగా శ్రీరాముడు తన తండ్రికి పిండప్రధానం చేస్తున్న సమయంలో బియ్యపు పిండితో చేసిన పిండాలు కీటకాలుగా మారిపోతుండేవి.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఎన్ని సార్లు బియ్యపు పిండితో పిండాలు చేసినా అవి కీటకాలుగానే మారిపోతూ ఉండేవి. దీంతో శ్రీరాముడు ఆ పరమశివుడిని ప్రార్థిస్తాడు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి గత జన్మలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెబుతారు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
సమస్య పరిష్కారం కోసం ఈ ఆది వినాయక మందిరంలో పూజలు చేయాలని సూచిస్తాడు. పరమేశ్వరుడి సూచనమేరకు శ్రీరాముడు ఇక్కడి వెళ్లి పూజలు చేసి ఇక్కడే పిండ ప్రదానం చేస్తాడు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
శ్రీరాముడి పూజలన్నీ ముగిసిన తర్వాత ఆ నాలుగు పిండాలు నాలుగు శివలింగాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ నాలుగు శివలింగాలను ముక్తేశ్వర మందిరంలో చూడవచ్చు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
ఈ మందిరంలో మనుష్య రూపంలో ఉన్న గణేషుడితో పాటు శివుడిని కూడా పూజిస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి దగ్గర్లో సరస్వతీ దేవి దేవాలయం కూడా ఉంది.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ప్రతి ఏడాది సంకష్ట చతుర్థసి రోజున అగస్త్య మహాముని ఆ వినాయకుడిని పూజించడానికి వస్తాడు. ఇక్కడ గణపతిని పూజించడం వల్ల మన:శాంతి దొరుకుతుందని చెబుతారు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ప్రతి ఏడాది సంకష్ట చతుర్థసి రోజున అగస్త్య మహాముని ఆ వినాయకుడిని పూజించడానికి వస్తాడు. ఇక్కడ గణపతిని పూజించడం వల్ల మన:శాంతి దొరుకుతుందని చెబుతారు.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నాయి.

ఆది వినాయక మందిరం

ఆది వినాయక మందిరం

P.C: You Tube
తిరుచినాపళ్లి లేదా మధురై ఎయిర్ పోర్టు నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. రైలుద్వారా అయితే తిరువరూర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. ఇక చెన్నై నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X