Search
  • Follow NativePlanet
Share
» »చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే ‘ఆది’రంగడు

చర్మవాధులను దూరం చేసి...సంతాన ప్రాప్తిని కలిగించే ‘ఆది’రంగడు

ఆదితిరువ రంగంలోని రంగనాథస్వామి దేవాలయం గురించిన కథనం.

భారత దేశంలో తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరే రాష్ట్రంలో కూడా మనకు కనిపించవు. అందుకే తమిళనాడును టెంపుల్ స్టేట్ అని కూడా పిలుస్తుంటారు. అప్పటి రాజుల దైవ భక్తికి, కళారాధనకు ఆ దేవాలయాలు అద్ధంపడుతాయి. విశాలమైన ప్రాకారాలతో నిలువెత్తు స్థంభాలను కలిగిన ఆ దేవాలయాలు ఎంతో పురాణ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అక్కడి స్థల పురాణాన్ని శిల్పాల రూపంలో ఆ స్థంభాల పై చెక్కిన శిల్పులు కాల గమనంలో గతించిపోయి ఉండవచ్చు. అయితే ఆ శిల్పాలను చూసి పొగుడుతున్న ప్రజల నాలుకల పై ఇప్పటికీ జీవించి ఉన్నారన్నడంలో ఎటువంటి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ దేవాలయాలు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా కూడా వినతికెక్కాయి. ఇక ప్రస్తుత కథనంలో అలా శిల్ప సంపదతో పాటు భక్తుల కోరికలను తీర్చి వారి చింతలను పోగొడుతున్న ఓ దేవాలయం గురించి తెలుసుకొందాం.

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులుశుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

1. శేష తల్పం పై పడుకొన్నట్లు

1. శేష తల్పం పై పడుకొన్నట్లు

P.C: You Tube

గర్భ గుడిలో మూలవిరాట్టు విష్ణువు. అయితే శేష తల్పం పై పడుకొన్నట్లు ఉంటుంది. ఈ రూపంలో విష్ణవు విగ్రహం ఉండటం భారత దేశంలో చాలా అరుదు. ఈ అరుదైన రూపులో మూలవిరాట్టును కలిగిన దేవాలయం ఆది తిరువరంగం. ఇక్కడ విష్ణువును రంగనాథ స్వామి పేరుతో కొలుస్తారు.

2. స్కాంద పురాణంలో

2. స్కాంద పురాణంలో

P.C: You Tube

ఇక స్కాంద పురాణంలోని ఉత్తరకాండలో ఉమామహేశ్వర సంవాదంలోని ఉత్తర రంగ మహాత్యంలో ఆదితిరువ రంగం ప్రస్తావన ఉంది. దీనిని బట్టి ఈ దేవాలయం ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు.

3. సోమాసురుడనే రాక్షసుడు

3. సోమాసురుడనే రాక్షసుడు

P.C: You Tube

స్థానిక కథనం ప్రకారం పూర్వం సోమాసురుడనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దొక్కొంటాడు. దీంతో దేవతలందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్లి మొర పెట్టుకొంటారు.

4. మశ్చ్య రూపంలో

4. మశ్చ్య రూపంలో

P.C: You Tube

దీంతో ఆ విష్ణువు మశ్చ్య రూపంలో సముద్రం లోపలికి వెళ్లి ఆ సుమాసురడితో భీకర యుద్ధం చేసి అతన్ని సంహరిస్తాడు. అటు పై వేదాలను ఆ స`ష్టి కర్త అయిన బ్రహ్మదేవుడికి అందజేస్తాడు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఆది తిరువురంగం.

5.కొద్ది సేపు విశ్రమిస్తాడు

5.కొద్ది సేపు విశ్రమిస్తాడు

P.C: You Tube

యుద్ధంలో తీవ్రంగా అలసి పోయిన విష్ణువు ఆ ఆది తిరువు రంగంలో కొద్ది సేపు విశ్రమిస్తాడు. అటు పై మశ్చ్యావతారాన్ని వదిలి ఆది తిరువురంగం నుంచి వైకుంఠానికి పయనమవుతాడు.

6.మశ్చ్యవతారం వదిలి

6.మశ్చ్యవతారం వదిలి

P.C: You Tube

అయితే బ్రహ్మతో పాటు మిగిలిన దేవతలు, బుుషులు కోరికతో మశ్చ్యవతారం వదిలి తిరిగి వైకుంఠానికి బయలుదేరిన ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగా వెలుగొందుతుందని విష్ణువు వరమిస్తాడు.

7.దైవ శిల్పి మయుడు

7.దైవ శిల్పి మయుడు

P.C: You Tube

తనను దర్శించిన భక్తుల కోరికలను తప్పక తీరుస్తానని కూడా చెబుతాడు. అంతే కాకుండా దైవ శిల్పి మయుడిని పిలిచి వైకుంఠంలో పాల కడలిలో శేష తల్పం పై పవలించినట్లు ఉండే శిల్పాన్ని మలిచాల్సిందిగా సూచించాడు.

8.ఆది రంగం రంగనాథస్వామి దేవాలయం

8.ఆది రంగం రంగనాథస్వామి దేవాలయం

P.C: You Tube

అటు పై ఇక్కడ తనకు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాల్సిందిగా దేవశిల్పి మయుడిని విష్ణువు ఆదేశించాడు. దేవ శిల్పి మయుడు నిర్మించిన దేశంలోని అతి తక్కువ దేవాలయాల్లో ఆది రంగం రంగనాథస్వామి దేవాలయం కూడ ఒకటి.

9.స్వామి విగ్రహం పొడవు 15 అడుగులు

9.స్వామి విగ్రహం పొడవు 15 అడుగులు

P.C: You Tube

ఆలయంలో తూర్పు ముఖంగా పవళించిన స్వామి విగ్రహం పొడవు 15 అడుగులు. శేషనాగు పై పవళించిన స్వామి ఎడమ భుజం దగ్గర శ్రీదేవి, పాదల వద్ద భూదేవి ఉంటుంది.

10.నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ

10.నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ

P.C: You Tube

కుడి చెయ్యి తలకింద పెట్టుకొని, ఎడమ చెయ్యి పైకి ఎత్తి ఉంటుంది. నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ నాలుగు వేదాలను ఉపదేశిస్తున్నట్లు చూడటానికి చాలా మనోహరంగా విగ్రహం ఉంటుంది.

11.సాందోమయ విమానం

11.సాందోమయ విమానం

P.C: You Tube

వేదాలను ఎనిమిది దిక్కులకూ వినిపించేలా ఉపదేశించారు కాబట్టి దేవాయలయం విమానాన్ని సాందోమయ విమానం అని అంటారు. ఇక్కడ అమ్మవారిని శ్రీరంగనాయకి అని పిలుస్తారు. ఈమెకు ప్రత్యేక ఆలయం ఉంది.

12.చంద్ర పుష్కరిణి

12.చంద్ర పుష్కరిణి

P.C: You Tube

ఇక ఈ దేవలయంలో ఉన్న పుష్కరిణిని చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. చంద్రుడు దక్షుని 27 మంది కుమార్తెలను వివాహమాడిన చంద్రుడు కేవలం ఒక్కరి పై మాత్రమే ఎక్కువ ప్రేమను చూపించేవాడు.

13.చంద్రుడికి క్షయ వ్యాధితో పాటు

13.చంద్రుడికి క్షయ వ్యాధితో పాటు

P.C: You Tube

మిగిలిన వారు తమ బాధను తండ్రి దక్షుడి వద్ద చెప్పుకొన్నారు. దీంతో దక్షుడు చంద్రుడికి క్షయ వ్యాధితో పాటు భయంకరమైన చర్మవ్యాధికి లోనయ్యి క్రమంగా చంద్రుడి కాంతి క్షీణిస్తుందని శాపం పెడుతాడు.

14. త్రిమూర్తులను ప్రార్థిస్తాడు

14. త్రిమూర్తులను ప్రార్థిస్తాడు

P.C: You Tube

భయపడిన చంద్రుడు త్రిమూర్తులను ప్రార్థిస్తాడు. వారి సూచన మేరకు మొదట ఈ ఆది తిరువురంగం లోని పుష్కరిణిలో స్నానం చేసి కొంత సాంత్వన పొందుతాడు.

15. అందుకే ఈ పేరు

15. అందుకే ఈ పేరు

P.C: You Tube

అందుకే ఈ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అని పేరు. ఇక దక్షుడంతటి వాడి శాపాన్నే తొలిగించిన ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే మన చర్మవ్యాధులు కూడా తీరుతాయని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతారు. అంతే కాకుండా ఎంతో మంది ఈ పుష్కరిణిలో స్నానం చేసి సాంత్వన పొందినట్లు స్థానిక పూజారులు స్పష్టం చేస్తున్నారు.

16. సంతానం ఉండేది కాదు

16. సంతానం ఉండేది కాదు

P.C: You Tube

కృతయుగంలో ఈ ప్రాంతాన్ని శ్రుతకీర్తి అనే రాజు ప్రజారంజకంగా పాలించేవాడు. అయితే అతనికి సంతానం ఉండేది కాదు. దీంతో నారద మహర్షి సూచనమేరకు ఆది రంగం రంగనాథస్వామిని పూజించి ఫలితం పొందాడు.

17. సంతానలేమితో బాధపడే వారు

17. సంతానలేమితో బాధపడే వారు

P.C: You Tube

అందువల్లే కొత్తగా వివాహం అయిన జంటలతో పాటు సంతానలేమితో బాధపడే చాలా మంది స్వామివారిని సందర్శించి ప్రయోజనం పొందతూ ఉంటారు. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే వారు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

18. పరిమాణంలో చిన్నదిగా

18. పరిమాణంలో చిన్నదిగా

P.C: You Tube

ఇక గర్భగుడికి ముందు పరిమాణంలో చిన్నదిగా ఉన్న రంగనాథుడి విగ్రహం ఉంటుంది. విదేశీ దండయాత్రల నుంచి ఆలయంలోని మూలవిరాట్టును రక్షించడానికి ఈ ఏర్పాటును చేశారు.

19కస్తూరి రంగన్ పేరుతో

19కస్తూరి రంగన్ పేరుతో

P.C: You Tube

ఈ చిన్నవిగ్రహాన్ని కూడా కస్తూరి రంగన్ పేరుతో కొలుస్తుంటారు. దీనిని చోట రంగనాథన్ అని కూడా అంటారు. స్వామి సన్నిధానంలో లక్ష్మణ సమేత సీతరామచంద్రుడి ఉపాలయం కూడా సందర్శించుకోవచ్చు.

20. నెల్ కొళంజి

20. నెల్ కొళంజి

P.C: You Tube

సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయంలో ధాన్యం నిలువ చేసే పరిమాణంలో అతి పెద్దదైన పాత్ర ఉంది. దీనిని నెల్ కొళంజి అని పిలుస్తారు. పరమ భక్తురాలు అవ్వయ్యార్ ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపే శిలాశాసనాన్ని కూడా మనం చూడవచ్చు.

21. తిరువణ్ణామలై నుంచి దాదాపు 40 కిలోమీటర్లు

21. తిరువణ్ణామలై నుంచి దాదాపు 40 కిలోమీటర్లు

P.C: You Tube

తెన్ పెణ్ణై నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. తిరువణ్ణామలై నుంచి దాదాపు 40 కిలోమీటర్లు. నిత్యం బస్సులు ఇక్కడికి తిరుగతూ ఉంటాయి. ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ తెరిచిఉంచుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X