Search
  • Follow NativePlanet
Share
» »ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !

ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా గల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. కర్నూలు అతిపెద్ద జిల్లా. ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది. చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. చారిత్రిక వివరం ప్రాచీన సాహిత్యం, శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది. కర్నూల్ కి వేల సంవత్సరాల చరిత్ర వుంది.

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది. జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటి లలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి. మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తాన్ల పాలనలో వుండేది. అంతకు ముందు దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు. 1687 లో ఈ ప్రాంతాన్ని ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేజిక్కించుకుని దీన్ని నవాబుల అధీనంలో వదిలేశాడు. తరువాత నవాబులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని కర్నూల్ ను 200 ఏళ్ళ పాటు స్వతంత్రంగా పాలించారు. 18వ శతాబ్దంలో నవాబులు బ్రిటిష్ వారి తో పోరాడారు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోట ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట. ఇది సుమారు 3000 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపుర సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, చివరికి ఆంగ్లేయుల చేతుల్లోకి మారుతూ వచ్చింది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఈ ప్రాంతం ద్వాపరయుగంలో యదువంశ మూలపురుషుడు యయాతి-దేవమానిల (శుక్రాచార్యుల) పుత్రిక యదు పేరుతో యదుపురం యాదవ అవనిగా పిలువబడింది. తదనంతరం 7వ శతాబ్ధంలో బాదామి చాళుక్యులు పరిపాలించారు. దీనిని క్రీ.పూ 1200 శతాబ్దంలో చంద్రసేనుడు అనే రాజు కట్టించినట్లుగా తెలుస్తోంది. దీనిని యాదవగిరి అనే పేరుతో నిర్మించారు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

తరువాత మధ్యయుగంలో విజయనగర రాజుల చేతికి వచ్చి క్రీ.శ 14 నుంచి 16 వ శతాబ్దం మధ్యలో బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. వారి తరువాత ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ మరియు బీజాపూర్ సుల్తానులకు గట్టి కోటగా వ్యవహరించింది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

1690 లో దీన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. 18 శతాబ్దం చివరి నాటికి మైసూరు రాజుల చేతికి, 1785లో టిప్పు సుల్తాన్ చేతికి చివరికి 1799 లో ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. యాదవగిరి 800 నుండి 900 అడుగుల ఎత్తు వుండి 48 నుంచి 50 కిలోమీటర్ల చుట్టు కొలతలో కోటనిర్మాణమై మొదట 7 వృత్తాల కోటగోడలు వుండి బారాకిల్లా అనే పేరుతో 12 కోటలున్నాయి. శతృవులు చొరబడలేని విధంగా చక్రవ్యూహంగా కనబడేది. కోట వైశాల్యం 3583 ఎకరాలు, కోటగోడల మందం25 నుండి 35 అడుగుల మందం ఉండేది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

పురాతన కట్టడాలు, ఆలయాల నగరం పురాతన కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు, కర్నూలు అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది. మధ్య యుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటల శిధిలాలలో పురాతన కాలపు అరబ్బీ, పర్షియా శాసనాలు ఉన్నాయి. ఈ కోటను తప్పక సందర్శించాలి. కొండారెడ్డి బురుజు, అబ్దుల వహాబ్ సమాధి చూడదగిన అద్భుత ప్రదేశాలు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూల్ పాలకుల వేసవి విడిది, వరద రక్షిత గోడ, కొన్నిప్రాముఖ్యత కల్గిన పేట ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం కూడా చూడ దగిన ప్రదేశాలు. కర్నూలు నవంబరు, డిసెంబర్ నెలలలో ప్రసిద్ధ రధొత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. దీనిని ఆంజనేయస్వామి పేరున జరుపుకుంటారు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

నగరానికి ప్రయాణం కర్నూలు నగర ప్రయాణం సులువుగా, సౌకర్యవంత౦గా ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కర్నూల్ కి సమీప విమానాశ్రయం. కర్నూలు నగరం నుండి ఈ విమానాశ్రయానికి మూడున్నర గంటల సమయం పడుతుంది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని నగరాల నుండి అలాగే బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

తీవ్రమైన వేడితో కూడిన కర్నూలు లోని వేసవి ఆహ్లాదకరంగా ఉండదు. కర్నూలులో వర్షాలు కూడా బాగా పడతాయి; అందువల్ల అక్టోబర్ నుండి మార్చ్ నెలలలో వర్షాల తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది, పర్యాటక కార్యకలాపాలకు అనువుగా వుంటుంది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఇక్కడ చూడదగిన ప్రదేశాలు

నల్లమల అడవి

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

నల్లమల అడవి

ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు. ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

షిర్డీ సాయిబాబా ఆలయం

షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

షిర్డీ సాయిబాబా ఆలయం

అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూలు మ్యూజియం

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూలు మ్యూజియం

కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలోఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు

ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఈ బురుజు లో గుప్త నిధులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ నిధులను కనుగొనడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకం

ఈ స్మారక కట్టడం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి స్మృతిగా కట్టింది. కర్నూలు నగరానికి చెందిన ఈయన రాష్ట్రంలోనే కాక దేశంలోని అతి ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. తన ప్రజలచే అభిమాని౦చబడిన ఈయనను అనుచరులు పెద్దాయనగా పిలుచుకునేవారు. హంద్రి నది ఒడ్డున ఉన్న ఈ స్మారకం ప్రస్తుతం ఒక ప్రముఖ విహార కేంద్రం.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

బాల సాయిబాబా ఆలయం

బాల సాయిబాబా ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయానికి దగ్గరలో ఉంది. ఇది కర్నూలు నగర౦లోని అవతార పురుషుడు శ్రీ బాల సాయిబాబాకు చెందినది. ఈ మధ్య కాలంలో బాగా పేరుగాంచిన బాల సాయిబాబా మందిరం పెద్ద ప్రాంగణంలో ఉంది. మీరు అవతారపురుషులను, వారి ఆధ్యాత్మిక శక్తులను విశ్వసిస్తే ఈ ప్రదేశాన్ని సందర్శించండి.

PC:youtube

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఎలా వెళ్ళాలి

రోడ్డు ద్వారా

బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలా చౌకగా, తేలికగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్నూలుకు సరైన ధరలలో కాబ్స్ కూడా తేలికగా అందుబాటులో ఉన్నాయి.

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

రైలు ద్వారా

కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

ఆదోని కోటలో చక్రవ్యూహం దీని వెనుక అద్భుతం !

వాయు మార్గం ద్వారా

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

<strong>పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!</strong>పెళ్ళికి ముందే గర్భం దాల్చి... అక్కడి అమ్మవారి చరిత్ర వింటే షాక్ అవుతారు!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X