Search
  • Follow NativePlanet
Share
» »Kuchaman fort: ఆ కోట‌ను చేరుకోవాలంటే..రివ‌ర్స్‌లో వెళ్లాల్సిందే

Kuchaman fort: ఆ కోట‌ను చేరుకోవాలంటే..రివ‌ర్స్‌లో వెళ్లాల్సిందే

ప్ర‌పంచంలో కొన్ని ప్రాంతాల‌ను చేరుకోవ‌డానికి భ‌యంక‌ర‌మైన మార్గాల‌గుండా వెళ్లాల్సి ఉంటుంది. కొంద‌రు ఔత్సాహిక ప‌ర్యాట‌కులు అలాంటి అడ్వంచ‌ర్స్‌ను మాత్ర‌మే కోరుకుంటారు. సాహ‌సంలోనే ఓ తృప్తి ఉంటుంద‌నేది వారి భావ‌న‌. అలాంటి సాహ‌సాలు జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయి అన‌డంలో సందేహ‌మే లేదు. అయితే, ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ప్రాంతం అలాంటి వారికోస‌మే.

ఇక్క‌డికి వెళ్లాలంటే ప‌ర్యాట‌కులు త‌మ వాహ‌నాన్ని ముందు భాగం నుంచి వెళ్ల‌కుండా రివ‌ర్స్ డ్రైవింగ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. గ‌మ్య‌స్థానాన్ని చేరుకునేవ‌ర‌కూ ప్ర‌మాద‌పుటంచున ప్ర‌యాణం చేయాల్సిందే! అదే, రాజ‌స్తాన్‌లోని న‌గౌర్ ప్రాంతంలో ఉన్న కుచ్‌మాన్ కోట. అబ్బుర‌ప‌చే నిర్మాణ శైలితో ఈ కోట 800 మీట‌ర్ల ఎత్తులో కొండ ప్రాంతంపై ఉన్న ఈ ప్రాంతం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఆ కోట ప్ర‌త్యేక‌త‌ల‌ను మ‌న‌మూ తెలుసుకుందాం.

అబ్బుర‌ప‌ర‌చే కోట నిర్మాణ శైలి

జ‌ల‌జ‌లీమ్ సింగ్ ఎనిమిది వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ఈ కోట‌ను నీటి సంగ్ర‌హ‌ణ కోసం నిర్మించార‌ని అక్క‌డి స్థానికులు చెబుతుంటారు. వ‌ర్ష‌పు నీటిని నిల్వ చేసేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. కోటపై భాగంలో ఇక్క‌డ వ‌ర్ష‌పు నీటిని సేక‌రించ‌డానికి 17 జాయింట్ ట్యాంకుల‌ను నిర్మించారు. అలాగే, సంద‌ర్శ‌కుల కోసం ఇక్క‌డ 2000 సంవ‌త్స‌రంలో ఒక హోట‌ల్‌ను నిర్మించారు. దాని తర్వాత అధిక సంఖ్య‌లో ప‌ర్యాట‌కుల తాకిడి పెరుగుతూ వ‌చ్చింది. ఈ కోట‌లో నిర్మించిన 17 ట్యాంకులు అండర్ గ్రౌండ్ డ్రైన్‌లో క‌లిసి ఉన్నాయి. అప్ప‌ట్లో పైపుల‌ను ఉప‌యోగించేవారు కాదు. అందుకే డిష్‌, వాట‌ర్ ఫ్రూప్ డ్ర‌యిన్ ద్వారా ఒక ట్యాంకు నుంచి మ‌రొక ట్యాంకుకు వ‌ర్ష‌పు నీరు చేరుతుంది. అప్ప‌టి కాలంలోనే ఇంత‌టి అధునాత‌న టెక్నాల‌జీని ఉప‌యోగించ‌డ ఈ కోటకు మ‌రింత‌ ప్రాముఖ్య‌త‌ను తెచ్చిపెట్టింద‌నే చెప్పాలి.

ఏట‌వాలు ప్ర‌యాణం!

ఈ కోటపై భాగానికి చేరుకోవ‌డానికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉంటుంది. పైకి వెళ్లేకొద్దీ ఏట‌వాలుగా మారే ఈ మార్గంలో వాహ‌నాలు జాగ్ర‌త్త‌గా రివ‌ర్స్ డ్రైవింగ్ చేస్తూ పైకి చేరుకోవాలి. ఇక్క‌డి అధిక‌శాతం విదేశీ ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. కోట‌లోప‌లికి చేరుకునేందుకు అక్క‌డ ట్రైనింగ్ పొందిన డ్రైవ‌ర్ల‌ను మాత్ర‌మే లోప‌లి వ‌ర‌కూ అనుమ‌తిస్తుంటారు. వారిని కూడా సంబంధిత ప‌ర్యాట‌క శాఖ నియ‌మిస్తుంది. ప్ర‌తి క్ష‌ణం చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ శిక్ష‌ణ పొందిన డ్రైవ‌ర్లు సంద‌ర్శ‌కుల‌కు స‌హాయ‌ప‌డుతుంటారు.

వృద్దులు, పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అక్క‌డ‌కి చేరుకునేందుకు చేసే ఈ ప్ర‌మాద‌పుటంచున ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోల‌నేని అనుభ‌వాన్ని ప‌రిచ‌యం చేస్తుంద‌నే చెప్పాలి. ఇంకెదుకాల‌స్యం ఎప్పుడైనా మీరు రాజ‌స్థాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళితే ఈ ప్రాంతాన్ని త‌ప్ప‌కుండా వీక్షించండి.

Read more about: rajasthan kuchaman fort
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X