Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో ఆనందాన్నిచ్చే సాహస క్రీడలు !

గోవాలో ఆనందాన్నిచ్చే సాహస క్రీడలు !

గోవా అందమైన బీచ్ లు, అద్భుత దృశ్యాలే కాదు, ఎన్నో సాహసోపేత నీటి క్రీడలు కూడా అందిస్తుంది. మీరు గోవా వెళ్లి ఈ నీటి క్రీడలు ఆడకుంటే సగం ఆనందం మీకు తగ్గినట్లే. ఇండియా లో గోవా ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. ఏ వయసు వారైనా సరే గోవా వెళ్లి వారి ఆనందాలు వారు పొందవచ్చు. అక్కడకు వెళ్ళిన తర్వాత, మీరు ఆశించిన ఆనందం కటే అధికంగానే దొరుకుతుంది. గోవా సంగీతం, గోవా ఆహారాలు, బీచ్ తీర సూర్య స్నానాలు, బార్లు, రెస్టారెంట్ లు మొదలైన ఎన్నో ఆకర్షణలు కలవు. వీటన్నిటితో పాటు మీకు గోవా తీరంలో తేలికగా ఆచరించగల కొన్ని క్రీడలు కూడా కలవు. వాటిని మీకు అందిస్తున్నాం... పరిశీలించండి.

పారా సెయిలింగ్
గోవా లో పారా సెయిలింగ్ ఒక ప్రసిద్ధ వాటర్ స్పోర్ట్. ఈ నీటి క్రీడ మీకు అనేక బీచ్ లలో కనపడుతుంది. మిరామర్ బీచ్, బాగా బీచ్ , కొలవా బీచ్, కాలాన్ గూటే బీచ్ లు ఆకర్షనీయం. ఈ క్రీడలో మీరు సముద్రంలో ఒక పారాచూట్ మరియు రోప్ సహాయంతో కొంత ఎత్తులో ఎగురుతారు. ఆ ఎత్తులో పైన నీల ఆకాశం, కింద స్వచ్చమైన సముద్రపు నీరు కనపడి ఆహ్లాదంగా వుంటుంది.

సముద్రపు చేపల వేట
ఇక్కడ మీరు ఆనందం కొరకు లేదా ఆహారంకోరకు చేపలు పట్టవచ్చు. గోవా టూరిజం శాఖ మీ సముద్ర మత్స్య వేటకు అవసరమైన వస్తువులు కూడా సరఫరా చేస్తుంది. చేపలు పట్టి ఆనందించాలంటే, ప్రత్యేకించి వర్కా బీచ్ లేదా బాగా బీచ్ లు అనుకూలం.

మరి మీ చేపలు పడే అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకోనండి. చేప దొరికిందా, దానిని తీసుకు వెళ్లి అక్కడ కల హోటళ్ళలో వండించుకొని తినవచ్చు కూడాను.

వాటర్ స్కై ఇంగ్
సముద్రపు అలలు ఒక్క పెట్టున మీ ముఖం పై వచ్చి పడితే ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది! వాటర్ స్కై ఇంగ్ క్రీడలో మీకు జరిగేది అంతే. ఇతర నీటి క్రీడల వలెనె గోవా లోని బీచ్ ల లో వాటర్ స్కై ఇంగ్ ఒక గొప్ప అడ్వెంచర్. కన్దోలిం బీచ్, పలోలిం బీచ్, బాగా బీచ్, కాలాన్ గూటే బీచ్ లు ఈ ఆటకు ఇక్కడ ప్రసిద్ధి. మీకు సముద్రంలో ఆటలో బాలన్స్ చేయటం తెలియాలి. మీరు కొత్తగా చేసే వారైతే, కొంత మేరకు శిక్షణ కూడా లభిస్తుంది.

డింగి సెయిలింగ్
ఈ డింగి సెయిలింగ్ నీటి క్రీడను మీరు కన్దోలిం బీచ్ మరియు బాగా బీచ్ లలో అధికంగా ఆనందించ గలరు. దీనికి ఏ మాత్రం అనుభవం అవసరం లేదు. డిన్గీలు అంటే చిన్న బోటు లు ఒక్కొక్క దానిలో నలుగురి కంటే అధికంగా పట్టారు. ఈ బోటు లను తీరం నుండి తీసుకుని కొద్దిపాటి గైడెన్స్ తో నడపవచ్చు.

మైక్రోలైట్ - ఫ్లైయింగ్
రెక్కలు కట్టుకొని ఎగురుతూంటే ఎంత బాగుంటుందో తెలుసా ? ఈ మైక్రోలైట్ ఫ్లైయింగ్ లో మీరు ఆ అనుభవం పొందాలంటే, కాలాన్ గూటే బీచ్ లేదా బాగా బీచ్ లకు వెళ్ళాల్సిందే. సముద్రంలో పై భాగాన కింద ఎగిసి పడే అలలు చూస్తె, ఎగరటం మీకు జీవితమంతా గుర్తుంటుంది.

బనానా బంప్ మరియు రింగో రైడ్స్
బనానా బోటు విహారం గోవా లో ఒక చిన్న ఆనందం. బనానా ఆకారంలో కల బోటు లలో మీరు ప్రయాణిస్తారు సముద్రం లో కొంత దూరంలో మిమ్మల్ని లైఫ్ జాకెట్స్ తో వదిలేస్తారు. మీరు మరల బోటు వద్దకు రావాలి. ఇదంతా ఒక థ్రిల్లింగ్ గా వుంటుంది. ఈ క్రీడ కాలాన్ గూటే బీచ్, బాగా బీచ్, లలో కలదు. శిక్షణనిచ్చే వారు కూడా వుంటారు.

ఒత్తిడి మాయం...వినోదం ఖాయం!

స్కూబా డైవింగ్
ఇది నీటి అడుగున ప్రయాణిస్తూ నీటి కింద గల జలచరాలను అన్వేషించడం. మీకు గనుక స్కూబా డైవింగ్ తెలిస్తే, గోవా లోని బొగ్మాలో బీచ్ లో ఈ క్రీడా కలదు. బాగా , కొలవా బీచ్ లలో కూడా కలదు. ఇది మీరు నేర్చుకోవాలంటే, అక్కడ కొంత కాలం వుంటే, శిక్షణ ఇస్తారు.

మీరు కనుక పైకి ఎగురుతూ కింద సముద్రం చూడాలనుకుంటే, ఈ రకమైన నీటి సాహస క్రీడలకు గోవా తప్పక చూడండి. మీ ఒత్తిడిని అవి మాయం చేసి, వినోదాలను అందించి ఆనందింప చేస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X