Search
  • Follow NativePlanet
Share
» »అహోబిలం గుడి.. అంతుచిక్కని మిస్టరీ...

అహోబిలం గుడి.. అంతుచిక్కని మిస్టరీ...

అహో అంటే ఒక గొప్ప ప్రశంస.బిలం అంటే బలం అని చెపుతారు.కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి.

By Venkatakarunasri

అహో అంటే ఒక గొప్ప ప్రశంస.బిలం అంటే బలం అని చెపుతారు.కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీమహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపంచూసిన సకలదేవతలు ఆయన గురించి అహో! ఎంత బలవంతుడు అని కీర్తించినారట.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

జయజయ ధ్వానాలు చేసారట.అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబిలం,అహోబలం అని పేరొచ్చింది. ప్రస్తుతం అహోబిలం క్షేత్రం సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డమండలంలో కలదు.
ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే కర్నూలు,నంద్యాల మరియు హైదరాబాద్ నగరాలనుండి బస్సులు లభిస్తాయి. ఈ ప్రదేశానికి రైలుమార్గం లేదు.సమీప రైలుస్టేషన్ నంద్యాలలో వుంది. ఇది బెంగుళూర్,వైజాగ్ రైలుమార్గంలో తగులుతుంది.

చిత్ర కృప: Ashwin Kumar

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

పురాణ గాథ

ఒక పురాణ గాథమేరకు ఈ పుణ్య ప్రదేశంలో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడ్ని ఆశీర్వదించాడు. అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు.

చిత్ర కృప: Gopal Venkatesan

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి.

చిత్ర కృప: Gopal Venkatesan

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

చరిత్ర

ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

.ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

అహోబల మహత్యం

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రంహ్మోత్సవాలు జరిగిగరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారుతన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఎగువ అహోబలము

ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

దిగువ అహోబలము

శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

వసతి సౌకర్యాలు

అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు. దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకం వారి భోజన హోటల్ ఉంది.

అంతుచిక్కని మిస్టరీ

అంతుచిక్కని మిస్టరీ

ఎలా చేరాలి

చెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని ఆర్లగడ్డ" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం ఉంది. అన్నివసతులు ఉన్నాయి.

ఎలా చేరాలి

ఎలా చేరాలి

రోడ్డు మార్గము

హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప. తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిశ్నాపురం, బాచేపల్లి మీదుగ కూడా అహోబిలం చేరుకోవచ్చు.

రైలు మార్గము

అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల

విమాన మార్గము

అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం హైదరాబాదు, అక్కడనుండి మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X