Search
  • Follow NativePlanet
Share
» »అహోబిలం - అంతు పట్టని రహస్యం !

అహోబిలం - అంతు పట్టని రహస్యం !

అహో... అంటే ఒక గొప్ప ప్రశంశ. బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్య కశిపుడిని సంహరించేందుకు సగం మనిషి గాను, సగం సింహ రూపంలో అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెపుతారు.

విష్ణువు యొక్క ఈ భయంకర రూపం చూసిన సకల దేవతలు ఆయనను గురించి " అహో ...ఎంత బలవంతుడు " అని కీర్తిన్చారట. జయ జయ ధ్వానాలు చేశారట. (ఒక అంతు లేని శక్తి అని అర్ధం) . అందుకని ఈ ప్రదేశానికి కాల క్రమేనా అహోబిలం / అహోబలం అనే పేరు వచ్చింది.

అహోబిలం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల్ల అడవిలో కాలి నడక మార్గాన 20 కి. మీ. దూరంలో ఉన్న వజ్రాల కొండలో దాగిన మహా అద్భుతం ఉల్లేడ ఉమా మహేశ్వరస్వామి క్షేత్రం అహోబిలం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల్ల అడవిలో కాలి నడక మార్గాన 20 కి. మీ. దూరంలో ఉన్న వజ్రాల కొండలో దాగిన మహా అద్భుతం ఉల్లేడ ఉమా మహేశ్వరస్వామి క్షేత్రం

ప్రస్తుత అహోబిలం క్షేత్రం సీమాంధ్ర లోని కర్నూల్ జిల్లాలో , ఆళ్ళ గడ్డ మండలం లో కలదు. ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళాలంటే, కర్నూల్, నంద్యాల్ మరియు హైదరాబాద్ నగరాల నుండి బస్సు లు తేలికగా లభిస్తాయి.

ఈ ప్రదేశానికి రైలు మార్గం లేదు. సమీప రైలు స్టేషన్ నంద్యాల్ లో కలదు. ఇది బెంగుళూరు - వైజాగ్ రైలు మార్గంలో తగులుతుంది.

అహోబిలం

అహోబిలం

ఒక పురాణ గాధ మేరకు ఈ పుణ్య ప్రదేశం లో విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామీ రాక్షసుల రాజైన హిరణ్యకసిపుడిని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు.

చిత్ర కూర్ప: Ashwin Kumar

అహోబిలం

అహోబిలం

పురాణాలలో అహో బిలం గురించిన కీర్తనలు ఈ విధంగా సాగినవి.

అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం , నరసింహ పరమ దైవం, అహో బలం ....

చిత్ర కృప: RameshSharma1

అహోబిలం

అహోబిలం

అహోబిలం క్షేత్రంలో నారసింహ దేవుడికి నిర్మించిన దేవాలయాలు వివిధ దిక్కులలో తొమ్మిది వరకూ నిర్మించినట్లు చెపుతారు. నల్లమల అడవులలో నిర్మించిన ఈ దేవాలయాలు అద్భుత శిల్ప శైలి కలిగి వున్నాయి.

చిత్ర కృప: Gopal Venkatesan

అహోబిలం

అహోబిలం

ఇక్కడి కొన్ని దేవాలయాలు గుహలలో వుంటే మరి కొన్నిటికి ట్రెక్కింగ్ చేసి కొండలు ఎక్కాలి. మార్గంలో అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు. ట్రెక్కింగ్ కఠినం గా వుంటుంది సుమా !

చిత్ర కృప: RameshSharma1

అహోబిలం

అహోబిలం

మనిషి జీవితాన్ని నిర్ధారించే ఈ 9 గుహలను అత్యంత భక్తి శ్రద్ధలతో తమ శత్రు సంహారం కొరకు పూజించాలని నమ్ముతారు.

చిత్ర కృప: RameshSharma1

అహోబిలం

అహోబిలం

ఈ ప్రదేశంలోని చుట్టూ కల నలమల కొండలను శ్రీ మహా విష్ణువు ఆసనమైన శేష పాన్పు తో పోలుస్తారు. తిరుపతి తిరుమల ప్రదేశ కొండలను ఆది శేషుని పడగ గాను, నల్లమల కొండలను ఆది శేషుడి మధ్య భాగంగాను, శ్రీశైల కొండలను ఆదిశేషుడి చివరి తోక గాను అభివర్ణిస్తారు.

చిత్ర కృప: RameshSharma1

అహోబిలం

అహోబిలం

సగం మనిషి, సగం సింహం ఆకారం గల విష్ణువు స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన వెంటనే, దేవతలు 'అహో బిలం ...అహో బలం' అంటూ జయ జయ ధ్వనులు చేసారు. శ్రీ మహా విష్ణువు చీల్చు కొని వచ్చిన స్థంభం ఉక్కు అంత ద్రుడ మైనది అని భావిస్తారు.

చిత్ర కృప: Gopal Venkatesan

అహోబిలం

అహోబిలం

అహోబిలం ను కింద అహోబిలం, పై అహోబిలం అని రెండు భాగాలుగా చెపుతారు. పైన నరసింహుడు ఉగ్ర రూపి గాను , కింద నరసింహుడు శాంత స్వరూపిగాను ఉంటాడని చెపుతారు.

చిత్ర కృప: Gopal Venkatesan

అహోబిలం

అహోబిలం

పురాణ గాఢ మేరకు శ్రీనివాసుడు తన కళ్యాణ సమయంలో స్వయంగా వచ్చి ఉగ్ర నరసిమ్హుడిని దర్శనం చేసాడని, ఉగ్రమూర్తి ని చూసి సామాన్యులు భయపడుతున్నారని భావించి, ఆయనే స్వయంగా కొండ కింది భాగంలో శాంత నరసిమ్హుడిని ప్రతిష్టించాడని చెపుతారు.

చిత్ర కృప: Gopal Venkatesan

అహోబిలం

అహోబిలం

సాంప్రదాయం మేరకు భక్తులు ముందుగా కొండ కింది భాగంలో కల శాంత స్వరూపుడైన నరసింహ ను దర్శించి , ఆ తరువాత ఇక్కడ నుండి 8 కి. మీ. ల దూరం లో కల కొండపై కల ఉగ్ర నరసిమ్హుడిని దర్శిస్తారు.

చిత్ర కృప: Gopal Venkatesan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X