Search
  • Follow NativePlanet
Share
» »అంతా, ఎల్లోరా గుహలను చూడటానికి వెలుతున్నారా

అంతా, ఎల్లోరా గుహలను చూడటానికి వెలుతున్నారా

అజంతా, ఎల్లోరా గుహలకు సంబంధించిన కథనం.

అజంతా, ఎల్లోర గుహలు భారతీయ చరిత్రకు, సంస్కతి, సంప్రదాయాలకు నిలువుటద్దాలు. అందువల్లే అవి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అజంతా ఎల్లోరా గుహలు కొండను తొలచి నిర్మించిన గుహాలయాలు. ఇవి ఔరంగాబాద్ కు దగ్గరగా ఉన్నాయి. ఇక ఈ గుహలు యునెస్కోచేత గుర్తించబడి సంరక్షించబడుతున్నాయి. కొంతమంది ఈ గుహలను మానవ మాత్రులు నిర్మించలేరని ఆ శివుడు, లేదా ఏలియన్స్ నిర్మించాడని చెబుతారు. ఈ గుహలకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం...

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

అజంతా గుహలను రెండో శతాబ్దంలో నిర్మించారని చరిత్ర కారుల అంచనా కొన్ని గుహలు పూర్తిగా గుహాలయాలుగా రూపొందగా మరికొన్ని మాత్రం అసంపూర్తిగా ఉన్నాయి. మరికొన్ని గుహాలయాల నిర్మాణాన్ని మొదలు మాత్రం పెట్టారు.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

మరోవైపు ఎల్లోరా గుహలు 5 నుంచి 10 శతాబ్దాల మధ్య నిర్మించారు. అంటే అజంతా గుహలే పురాతనమైనవని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్లోరా గుహలను మరో మూడు ఉప గుహాలయాలుగా విభజించారు.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

అందులో ఒకటి హిందు దేవుళ్ల విగ్రహాలు ఉంటే మరో రెండింటిలో వరుసగా జైన, బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇలా అన్ని ముఖ్యమైన ధర్మాలకు సంబంధించిన విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు. అందువల్లే ఇక్కడకు అన్ని ధర్మాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

ఎల్లోర గుహలయాలు ఏర్పడినప్పటి నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే అజంత గుహల చుట్టు దట్టమైన అరణ్యప్రాంతం ఉండటం వల్ల వీటి గురించి 1819 వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. జూన్ నుంచి మార్చిమధ్యలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

అందువల్ల ఆ సమయంలో ఇక్కడకు ఎక్కవ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అదే విధంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ కూడా ఇక్కడ వాతావరణం బాగానే ఉంటుంది. అయితే వేసవి కాలంలో విపరీతమైన ఎండ ఉండటం వల్ల ఆ సమయంలో ఇక్కడకు వెళ్లక పోవడమే మంచిది.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

అజంతా గుహలు ఉదయం 9 నుంచి రాత్రి 9.30 వరకూ అజంతా గుహలను సందర్శించుకోవచ్చు. సోమవారం సెలవు. ప్రవేశరుసుం చిన్నపిల్లలకు లేదు. పెద్దలకు రూ.10. కెమరాకు రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులకు రూ.250.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

ఎల్లోరా గుహలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ వారంలో ఏడు రోజులూ సందర్శించవచ్చు. పిల్లలకు ప్రవేశ రుసుం లేదు. పెద్దలకు రూ.10 కెమరాకు రూ.25. విదేశీయులకు రూ.250. సాధారణంగా అజంతా గుహలను చూసిన వారు ఎల్లోరా గుహలను చూడకుండా వెనుతిరగరు.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

ఔరంగాబాద్ నుంచి అజంతా గుహలు 104 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎల్లో గుహలు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక ఈ రెండింటి మధ్య దూరం 100 కిలోమీటర్లు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔరంగాబాద్ చేరుకోవడానికి బస్సులు, రైళ్లు, విమానాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

ఎల్లోరా గుహల్లో మొత్తం 34 గుహాలయాలు ఉన్నాయి. వీటిలో వేటికదే ప్రత్యేకమైనది. ఇందులో 1, 2, 16 గుహాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా లేనట్లు ఇక్కడ బుద్దుడు సింహం పై గుర్చొన్నట్లు విగ్రహాన్ని చెక్కారు. అదే విధంగా బుద్ధుడు ఒక పద్మాన్ని పట్టుకొన్నట్లు చిత్రించిన పెయింటింగ్, విగ్రహాలు కూడా చూడదగినవే.

అజంతా ఎల్లోరా గుహలు

అజంతా ఎల్లోరా గుహలు

P.C: You Tube

ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎల్లోరాలోని 16వ గుహాలయం. దీనిని కైలాసనాథ దేవాలయం అని అంటారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయాన్నే ఆ పరమశివుడు లేదా ఏలియన్స్ నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయం శిఖరాలు మౌంట్ కైలాష్ ను పోలి ఉండటం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X