Search
  • Follow NativePlanet
Share
» »ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !

ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !

ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్ యుద్ధం జరిగింది.

పేరు ఎలా ?

పేరు ఎలా ?

అలీ ఘర్ ను పూర్వం లో ఇక్కడి తెగల పేరుతో కోల్ అని పిలిచేవారు. అయితే, ఇంకా ఒక రుషి లేదా రాక్షసుడి పేరు వచ్చిందని కూడా కొన్ని కధనాలు కలవు. మొగలుల రాజు ఇబ్రహీం లోడి పాలనలో కోల్ గవర్నర్ ఉమర్ కుమారుడు మహమ్మద్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. ఆ కోట నేటికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఆ కోట ఆలీఘర్ కోటగా పిలువబడుతోంది. కాలానుగుణంగా ఈ ప్రాంతం అనేక మంది రాజుల పాలనలోకి వచ్చి, అనేక పేర్లతో పిలువబడి, చివరికి అలీ ఘర్ గా మారింది.
-

విద్యా కేంద్రం

విద్యా కేంద్రం

అలీ ఘర్ ప్రధానంగా ఒక విద్యా కేంద్రం అవటమే కాక ఉత్తర భారత దేశానికి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా కూడా వుంది. ఇది తాళాలు తయారు చేసే నగరంగా పేరు కెక్కింది. ఇత్తడి వస్తువులు కూడా ఇక్కడ బాగా తయారు చేస్తారు. ఈ వస్తువులను మీరు రైల్వే రోడ్ మార్కెట్ లేదా సెంటర్ పాయింట్ మార్కెట్ లలో కొనుగోలు చేయవచ్చు.

 చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

అలీ ఘర్ కోట ప్రధాన ఆకర్షణ. అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా పేరు గాంచింది. ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన సర్ సయ్యద్ అకాడమి మ్యూజియం, చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్ మరియు హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం లు కూడా కలవు. జామా మసీద్ ఐలాండ్స్ , ఖేరేస్వర్ టెంపుల్ , జైనుల తీర్ధం మంగలయతాన్, వంటి ప్రార్ధన స్థలాలు కూడా కలవు.

ఆశ్రమాలు

ఆశ్రమాలు

సూఫీ మత ప్రవక్తలు ఇక్కడ చివరగా నివసించారు. కనుక వారి ఆశ్రమాలు ఇక్కడ కలవు. వీటిని హిందువులు, ముస్లింలు కూడా గౌరవిస్తారు. భక్తుల కోరికలను బాబా బార్చి బహదూర్ దర్గా తీరుస్తుందని నమ్ముతూ అనేకులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు.

పెద్ద లైబ్రరీ

పెద్ద లైబ్రరీ

అలీ ఘర్ లో మౌలానా ఆజాద్ లైబ్రరీ కూడా కలదు. ఇది ఆసియా లోనే రెండవ పెద్ద లైబ్రరీ గా పేరు గాంచినది.

విహార ప్రదేశాలు

విహార ప్రదేశాలు

నగరానికి దూరంగా కల శేఖా సరస్సు స్థానికులకు ఒక పిక్ నిక్ స్పాట్ గా వుంటుంది. ఇక్కడ అనేక రకాల పక్షులు వస్తాయి. అలీ ఘర్ లోని సమీప నగ్లియా లో ఒక వన్య సంరక్షణాలయం కలదు. దీనిలో అనేక అరుదైన జంతువులు చూడవచ్చు. అలీ ఘర్ లో షాపింగ్ చేయటం ఒక విభిన్న అనుభూతి. తాళాల నుండి ఇత్తడి కళా వస్తువుల వరకూ కొనుగోలు చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X