Search
  • Follow NativePlanet
Share
» »మంత్ర ముగ్థుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు చూడాలంటే ‘అలెప్పి’వెళ్ళాల్సిందే..

మంత్ర ముగ్థుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు చూడాలంటే ‘అలెప్పి’వెళ్ళాల్సిందే..

కేరళ రాష్ట్రం పర్యాటకతకు మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు, సముద

కేరళ రాష్ట్రం పర్యాటకతకు మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు, సముద్ర ప్రాంతాలు, కాలువలు, ద్వీపాలు, మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. ఏ ఒక్క ఆకర్షణా వదలదగ్గదికాదు. కేరళ రాష్ట్ర పర్యటన ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఒక ఆహ్లాదకర పర్యటన.

కేరళ పర్యాటకత ఎన్నోఆనందకర అంశాలు కలిగి ఉంది, ఇసుక దిన్నెల బీచ్ లు, ఆనందమయ బ్యాక్ వాటర్స్, పర్వత ప్రదేశాలు, వంటివి విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి లేదా ప్రశాంతతతో ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారికి లేదా శృంగార కేళిలో ఓలలాడాలనుకునే జంటలకు, బిజీ నగర జీవితాలతో సతమతమై అలసి సొలసినవారికి ఒక విశ్రాంతి సెలవుల నిలయంగా ప్రతి ఒక్క ప్రదేశం విరాజిల్లుతోంది.

కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ

కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ

కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ, కుమరకోం, తిరువల్లం, కొల్లం, కాసర్ గోడ్, మొదలైన చోట్ల కలవు. ఈ ప్రదేశాలు బ్యాక్ వాటర్ అనుభవాలకు ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతులిస్తాయి. అనేకమైన సరస్సులుతో విశ్రాంతిని అందించే ప్రశాంతమైన ప్రదేశం కావడం వల్ల అలెప్పికి ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ ' అనే పేరు సరిగ్గా సరిపోతుంది.

PC: The.chhayachitrakar

మంత్ర ముగ్థుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు

మంత్ర ముగ్థుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు

మంత్ర ముగ్థుల్ని చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, ఆకుపచ్చని తివాచీలా కనిపిచే ప్రకృతిలోని పచ్చదనం, తాటి చెట్ట మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులలో ఉన్న సృజనాత్మకతని బయటకి తీసి వారి ఊహాశక్తిలోని విభిన్న కోణాలను ఉత్తేజపరుస్తాయి. కేరళ ప్రణాలికలో మొదటి పట్టణమైన అలెప్పి జలమార్గాలలో పర్యాటకులు ప్రయాణించే సౌకర్యాలతో అందంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా రూపుదిద్దుకుంది.

హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా

హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా

అలెప్పీకి బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలములు మరియు హౌస్ బోట్లు ఉపయోగిస్తారు. హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా వీటిని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. బ్యాక్ వాటర్ రిసార్టులు కూడా ఇక్కడ కలవు. మున్నార్‌ నుండి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం.

అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి

అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి

బస్సులో వెళుతుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా కనబడుతుంది ఈ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌ బోటులు రెడీగా ఉంటాయి. మనం చెల్లించే ధరను బట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌ డెక్‌ ఉంటుంది.

PC: Reji Jacob

బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి

బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి

ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతారు. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

PC: wikimedia.org

బోట్ రేస్ :

బోట్ రేస్ :

సాంప్రదాయక స్నేక్ బోట్ రేసు ప్రతి ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం కేరళలో జరుగుతుంది. ఢేప్పిలో ప్రతి సంవత్సరం నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్‌లను నిర్వహిస్తారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది.

ఈ రేస్‌లో పాల్గొనడానికి ఎన్నో బోట్‌క్లబ్‌ల నుంచి అభ్యర్థులు

ఈ రేస్‌లో పాల్గొనడానికి ఎన్నో బోట్‌క్లబ్‌ల నుంచి అభ్యర్థులు

ఈ రేస్‌లో పాల్గొనడానికి ఎన్నో బోట్‌క్లబ్‌ల నుంచి అభ్యర్థులు వస్తుంటారు. దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, గెలుపొందిన జట్టుకి రోలింగ్ ట్రోఫీని బహూకరించే పద్ధతిని ప్రారంభించినట్లు చెబుతారు. బోటు ప్రయాణంలోని అమితమైన ఆనందాన్ని పొందిన నెహ్రూ , వారి కృషిని గుర్తించేందుకు ఈ పోటీలను ప్రారంభించారు.

 అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఈ పోటీలు

అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఈ పోటీలు

అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఈ పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది ఆగష్టు రెండోశనివారంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. జూన్, జూలైలలో నమోదయ్యే భారీ వర్షపాతాలు ముగిసిపోవడం వల్ల ఈ సమయం కేరళని సందర్శించేందుకు ఉత్తమం. దీనిని చూసి ఆనందించేందుకు అనేకమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు.

Photo Courtesy: Swetha R

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

విమాన మార్గం: కొచ్ఛి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి సుమారు 83కిలోమీటర్ల దూరంలో అలెప్పి ఉంది,అక్కడి నుండి ట్యాక్సీ లేదా కారులో ప్రయాణిస్తే రెంగు గంటల్లోపు అలెప్పి చేరుకోవచ్చు

రైలుమార్గం: కొచ్చిన్ మరియు త్రివేడ్రంకు అనుసంధానింపబడని రైల్వేస్టేషన్ అలెప్పిలో ఉంది. తర్వాత అక్కడి నుండి స్టేట్ సర్వీస్ బస్సులు , ఆటో రిక్షాలు ద్వారా మెయిన్ సిటీని చేరుకోవచ్చు.

రోడ్ మార్గం: అలెప్పి నేషనల్ హైవే 47 కనెక్ట్ చేయబడి ఉంది. ఈ రోడ్ మార్గం ద్వారా అనేక బస్సు సర్వీసులు, కొచ్చి, కొట్టాయం, త్రివేండ్రం, కోజికోడ్ , చెన్నై, బెంగళూరు మరియు కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల నుండి రెగ్యులర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరికెందుకు ఆలస్యం ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించి మంత్రముగ్థులవ్వండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X