Search
  • Follow NativePlanet
Share
» »భక్తులను అలరించే మంగళూరు దేవాలయాలు !

భక్తులను అలరించే మంగళూరు దేవాలయాలు !

మంగళూరు నగరం కర్నాటక రాష్ట్రం లో ఒక ప్రముఖ నగరం. ఇక్కడ కల ఓడరేవు కర్ణాటకలో ప్రధాన ఓడరేవు గా కూడా చెపుతారు. ఈ ప్రదేశ సంస్కృతి,చరిత్ర మరియు అనేక గ్రంధాలలో తెలిపిన వివరాలు పర్యాటకులను సంవత్సరం పొడవునా ఆకర్షిస్తూ వుంటాయి. రామాయణ కాలంలో సాక్షాత్తూ శ్రీ రాముడు ఈ నగరాన్ని పాలించాడని చెపుతారు. అదే విధంగా, మహా భారత కాలంలో పాండవులలో చిన్నవాడైన సహదేవుడు కూడా ఈ ప్రాంతాన్ని పాలించాడని చెపుతారు.

ప్రసిద్ధ నదులు నేత్రావతి, గురుపుర లోని బ్యాక్ వాటర్స్ లో కల ఈ మంగళూరు అనేక టెంపుల్స్ కలిగి వుంది. ఇక్కడ కల మంగళా దేవి టెంపుల్ మాత మంగళా దేవి పేరుతో నిర్మించారు. ఈ టెంపుల్ మంగళూరు లోని బోలారా లో కలదు.

భక్తులు, ప్రత్యేకించి దక్షిణ దేశంలోని వారు తమ తమ సుఖ సంతోషాలకు, సంపదలకు ఈ టెంపుల్ సందర్శిస్తారు. ఈ టెంపుల్ పరిసరాలలో వివాహాలు చేసుకుంటే వివాహ జీవితాలు మూడు పూవులు ఆరుకాయలుగా ఉంటుందని నమ్ముతారు. ఈ టెంపుల్ కు రోడ్ మరియు రైలు మార్గాలలో చేరవచ్చు. రైలు స్టేషన్ నగర నడిబొడ్డుకు 3 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ టెంపుల్ లో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి.

భక్తులను అలరించే మంగళూరు దేవాలయాలు!

కుదరాలి గోకర్నతీస్వర టెంపుల్
కుదరాలి లో కల గోకర్నతీశ్వర టెంపుల్ శివుడి దేవాలయం. పరిసరాలలో సాంఘిక సంస్కర్త దివా గురువు అయిన నారాయణ గురు విగ్రహం కూడా వుంటుంది. నారాయణ గురు కుల విచక్షణ అంతమొందిన్చాతంలో పేరు పొందారు. టెంపుల్ ఆవరణలో నారాయణ గురు ఆదేశానుసారం గణేశ, సుబ్రమణ్య, అన్నపూర్ణేశ్వరి, భైరవ, శనిశ్వర మరియు శ్రీ కృష్ణ విగ్రహాలను ప్రతిస్థ చేశారు. ఇక్కడ ఇంకనూ శారద మాత, నవ గ్రహాల విగ్రహాలు కూడా కలవు. టెంపుల్ లో నవ దుర్గాల పెద్ద విగ్రహాలు కలవు. వీటిని నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా పూజలు చేసి ఆరాధిస్తారు.

కద్రి మంజునాథ టెంపుల్
కద్రి లోని మంజునాథ టెంపుల్ గతంలో బౌద్ధ మత ప్రభావం కలది గాను ప్రస్తుతం ఇది ఒక హిందూ చరిత్ర కలదిగాను చెపుతారు. బౌద్ధమతం ఇక్కడ అంతరించ టం తో గుడి లోని విగ్రహాన్ని శ్రీ మంజునాధుడు గా మార్చారని చెపుతారు. ఇక్కడి ఆచార వ్యవహారాలూ బుద్ధిజం లోని వజ్రాయన కు సంబంధించిన వి గా వుంటాయి. ఈ గుడి లోని విగ్రహం దేశంలోని కంచు విగ్రహాలలో ఎంతో శ్రేష్టమైనదిగా చెపుతారు. ఇక్కడే ఒక కొలను కలదు. దీనిని గోముఖ అంటారు. టెంపుల్ లో ప్రవేసించే ముందు భక్తులు ఈ కొలనులో పుణ్య స్నానాలు ఆచరించి దేముడి ని దర్సిన్చుకొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X