Search
  • Follow NativePlanet
Share
» » శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?

శివలింగానికి మేకు వల్ల కారిన రక్తపు మరక ఇప్పటికీ పోలేదు...ఎందుకు?

మన శివుని లీలలు అపారమని చెప్పవచ్చును. అతను సర్వాంతర్యామి.అనేక వేల సంవత్సరాలనుండి ఆ పరమేశ్వరుని మహిమలను మనం వింటూ, చూస్తూ వున్నాం. శివునికి అంకితమైన దేవాలయాలు అనేకములున్నాయి.

By Venkatakarunasri

మన శివుని లీలలు అపారమని చెప్పవచ్చును. అతను సర్వాంతర్యామి.అనేక వేల సంవత్సరాలనుండి ఆ పరమేశ్వరుని మహిమలను మనం వింటూ, చూస్తూ వున్నాం. శివునికి అంకితమైన దేవాలయాలు అనేకములున్నాయి.విశేషమేమంటే ఒక్కొక్క శివాలయానికి దానికదే మహత్యాలు, మహిమలు వున్నాయి.శివుని యొక్క మహిమలను చెప్తూపోతే పదాలే చాలదు.

మన నేటివ్ ప్లానెట్ లో మీకు శివుని గురించి అనేక ఉత్సాహవంతమైన విశేషాలను ఇప్పటికే తెలుసుకున్నారు. ప్రస్తుత వ్యాసంలో ఒక మహిమాన్విత దేవాలయంలో ఒక శివలింగానికి మేకును కొట్టియున్నారు. దీని వల్ల ఆ శివలింగం నుండి వచ్చిన రక్తపుమారక ఇప్పటికీ అలాగే వుంది.ఆ విచిత్రమైన దేవాలయం ఏది? అది ఎక్కడుంది అనే విషయాలను తెలుసుకోవటానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? అట్లయితే చదవండి....

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఆ దేవాలయం ఒక మహిమాన్వితమైన శివాలయం. ఆ దేవాలయంలో వున్న శివలింగం అత్యంత శక్తివంతమైనది మరియు శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్టాపించిన లింగం అని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీ రామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్దిగాంచినది.

pc:RameshSharma

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ దేవాలయంలో వున్న శివలింగాన్ని దేవతలకు రాజైన ఇంద్రుడు ప్రతిష్టించాడని చెప్పవచ్చును.ఇది కేవలం హిందువులకే కాకుండా బౌద్ధమతస్తులకూ పవిత్రమైన స్థలం.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ అమరావతి దేవాలయంలో కోట ముఖ్యస్తులు మరియు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల శాసనాలను ఇక్కడ చూడవచ్చును. అంతే కాదు కోట యొక్క రాజైన కేతరాజు జీవించివున్నప్పటి ప్రోలినాయుడు యొక్క శాసనాలను ఒక స్థంభం మీద చూడవచ్చును.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ దేవాలయం అత్యంత భవ్యమైనది, ద్రావిడ శైలి యొక్క వాస్తు శిల్పాలతో సుసంపన్నమైనది. మేకు గ్రుచ్చుకున్న శివలింగాన్ని మనం చూస్తున్నాంకదా అనే అనుభూతికి భక్తులు గురి అవ్వటం జరుతుంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుగుభాషలో మరియు సంస్కృతభాషలోని శాసనాలను చూడవచ్చును.

Adityamadhav83

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా వుండుటవల్ల అర్చకులు ఒక పీఠమీద ఎక్కి, ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూవుంటారు.ఇక్కడి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివలింగం పైభాగంల ఎర్రనిరంగు మరక వుంది. ఆ మరకే రక్తపు మరక.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతూనే వుంది.అందువలన పెరుగుట నిలిపేందుకు సులభంగా ఒక మేకును శివలింగం తలమీద కొట్టడంజరిగింది. ఈ విధంగా చేస్తున్న క్రమంలో శివలింగంపైభాగంలో రక్తం మరక ఏర్పడింది.ఆశ్చర్యం ఏంటంటే ఆ రక్తం మరక ఇప్పటికీ అలాగే వుండటం.దీనిని భక్తులు గమనించవచ్చును.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ దేవాలయంలోని శివలింగాని దేవతలరాజైన ఇంద్రుడు ప్రతిష్టించాడని చెప్పవచ్చును.ఇక్కడున్న శివలింగం అమరలింగేశ్వర స్వామిగా పూజించబడుతున్నాడని చెప్పవచ్చును.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

రాజైన చంచూస్ భూమి యొక్క ఊచకోతకు సహాయపడవలసి వచ్చింది. అతను తరువాత మానసిక రుగ్మత కలిగి మరియు అమరావతి చేరుకున్నాడు. 1796 లో ఆయన తన మొత్తం జీవితాన్ని, సమయం మరియు ఆదాయాన్ని వెచ్చించి ఒక శివాలయాన్ని నిర్మించారని చెప్పబడింది.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

మరొక పురాణగాధ ప్రకారం తారకాసురుడు అనే రాక్షసరాజు శివుని నుంచి వరాన్ని పొంది అనంతరం దేవతలను హింసిస్తూవుండేవాడు.మహా శివుడు రాక్షసులను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు. అందువలన, దేవతలు ఈ ప్రదేశంలో నివసించటానికి అమరావతికి వచ్చారు. తరువాత శివుడు అమరేశ్వరునిగా పూజించబడ్డాడు.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

అమరావతిశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పట్టణంలోని పంచారామం క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయం కృష్ణ నది ఒడ్డున ఉంది. ఇక్కడ మహాశివుడు అమరేశ్వర స్వామి అతని భార్య అయినబాలా చాముండికా సమేతంగా వెలసియున్నాడు.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ దేవాలయం యొక్క ప్రముఖమైన ఉత్సవాలు ఏవంటే, మహాశివరాత్రి, నవరాత్రి, కళ్యాణివుత్సవాలు మొదలైనవి . ఈ పవిత్ర ఆలయం కృష్ణ నది సమీపంలో వున్నందువలన హిందూ మతానికి ప్రాముఖ్యతనిచ్చే ఒక పుణ్యక్షేత్రంగా వుంది.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఎలా వెళ్ళాలి?

ఈ అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడానికి సమీప స్థలం ఏదంటే అది గుంటూరు . ఇది గుంటూరు నుండి 40 కి.మీ.ల దూరంలో కలదు. గుంటూరు, విజయవాడ, మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

అమరేశ్వర దేవాలయం

అమరేశ్వర దేవాలయం

ఈ ఆలయం సమీపంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో స్వయం భూ లింగం, అమరావతి మ్యూజియం, గీతా మందిర్, కనక దుర్గాలయం, రామాలయం, ఓంకారేశ్వర్ మందిరం, ఆంజనేయ ఆలయం మొదలైనవి.

ఇది కూడా చదవండి:

అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!అక్కడ ఈరోజుటికీ దుర్యోధనుడే దేవుడు !!!

మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..మగవారు ఈ 5 గుళ్ళలోకి అడుగుపెడితే ఏమవుతుందంటే..

ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...ఈ ఆలయ నీడలు భూమి మీద పడకుండ మాయం చేసిన దేవుడు...బయటపడ్డ రహస్యం...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X