Search
  • Follow NativePlanet
Share
» »వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం అమరావతి, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఇవే..

వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం అమరావతి, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఇవే..

అమరేశ్వర ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ విషయాన్ని స్కంద పురాణంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించబడినది. గతంలో అమరావతిని ధాన్యకటం లేదా ధరణికోటా అని పిలబడుతున్నట్లు ప్రాచీన శాసనాల ద్వా

దక్షిణ భారతదేశంలో గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం అమరావతి. ఈ ప్రదేశంలో ఉన్న బౌద్ధరామాలు , అమరేశ్వర టెంపుల్ కారణంగా ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. స్వయంభవుగా వెలసిన లింగం కలిగిన అమరేశ్వర స్వామి ఆలయం పేరు వల్ల అమరావతిగా ప్రసిద్ది చెందినది. అమరేశ్వర ఆలయం పంచరామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ విషయాన్ని స్కంద పురాణంలో ఈ ప్రాంతం గురించి ప్రస్తావించబడినది. గతంలో అమరావతిని ధాన్యకటం లేదా ధరణికోటా అని పిలబడుతున్నట్లు ప్రాచీన శాసనాల ద్వారా తెలుస్తోంది. అమరావతిలో ఉన్న ప్రస్తుత బౌద్ధ రామాలు యొక్క అద్భుత శిల్పాలు శిధిలావస్తలో ఉన్నప్పటికీ వాటిని చూసినప్పుడు మాత్ర ఆ అద్భుతమైన నిర్మాణాల పట్ల ఆశ్చర్యం కలుగుతుంది. నానాటికి శిదిలమైపోతున్న ఈ బౌద్ధ మత అవశేషాలు ఇంకా ప్రకృతి నియంత్రణలో వుండటం మన అదృష్టం అనే చెప్పాలి!

క్రీ.పూ 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు ఆంధ్రాను పరిపాలించిన వారిలో మొదటి వారైన శాతవాహనుల సామ్రాజ్యానికి ఈ అమరావతే రాజధానిగా ఉండేది. వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలుస్తుంది. ఈ అమరావతిలోనే గౌతమబుద్దుడు కాలచక్ర ప్రక్రియను బోధించాడు. అమరావతిలో బౌద్ధుల మరియు హిందువుల ఆధ్యాత్మిక కట్టడాలకు ప్రాముఖ్యత చెందినది. అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడిన అమరావతి స్తూపం, స్మారక చిహ్నాలు, టెర్రకోట ప్రాచీనతలు , ఇంకా బుద్దుని యొక్క జీవితానికి సంబంధించిన చిత్రకల వర్ణనలు పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణలు మరియు చారిత్రక కట్టడాలున్న కారణంగా అమరావతి ఒక చక్కటి పర్యాటక ప్రదేశంగా ప్రసిద్దిచెందినది. కాబట్టి, ఇప్పుడు మనం అమరావతిలో చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

అమరావతి స్తూపం:

అమరావతి స్తూపం:

ఆంధ్రప్రదేశలోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి స్థూపం లేదా ఒక మహా చైతన్య ఒక గొప్ప ఆకర్షణ.అశోక చక్రవర్తికాలంలో ఈ స్తూపాలు ఏర్పడ్డాయి. ఈ స్థూపంపై చెక్కబడిన బుద్ధుని జీవిత చరిత్ర అతని బోధనలను అద్భుతమనే చెప్పాలి. దాదాపు 2000 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ స్తూపం సంచి స్తూపం అంత పొడుగు కలిగి ఉంటుంది. మహాస్తూపంగా కూడా ప్రసిద్ది చెందింది. చాలా మంది బౌద్ద బిక్షులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు.

అమరేశ్వర ఆలయం:

అమరేశ్వర ఆలయం:

అమరేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉంది. మహాశివుడికి అంకితం చేయబడిన ఆలయాల్లో అమరేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తున్న శివలింగం ఉంది. ప్రాణేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర, సోమేశ్వర ఇంకా పార్థివేశ్వరులనబడే అయిదు లింగాల రూపంలో మహాశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు. ద్రవిడియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన అమరావతి ఆలయానికి సంబంధించిన ఎన్నో గాధలున్నాయి

కృష్ణానది:

కృష్ణానది:

పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ప్రదేశం కృష్ణానదీ ప్రాంతం. ఇది జీవనది. ఈ నదిలో హిందువులు ప్రవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. అలాగే ప్రతి ఏటా ఈ నదీతీరంలో పుష్కరాలు కూడా జరుగుతుంటాయి.

 ధరణి కోట:

ధరణి కోట:

అమరావతి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్దమతం పరిఢవిల్లిది. బౌద్ధ మత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయంలో విశిష్ట స్థానం పొందిన ఆంధ్రపురియే ధాన్యకటకం.

మొగల్రాజపురం గుహలు

మొగల్రాజపురం గుహలు

ఈ గుహలను క్రీశ ఐదవ శతాబ్దములో నిర్మించినట్లు చెబుతాతు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహములు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహము దక్షిణ భారతదేశములో మరెక్కడా కనిపించదు.

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

కీ.శ. 7వ శతాబ్దములో నిర్మితమయిన ఈ గుహలు విజయవాడకు 8 కీ.మీ.ల దూరములో ఉన్నాయి. రెండంతస్తుల ఈ గుహారూపాలను బౌద్ధ సన్యాసులు వానా కాలములో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. పడుకున్న భంగిమలో ఉన్న "అనంతశయన విష్ణువు" యుక్క భారీ ఏకశిలా విగ్రహము ఇక్కడ ఉంది. పర్వత ముందుభాగం తొలుచుకుంటూ అద్భుతంగా గుహలు నెలకొల్పారు. పర్వతాన్ని తొలిచి నాలుగు అంతస్తులుగా ఆలయాలను నిర్మించారు. గుహాంతర్బాగాÛలలో గోడలపై చెక్కిన ప్రతిమలు చూపరుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రాతితో చెక్కిన విష్ణువు, ఆంజనేయుడు, బ్రహ్మ విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే గోడలపై తెలుగులో చెక్కిన శాసనాలు కనిపిస్తాయి. ఈ కొండ నుండి కృష్ణా నది మనోహరముగా కనిపించును. ఈ కొండపైన రాళ్ళమీద విగ్రహ ప్రతిమల మాదిరిగా చెక్కిన చిత్రాలు కూడా చూడ వచ్చు.

ప్రకాశం బ్యారేజీ..

ప్రకాశం బ్యారేజీ..

విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ ఉంది. దీని పొడవు 1,223.5 మీటర్లు. ఈ బ్యారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతాల్లో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 1832లో కృష్ణా తీరంలో కరువు వచ్చినప్పుడు నదిపై ఆనకట్ట కట్టాలనే ఆలోచన వచ్చింది. అది కార్యరూపం దాల్చడానికి ఇరవై ఏళ్ళు పట్టింది. ఈస్ట్‌ఇండియా కంపెనీ వారు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సారథ్యంలో ఛార్లెస్‌ అలెగ్జాండర్‌ పర్యవేక్షణలో నిర్మాణం సాగింది. అలా 1852లో ప్రారంభమై 1855 మే 9న పూర్తయింది. ఆనకట్ట పై నుండి వరదనీరు ప్రవహించేలా నిర్మించారు.

ఆర్కియోలాజికాల్ మ్యూజియం:

ఆర్కియోలాజికాల్ మ్యూజియం:

అమరావతిలో కృష్ణానదికి కుడివైపున ఆర్కియోలాజికాల్ మ్యూజియం ఉంది. అమరావతి చరిత్ర సంస్కృతి ఆనాటి ప్రాంత ప్రజల సంప్రదాయాలు చరిత్రకారుల విశేషాలు మొదలైన అంశాలను తెలియజేసే వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఇంకా ఇందులో అప్పటి నాణేలు, గాజులు, బోధి వృక్షం శిల్పాలు, విరిగిన కమ్మీలు మొదలైనవి చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా అతిపెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. అమరావతి కేంద్రంగా పుట్టిన కళలకు భారతీయ మత శిల్పాలు సైతం ఈ మ్యూజిలో ఉన్నాయి.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?


32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ మతం ఎలా ఏర్పడింది ? PC: google maps

విమానాశ్రయం అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X