Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత సూర్యోదయాలు...సూర్యాస్తమయాలు!

అద్భుత సూర్యోదయాలు...సూర్యాస్తమయాలు!

సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎపుడూ అద్భుతమే. అయితే ఈ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం లు ఇండియా లోని కొన్ని ప్రదేశాలలో మరింత అద్భుతంగా కనపడి ఆనందింప చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రకృతి ప్రియులు వివిధ ప్రదేశాలకు కూడా వెళ్లి చూసి ఆనందిస్తారు. ఈ రకమైన ప్రదేశాలు ఇండియా లో అనేకం కలవు. వాటిని గురించి ఇపుడు తెలుసుకుందాం.

కన్యా కుమారి

కన్యా కుమారి

తమిళనాడు రాష్ట్రం లో దక్షిణ భాగపు చివరి లో కల కన్యాకుమారి పట్టణంలో సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు మనోహరంగా వుంటాయి. ఈ ప్రాంతానికి వెళ్ళిన పర్యాటకులు వీటిని తప్పక చూసి ఆనందిస్తారు.

అలేపి

అలేపి

అలేపి ప్రదేశం కేరళ రాష్ట్రంలో కలదు. ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో సూర్యాస్తమయం సరస్సులో విహరిస్తూ చూస్తె ఎంతో బాగుంటుంది. ఫోటో క్రెడిట్ : Arian Zwegers

మంగుళూరు

మంగుళూరు

కర్నాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లో కల మంగళూరు సూర్యోదయ సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడ కల ఉల్లాల్ బ్రిడ్జి పై నుండి వీటిని చూసి ఆనందిస్తారు.

ఫోటో క్రెడిట్: Nithin Bolar k

ఆగుంబే

ఆగుంబే

ఆగుంబే ఒక సాయంకాల ప్రేమ అనే పాటలు కర్ణాటకలో చిర పరిచితం. ఇక్కడి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, ప్రేమికుల రెండు హృదయాలను ఒకటి చేసి ఆనందింప చేస్తాయి. ఇక్కడ కన్నడ సినిమా షూటింగ్ లు కూడా జరుగుతాయి.

గోవా

గోవా

పర్యాటక ప్రసిద్ధి గాంచిన గోవా, లిక్కర్, బీచ్, డాన్స్ వంటి వాటికే కాక, ప్రశాంత మనసు కోరే వారికి బీచ్ లలోని సాయంత్రాలు అద్భుతంగా వుంటాయి. ఇక్కడి సూర్యోదయ సూర్యాస్తమయాలు కన్నుల విందు చేస్తాయి.

ఫోటో క్రెడిట్: Mark Sheffield

రాన్ అఫ్ కచ్

రాన్ అఫ్ కచ్

రాన్ అఫ్ కచ్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ ప్రదేశం ఉప్పు కొతార్లకు ప్రసిద్ధి. తెల్లని ఉప్పు కొతార్ల తో ప్రదేశం అంతా మంచు పడుతోందా అనిపించేలా వుంటుంది. ఎక్కడ సూర్యస్తమయం ప్రతి ఒక్కరిని ఆనందింప చేస్తుంది. ఫోటో క్రెడిట్ : Bhargavinf

మౌంట్ అబూ

మౌంట్ అబూ

మౌంట్ అబూ రాజస్థాన్ ఎడారుల్లోని పర్వత ప్రదేశం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా వుంటాయి. ఇక్కడి సూర్యోదయ సూర్యాస్తమయాలు జీవితంలో మరువ లేని అనుభూతులుగా మిగిలిపోతాయి.

ఫోటో క్రెడిట్: T.sujatha

పుష్కర్

పుష్కర్

పుష్కర్ రాజస్తాన్ రాష్ట్రం లోని అజ్మీర్ జిలాలో కలదు. ఇక్కడ కల పుష్కర్ సరస్సు పర్యాటక ప్రసిద్ధి గాంచినది. ఈ సరస్సు నేపధ్యంగా కనపడే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎంత చూసినా తనివి తీరనివిగా వుంటాయి.

ఫోటో క్రెడిట్ : Nicholas Kenrick

ఉమియం సరస్సు, మేఘాలయ

ఉమియం సరస్సు, మేఘాలయ

సూర్య కిరణాలు పది వివిధ రంగులు చూపే ఉమియం సరస్సు సూర్యాస్తమయానికి ప్రసిద్ధి. ఈ ప్రదేశం మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నగరానికి ఉత్తరంగా 15 కి. మీ. ల దూరం లో కలదు. అందమైన ఈ సరస్సులో, అనేక జలక్రీడలు కూడా ఆచరిస్తారు.

ఫోటో క్రెడిట్: Vikramjit Kakati

తాజ్ మహల్, ఆగ్రా

తాజ్ మహల్, ఆగ్రా

ఆగ్రా నగరం లోని తాజ్ మహల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశంలో ఉదయం వేల సూర్యోదయం మరియు సాయంకాలాలు సూర్యాస్తమయాలు తప్పక చూడ దగినది.

ఫోటో క్రెడిట్ : Ekabhishek

టైగర్ హిల్, డార్జీలింగ్

టైగర్ హిల్, డార్జీలింగ్

డార్జిలింగ్ పట్టణానికి 11 కి. మీ. ల దూరంలో కల టైగర్ హిల్ అనబడే కొండ కాంచన జున్గా పర్వత శ్రేనులలోనిది. ఇక్కడ సూర్యోదయం చూడటం ఒక మరపురాని అనుభూతిగా వుంటుంది.

ఫోటో క్రెడిట్: Shizhao

తాజ్ మహల్, ఆగ్రా

తాజ్ మహల్, ఆగ్రా

ఆగ్రా నగరం లోని తాజ్ మహల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశంలో ఉదయం వేల సూర్యోదయం మరియు సాయంకాలాలు సూర్యాస్తమయాలు తప్పక చూడ దగినది.

ఫోటో క్రెడిట్ : Ekabhishek

ఆరూర్, కేరళ

ఆరూర్, కేరళ

కేరళ లోని అలపూజా జిల్లా లో కల ఒక చిన్న పట్టణం ఆరూర్. ఈ పట్టణంలోని ఒక బ్రిడ్జి పై నుండి సూర్యోదయ సూర్యాస్తమ దృశ్యాలు పర్యాటకులు అధిక సంఖ్యలో చూసి ఆనందిస్తారు.

ఫోటో క్రెడిట్ : Augustus Binu

నరసాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

నరసాపూర్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కల నరసాపూర్ పట్టణం అందమైన సూర్యోదయ, సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి.

ఫోటో క్రెడిట్:Anna Frodesiak

డిబ్రూ ఘర్, అస్సాం

డిబ్రూ ఘర్, అస్సాం

అస్సాం లోని డిబ్రూ ఘర్ సూర్యోదయ సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. డిబ్రూ ఘర్ ను భారత దేశ చాయ్ నగరం అని అంటారు. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం

ఫోటో క్రెడిట్: Iampartha

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X