Search
  • Follow NativePlanet
Share
» » విగ్రహం ఉండదు...అయినా కళ్లు మూసుకొనే నమస్కారం చెయ్యాలి లేదంటే

విగ్రహం ఉండదు...అయినా కళ్లు మూసుకొనే నమస్కారం చెయ్యాలి లేదంటే

51 శక్తిపీఠాల్లో ఒకటైన అంబాజీమాత దేవాలయానికి సంబంధించిన కథనం.

By Kishore

హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్ లో కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి ఆలయం అయితే ఉందికాని విగ్రహం ఉండదు. అదేవిధంగా అయినా కళ్లకు తెల్లని వస్త్రాలను చుట్టుకొని లేదా కళ్లను మూసుకొని అమ్మారికి భక్తితో నమస్కరించాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా జరిగితే అష్టకష్టాల పాలవుతారని స్థానికులు చాలా కాలంగా నమ్ముతున్నారు. ఇక ఈ శక్తి పీఠం దగ్గరగానే రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన మౌంట్ అబు ఉంది. అంతే కాకుండా ఈ పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కథనంలో మీ కోసం

దశ తిరగాలంటే ఈ దేవాలయాలకు వెళ్లాల్సిందేదశ తిరగాలంటే ఈ దేవాలయాలకు వెళ్లాల్సిందే

1. దాక్షాయని

1. దాక్షాయని

P.C:You Tube

దక్షయాగం సందర్భంగా దక్షాయని అవమానం పొంది ఆత్మహుతి చేసుకొంటుంది. భార్య వియోగం భరించలేని ఆ పరమశివుడు ఆమె శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండం చేస్తాడు.

2. కర్తవ్యాన్ని మిరిచి

2. కర్తవ్యాన్ని మిరిచి

P.C:You Tube

లయకారకుడైన శివుడు తన కర్తవ్యాన్ని మరిచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి అదుపుతప్పతోందని భావించిన విష్ణుమూర్తి పరాశక్తి అదేశాలను అనుసరించి ఆమె శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు.

3. 51 భాగాలుగా విడిపోయి

3. 51 భాగాలుగా విడిపోయి

P.C:You Tube

ఈ సందర్భంగా దాక్షాయని శరీరం 51 భాగాలుగా విడిపోతుంది. అందులో హ`దయం పడిన చోటే ప్రస్తుతం అంబాజీ మాత దేవాలయం వెలిసిందని చెబుతారు. గుజరాత్ లోని బనస్కంత జిల్లాలో అంబాజీ అనే పట్టణం లో ఈ దేవాలయం ఉంది.

4. విగ్రహం ఉండదు

4. విగ్రహం ఉండదు

P.C:You Tube

అయితే దేవాలయంలో ఎటువంటి విగ్రహం ఉండదు. హ`దయం అంటే మనిషి ఆలోచనలకు, అనుభూతులకు ప్రతిక అని చెబుతారు. అలోచనలకు, అనుభూతులకు ఆకారం ఉండదు.

5. బీజాక్షరాలు రాసిన ఒక యంత్రం

5. బీజాక్షరాలు రాసిన ఒక యంత్రం

P.C:You Tube

అందువల్లే ఇక్కడ దేవతకు ఎటువంటి రూపం ఉండదని దీంతో అమ్మవారికి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయలేదని స్థానిక పూజారులు చెబుతారు. విగ్రహం బదులుగా బీజాక్షరాలు రాసిన ఒక యంత్రం మాత్రం ఇక్కడ పూజలు అందుకొంటూ ఉంటుంది.

6. వస్త్రంతో కళ్లను కప్పుకొని

6. వస్త్రంతో కళ్లను కప్పుకొని

P.C:You Tube

దీనిని కూడా భక్తులు నేరుగా చూడటానికి వీలులేదు. తెల్లటి వస్త్రంతో కళ్లను కప్పుకొని ఆ దేవతను దర్శించుకోవాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇదే ఆచారాన్ని ఇక్కడ పాటిస్తున్నారు.

7. మరో కథనం ప్రకారం

7. మరో కథనం ప్రకారం

P.C:You Tube

ఇక్కడి ఆలయాన్ని నిర్మించి దాదాపు 1500 ఏళ్లు అవుతుందని చెబుతారు. ఇక ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

8. అంత:పురానికి తీసుకెళ్లాలని

8. అంత:పురానికి తీసుకెళ్లాలని

P.C:You Tube

ఆ కథను అనుసరించి ప్రస్తుతం ఉన్న దేవాలయానికి సమీపంలో గబ్బర్ అనే కొండ ఉండేది. మొదట అమ్మవారు అక్కడే వెలిసింది. అయితే స్థానిక రాజు సదరు అమ్మవారిని ఎలాగైనా తన అంత:పురానికి తీసుకెళ్లాలని భావిస్తాడు.

9. అంబాజీ మాత గురించి

9. అంబాజీ మాత గురించి

P.C:You Tube

తన కోరిక నెరవేర్చుకోవడం కోసం అంబాజీ మాతను గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చి అమ్మవారు రాజు ముందు ప్రత్యక్షమవుతుంది.

10. ఒక షరత్తు పై మాత్రం

10. ఒక షరత్తు పై మాత్రం

P.C:You Tube

రాజు గారి కోరిక మేరకు ఆయన అంత:పురంలో కొలువై ఉండటానికి అంగీకరిస్తుంది. అయితే అందుకు ఒక షరత్తు విధిస్తుంది. దాని ప్రకారం అమ్మవారు రాజు వెనకాల వస్తూ ఉంటుంది.

11. వెనక్కు తిరిగి చూడకూడదు

11. వెనక్కు తిరిగి చూడకూడదు

P.C:You Tube

అంత:పురం వచ్చేంతవరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు వెనక్కు తీరిగి చూడకూడదు. అయితే ప్రస్తుతం ఆలయం ఉన్న చోటుకు రాగానే రాజు కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిరిగి చూస్తాడు.

12. తప్పును సరిదిద్దుకొనే క్రమంలో

12. తప్పును సరిదిద్దుకొనే క్రమంలో

P.C:You Tube

దీంతో అమ్మవారు అక్కడ అద`శ్యమై పోతుంది. దీంతో రాజు తన తప్పును సరిదిద్దుకొనే క్రమంలో అక్కడే అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు.

13.గబ్బర్ కొండ పై

13.గబ్బర్ కొండ పై

P.C:You Tube

ఇక గబ్బర్ కొండ పై మనం ఇప్పటికీ అంబాజీ దేవి ఆలయానికి సంబంధించిన శిథిలాలను చూడవచ్చు. అక్కడ నిరంతరం ఒక జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

14.మౌంట్ అబుకి చాలా దగ్గర

14.మౌంట్ అబుకి చాలా దగ్గర

P.C:You Tube

ఈ ఆలయం రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మౌంట్ అబుకి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్లే మౌంట్ అబుకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అంబాజీ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

15. అనేక పర్యాటక ప్రాంతాలు

15. అనేక పర్యాటక ప్రాంతాలు

P.C:You Tube

అంబాజీ ఆలయం సమీపంలో అనేక చూడదగిన పర్యటక, పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నయి. ముఖ్యంగా గబ్బర్ హిల్స్. అంబాజీ ఆలయం మొదట ఇక్కడే ఉండేదని తంత్రచూడమణి అనే గ్రంధం వల్ల తెలుస్తుంది. ఇక్కడ తాంత్రిక పూజలు చేసేవారు ఇక్కువ మంది వస్తుంటారు.

16. ట్రెక్కింగ్

16. ట్రెక్కింగ్

P.C:You Tube

ఆరావళి పర్వత శ్రేణిలోని ఈ దేవాలయం సముద్ర మట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత శిఖరం పైకి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడానికి యువత చాలా ఆసక్తి కనబరుస్తారు.

17. కామాక్షి మందిర్

17. కామాక్షి మందిర్

P.C:You Tube

అంబాజీ దేవాలయానికి దాదాపు కిలోమీటరు దూరంలోనే కామాక్షి దేవాలయం ఉంది. ఇక్కడ శక్తిపీఠాలు ఏర్పడిన విధానం చిత్రాలు, శిల్పాల ద్వారా చెప్పిన తీరు చూడముచ్చటగా ఉంటుంది.

18. కైలాస్ హిల్ స్టేషన్

18. కైలాస్ హిల్ స్టేషన్

P.C:You Tube

అంబాజీ దేవాలయానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చిన్న గుట్ట పై కైలస్ దేవాలయం ఉంది. మెట్ల ద్వారా అక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి సూర్యాస్తమయం చూడటానికి చాలా బాగుంటుంది.

19.కోటేశ్వర్ దేవాలయం

19.కోటేశ్వర్ దేవాలయం

P.C:You Tube

అంబాజీ దేవాలయానికి 8 కిలోమీటర్ల దూరంలో అత్యంత పురాతన శివాలయం ఉంది. దీనిని కోటేశ్వర దేవాలయం అంటారు. ఇక్కడ ఒక నంది ముఖం నుంచి సరస్వతి నది పుట్టేదని చెబుతారు.

20. కుంభారియా

20. కుంభారియా

P.C:You Tube

అంబాజి దేవాలయానికి దాదాపు 1.5 కిలోమీటరు దూరంలో కుంబారియా గ్రామంలో ప్రముఖ జైన తీర్థాంకుడు నీమినాథ దేవాలయం ఉంది. ఇక్కడ శిల్ప సౌదర్యం చూడటానికి చాలా బాగుంటుంది.

21. అజయ్ దేవి దేవాలయం

21. అజయ్ దేవి దేవాలయం

P.C:You Tube

అంబాజీ దేవాలయం వెనుక వైపున ఒక పెద్ద సరోవరం ఉంది. దీనిని అంబాజీ దేవి భక్తుడైన తాపి శంకర్ క్రీస్తు శకం 1584లో నిర్మించాడు. దీని పక్కనే అంబాజి దేవి సోదరిగా బావించే అజయ్ దేవి దేవాలయం ఉంది.

22. పరిక్రమ మార్గం

22. పరిక్రమ మార్గం

P.C:You Tube

అంబాజీ దేవస్థానం నిర్వహకులు ఆలయం సమీపంలో 51 శక్తిపీఠాలకు సంబంధించిన ప్రతి రూపాలను తయారు చేశారు. భక్తులు నడుచుకొంటూ 51 శక్తిపీఠాల ప్రతి రూపాలను సందర్శించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X