Search
  • Follow NativePlanet
Share
» »మన భారతదేశంలో అమెరికన్లు కనుగొన్న మొట్టమొదటి హిల్ స్టేషన్ !

మన భారతదేశంలో అమెరికన్లు కనుగొన్న మొట్టమొదటి హిల్ స్టేషన్ !

ఊటీ తర్వాత దక్షిణ భారతదేశంలో అంతటి స్థానాన్ని ఆక్రమించుకున్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ 'కొడైకెనాల్'. కొడైకెనాల్ దాదాపుగా తమిళనాడు నడిబొడ్డున ఉందనే చెప్పాలి.

By Venkatakarunasri

తమిళనాడు రాష్ట్రంలోని పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కలిసే చోట, కేరళ సరిహద్దుకు సమీపంలో ఏకంగా రెండువేల మీటర్ల ఎత్తుకు పైగా ఉన్న అందమైన పళని కొండల్లో 'కోడై' దాగున్నది. పూర్వం ప్రాచీన గిరిజన తెగ కు తెలిసిన ఈ ప్రదేశం ... అమెరికన్ల వల్ల బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో దక్షిణ తమిళనాడు ప్రాంతంలో అమెరికన్లు, వారి ధార్మిక కేంద్రాలైన చర్చీలు, మిషనరీ లను నడిపేవారు. కానీ వారు అక్కడి వేడికి తట్టుకోలేక జబ్బులపాలై నానా అవస్థలు పడేవారు. దాంతో వారు మదురై సమీపంలో చల్లని ప్రదేశం కొరకై అన్వేషణ సాగించారు. ఫలితంగా క్రీ.శ. 1845 వ సంవత్సరంలో 'కొడైకెనాల్' ఏర్పాటైంది.

ఊటీ తర్వాత దక్షిణ భారతదేశంలో అంతటి స్థానాన్ని ఆక్రమించుకున్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ 'కొడైకెనాల్'. కొడైకెనాల్ దాదాపుగా తమిళనాడు నడిబొడ్డున ఉందనే చెప్పాలి. దిండిగల్ జిల్లా కు చెందిన ఈ హిల్ స్టేషన్ మదురై కు 120 కి.మీ. దూరంలో, పళని కి 65 కి. మీ. దూరంలో, దిండిగల్ కు 96 కి.మి. దూరంలో ఉంది.

ఈ పట్టణం యొక్క పర్వత అందాలకు, అక్కడి సుప్రసిద్ద వ్యూ పాయింట్ లకు, ప్రకృతికి ముగ్ధులైన పర్యాటకులు కొడైకెనాల్ ను 'పర్వత యువరాణి' గా అభివర్ణిస్తారు.

ఇది కూడా చదవండి: తమిళనాడు లో వేసవి చల్లని ప్రదేశాలు !

కొడైకెనాల్ హనీమూన్ జంటలకి ప్రసిద్ధి చెందినది. వారికి కావలసిందే చల్లని ప్రదేశాలు. అ ప్రదేశాల్లోనే వేడిని రగిలిస్తారు ..! ఈ ప్రాంతంలో ఉండే దట్టమైన అడవులు, ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, సరస్సులు, వ్యూ పాయింట్ లు, రాతి ప్రదేశాలు, పూల గార్డెన్ లు, పార్కులు ... మరీ ముఖ్యంగా జలపాతాలు తప్పక సందర్శించాలి. దీనితో పాటు ఈ ప్రాంతం అనేక సహస క్రీడ కార్యకలాపాలను అందిస్తున్నది. ఈ ప్రాంతంలో విహరించటానికి అనువైన స్థలాలు ఒకసారి గమనిస్తే ..

కొడైకెనాల్ హనీమూన్ జంటలకి ప్రసిద్ధి చెందినది. వారికి కావలసిందే చల్లని ప్రదేశాలు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కొడైకెనాల్ చేరుకోవటం ఎలా ?

1. కొడైకెనాల్ చేరుకోవటం ఎలా ?

రోడ్డు / బస్సు మార్గం

కొడైకెనాల్ చేరుకోవటానికి ముందు మీరు చెన్నై వెళ్ళి, అక్కడి నుండి దిండిగల్ లేదా మదురై చేరుకోవాలి. అక్కడి నుండి కొడైకెనాల్ కు సులువుగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

'కొడై రోడ్' సమీప రైల్వే స్టేషన్. అక్కడి నుండి 60 కి. మీ. ల దూరం ఘాట్ రోడ్ గుండా ప్రయాణిస్తే కొడైకెనాల్ చేరుకోవచ్చు.

విమాన మార్గం

కొడైకెనాల్ కు సమీపాన మదురై (120 కి. మీ) విమానాశ్రయం కలదు.

చిత్ర కృప : Santhosh

2. వసతి

2. వసతి

కొడైకెనాల్ ను ఎక్కవగా మే, జూన్ నెలలో సందర్శిస్తుంటారు పర్యాటకులు. అందుకని ముందుగా హోటల్ రూం బుక్ చేసుకోవడం ఉత్తమం. అన్ని తరగతుల వారికి కాటేజీలు, హోటల్ లలో గదులు అందుబాటు ధరల్లో లభిస్తాయి.

దెయ్యాల కిచెన్ ఎపుడైనా చూసారా ?

చిత్ర కృప : Darshan Simha

3. కొడై లో రుచి చూడవలసినవి

3. కొడై లో రుచి చూడవలసినవి

కొడై లో తయారయ్యే హోం మేడ్ చాక్లెట్ల రుచి తప్పక చూడాలి. ఇవి కొడైకెనాల్ లో ఎక్కడైనా లభ్యమవుతాయి. చాక్లెట్ల కోసమే ప్రతి వీధి లో షాప్స్ వెలిసింటాయి.

ఇది కూడా చదవండి: తమిళనాడులో వర్ష రుతువు పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Sen SD

4. కొడై ఇతర ఆకర్షణలు

4. కొడై ఇతర ఆకర్షణలు

కొడై కి 7 కి. మి. దూరం లో సిల్వర్ కాస్కేడ్ జలపాతం ఉంది. దాంతో పాటుగా బంబర్ , గ్లేన్, ఫెయిరీ ఫాల్స్ చూడదగినవి. సమయముంటే శేమ్బగనూర్ మ్యూజియం కూడా చూడవచ్చు.

చిత్ర కృప : *ámú*

5. గుణ గుహ

5. గుణ గుహ

రోడ్డు అంచున ఉన్న ఒక బాట వెంట 200 గజాల గుబురు చెట్ల సమూహం కనిపిస్తుంది. చెట్ల మధ్యలో నుండి కిందకు దిగుతూ వెళితే, కొండ దిగువన గుహ కనిపిస్తుంది. దానినే గుణ గుహ అంటారు. గుహలో ప్రవేశించటానికి అనుమతి ఉండదు కారణం చుట్టూ కంచె ఉంటుంది. దీనిని స్థానికులు 'దయ్యాల గుహ' గా పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి: బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

చిత్ర కృప : sowrirajan s

6. పంపార్ జలపాతం

6. పంపార్ జలపాతం

పంపార్ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి చివరన ఉంటుంది. ఎత్తుపల్లాల రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ సాగే వాగు ఇది.

ఇది కూడా చదవండి: బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

చిత్ర కృప : simianwolverine

7. కురింజి ఆండవర్ ఆలయం

7. కురింజి ఆండవర్ ఆలయం

ఆండవర్ ఆలయం బస్ స్టాండ్ కు 4 కి. మి. దూరంలో కలదు. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పుష్పించే అరుదైన కురింజి పుష్పం కలదు. ఆలయ ప్రధాన దైవం మురుగన్. దీనిని క్రీ. శ. 1936 హిందూ మాతాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ మహిళ నిర్మించింది.

చిత్ర కృప : sugavinesh1

8. గ్రీన్ వ్యాలీ వ్యూ వ్యాలీ

8. గ్రీన్ వ్యాలీ వ్యూ వ్యాలీ

గ్రీన్ వ్యాలీ వ్యూ వ్యాలీ వద్ద కోతులు అదికంగా కనిపిస్తాయి. పర్యాటకులను అవి ఎంతగానో ఆనందపరుస్తాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాలీ ని సందర్శించవచ్చు.

చిత్ర కృప : Ehsan Ahmed

9. గ్రీన్ వ్యాలీ వ్యూ

9. గ్రీన్ వ్యాలీ వ్యూ

గ్రీన్ వ్యాలీ వ్యూ 'సూసైడ్ వ్యాలీ' గా ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టం నుండి 5000 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రాంతం నుండి వైగా డ్యాం అద్భుతంగా కనిపిస్తుంది. కొడై సరస్సుకు 5 కి. మీ. ల దూరంలో ఈ వ్యాలీ కలదు.

చిత్ర కృప : chintan_aeromodeller

10. డోల్మెన్ సర్కిల్

10. డోల్మెన్ సర్కిల్

ఇదొక పురావస్తు ప్రదేశం. క్రీ.పూ. 5000 ఏళ్ళ క్రితం నాటి ఈ ప్రదేశంలో ఇత్తడి, రాగి పాత్రలు, ఆభరణాలు మొదలైనవి ప్రదర్శనకై ఉంచారు. పురావస్తు పరిశోధనల మీద ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియాన్ని తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Sarah

11. కోకర్స్ వాక్

11. కోకర్స్ వాక్

కోకర్స్ వాక్ స్థలాన్ని ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాలి. లోయ వీక్షణను, కొండవాలు వద్ద ఉండే పట్టణాలను చూసేందుకై టెలిస్కోప్ సౌకర్యం ఉన్నది. కోకర్స్ వాక్ లో ప్రవేశించటానికి టికెట్ అవసరం. మధ్యాహ్నం 2:30 గంటల ముందే ఈ స్థలాన్ని చుట్టురావటం మంచిది లేకుంటే పొగమంచు కప్పేస్తుంది.

చిత్ర కృప : Hotel RJ INN Kodaikanal

12. సాహస ప్రియులకు బైసన్ వెల్స్

12. సాహస ప్రియులకు బైసన్ వెల్స్

బైసన్ వెల్స్ 8 ఎకరాల్లో విస్తరించిన తిరోగమన బావులు. ఈ ప్రదేశం పర్వతారోహకులకు , ట్రెక్కర్లకు , పక్షి వీక్షకులకు, వన్య ప్రాణి అభిమానులకు ఆసక్తిని కలిగిస్తుంది. వీలుంటే జీప్ సఫారీ చేస్తూ ఇండియన్ బైసన్, నీలగిరి లాంగర్, థార్ మేక, కుందేళ్ళు, ఉడుతలు తదితర జంతువులను చూస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Biju Warrier

13. బేర్ షోల జలపాతాలు

13. బేర్ షోల జలపాతాలు

బేర్ షోల జలపాతాలు కొడై బస్ స్టాండ్ నుండి 3 కి. మి. దూరంలో, అభయారణ్యం అడవిలో ఉన్నది. ఈ జలపాతాలు కొడైకెనాల్ లో పొడవైనవి. ఈ ప్రాంతం ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి హనీమూన్ జంటలకు ఆకర్షణగా నిలిచింది. ఈ జలపాతాల వద్దకు ఎలుగుబంట్లు (బేర్) తరచూ నీరు త్రాగటానికి వచ్చేవని, అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చిందని స్థానికులు అంటుంటారు.

చిత్ర కృప : raghvendra yadav

14. బేరిజం సరస్సు

14. బేరిజం సరస్సు

బైసన్, జింకలు, పాములు, చిరుతలు నీరు తాగడానికి ఈ సరస్సు వద్దకు వస్తాయి, మీకు అదృష్టం ఉంటె అవి కనిపించవచ్చు. ఫైర్ టవర్, లేక్ వ్యూ, నిశ్శబ్ద లోయ, ఔషధ అడవి వంటి ప్రాంతాలు ఈ సరస్సు సమీపంలో చూడదగ్గవి.

చిత్ర కృప : C/N N/G

15. బేరిజం సరస్సు

15. బేరిజం సరస్సు

బెరిజం సరస్సు, కొడైకెనాల్ హిల్ స్టేషన్ కు 20 కిలోమీటర్ల దూరంలో, అడవి లోపల ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి అటవీ అధికారుల అనుమతి అవసరం. ప్రవేశం ఉదయం 9.30 నుండి సాయంత్రం 3 వరకు పరిమితం.

చిత్ర కృప : Bala Subramanian

16. రాక్ పిల్లర్స్ లేదా రాతి స్థంభాలు

16. రాక్ పిల్లర్స్ లేదా రాతి స్థంభాలు

రాతి స్తంభాలు కొడై లో చక్కటి వ్యూ పాయింట్. ఇది కొడై సరస్సు కు 8 కి. మి. దూరంలో ఉంటుంది. నిట్టనిలువుగా నిలబడి ఉండే మూడు గ్రానైట్ రాళ్ల వలన ఈ ప్రాంతానికి ఆపేరొచ్చింది. మబ్బుల్లో తెలియాడటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి నుండి సుందరమైన దృశ్యాలను చూడవచ్చు.

చిత్ర కృప : Ahmed Mahin Fayaz

17. సెయింట్ మేరీ చర్చి

17. సెయింట్ మేరీ చర్చి

క్రీ.శ. 1860 వ సంవత్సరంలో అమెరికన్లు ప్రార్థనల కోసం ఏర్పాటు చేసుకొన్న చర్చి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ చర్చీలో నగిషీలు చూడదగినవి.

చిత్ర కృప : RoyArrow

18. చిరుతిండ్లు

18. చిరుతిండ్లు

సరస్సు వద్ద ఆలూ చిప్స్ , తాజా క్యారెట్లు, దోసకాయలు, కారం బురుగులు మరియు అనేక రకాలైన చిరుతిండ్లు లభిస్తాయి. దాహార్తి తీర్చేందుకై సరస్సు వద్ద సురక్షిత త్రాగునీటి సదుపాయం కూడా ఉంది. కోకాకోలా, థమ్సప్ వంటి కూల్ డ్రింక్స్ తో పాటు టీ, కాఫీ లు లభ్యమవుతాయి.

చిత్ర కృప : Sudarsan Srinivasan

19. బ్రయంట్ పార్క్

19. బ్రయంట్ పార్క్

కొడై సరస్సుకు పక్కనే బ్రయంట్ పార్క్ ఉన్నది. అందమైన రంగురంగుల పూలతో నిండిన ఈ పార్క్ ఒక ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్. యూకలిప్టస్ చెట్లు, బోధి చెట్లు, నర్సరీలు, కాక్టస్ ఇక్కడి మరికొన్ని ఆకర్షణలు. పార్క్ లోకి ప్రవేశించటానికి సాధారణ రుసుం చెల్లించవలసి ఉంటుంది.

చిత్ర కృప : Challiyan

20. సైకిళ్ళు, గుర్రాల మీద రైడింగ్

20. సైకిళ్ళు, గుర్రాల మీద రైడింగ్

కొడై అంతా చుట్టిరావటానికి, ఇక్కడ సైకిళ్ళు అద్దెకు ఇస్తుంటారు. గుర్రాలు కూడా సరస్సు వద్ద అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు గురాల మీద ఎక్కి సరస్సు పూర్తిగా కానీ, సగం వరకు కానీ చుట్టిరావచ్చు. దానికీ అద్దె ఉంటుంది.

చిత్ర కృప : Srikant Kuanar

21.కొడై సరస్సులో విహారం

21.కొడై సరస్సులో విహారం

కొడై సరస్సులో విహరించటానికి సమీపంలో కొడైబోటు క్లబ్, రోయింగ్ క్లబ్ మరియు తమిళనాడు టూరిజంలు ఉన్నాయి. వీరు రో -బోట్ లను, మర బోట్ లను అద్దెకు ఇస్తారు. అద్దె 30 నుండి 150 వరకు వరకు ఉండవచ్చు. బోటింగ్ కు ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు అనుమతిస్తారు. సరస్సు వద్ద స్వెటర్లు, వెచ్చని దుస్తులను అమ్మే షాప్ లలో వెళ్లి షాపింగ్ చేయవచ్చు.

చిత్ర కృప : aroop_d

 22. కొడై సరస్సు

22. కొడై సరస్సు

కొడై సరస్సు ను అప్పటి మదురై కలెక్టర్ వేరా లెవింజ్ (క్రీ.శ.1665) తన సొంత డబ్బుతో నక్షత్ర ఆకారంలో నిర్మించాడు. ఇది 5 కి.మీ ల విస్తీర్ణం కలిగి ఉండి, బస్ స్టాండ్ కు 3 కి.మి. దూరంలో ఉంటుంది. దీని చుట్టూ నడవటానికి 45 నిమిషాలు పడుతుంది.

చిత్ర కృప : Thangaraj Kumaravel

23.యూకలిప్టస్, పైన్ చెట్లు

23.యూకలిప్టస్, పైన్ చెట్లు

ఒక మేజర్ అప్పట్లో యూకలిప్టస్ మొక్కలను తెచ్చి కోడై కొండ ప్రాంతం అంతా పాతాడట ..! అవి పెరిగి పెద్దగై ఇప్పుడు కోడై ఆకర్షణల్లో ఒకటిగా నిలిచాయి. పైన్ వృక్షాలు కూడా ఈ ప్రాంతంలో సమృద్ధిగా కానవస్తాయి. కిలోమీటర్ పైగా దట్టంగా విస్తరించిన ఈ చెట్లు, సినిమా షూటింగ్ లకు కేంద్రంగా ఉంది.

ఇది కూడా చదవండి: రొమాన్స్ ప్రదేశాల పుట్టిల్లు - తమిళనాడు !!

చిత్ర కృప : Aravind Sesagiri Raamkumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X