Search
  • Follow NativePlanet
Share
» »సిర్సి - యల్లాపూర్ మధ్య సాగే అద్భుత ప్రయాణం !!

సిర్సి - యల్లాపూర్ మధ్య సాగే అద్భుత ప్రయాణం !!

దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన జలపాతాలు మరియు పురాతన దేవాలయాలు సిర్సి లోని ప్రధాన ఆకర్షణలైతే ... యల్లాపూర్ సముద్రమట్టానికి 1774 అడుగుల ఎత్తు నుండి కిందకు పడే జలపాతాల సోయగాలతో ఆనందింపజేస్తున్నాయి.

హలో .. కాంక్రీట్ గోడలను వదిలి కాస్త ప్రకృతి అందాల వైపు తిరగండయ్యా బాబోయ్ ...! ఉదయాన్నే లేవడం, ఆఫీసు కు పోవడం, సాయంత్రం మళ్లీ తిరిగి రావడం, ఆ .. సిటీలు, బైక్ లు, కార్లు, చాట్ లు, పబ్ లు, రెస్టారెంట్లు ... ఇవే జీవితం అనుకుంటున్నారా .. ! కాస్త సెలవులు దొరికితే ప్రకృతి ప్రసాదించిన ఊర్ల వైపు ప్రయాణించండి. ఈసారి సెలవులు వస్తే తప్పక ఈ ప్రదేశాల్ని సందర్శించండి. మీరేం పోగొట్టుకుంటున్నారో .. ఏం లేదో మీకే తెలుస్తుంది. చూడటానికి ఈ ప్రదేశాలు చిన్నవే అయిన అడవులు, జలపాతాలు ఇవే ఇక్కడి ప్రధాన అందాలు. ఇంతకీ ఆ ప్రదేశాలు చెప్పలేదు కదూ..! సిర్సి, యల్లాపూర్.

ఇది కూడా చదవండి : బనవాసి - పురాతన ఆలయ పట్టణం !!

సిర్సి, యల్లాపూర్ ప్రదేశాలు రెండూ కూడా ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని జిల్లాలలో కల ప్రదేశాలు. ఈ రెండు ప్రదేశాలు ఒకదానికొకటి 42 కి. మీ. దూరంలో ఉన్నాయి. దట్టమైన పచ్చని అడవులు, ఎత్తైన జలపాతాలు మరియు పురాతన దేవాలయాలు సిర్సి లోని ప్రధాన ఆకర్షణలైతే ... యల్లాపూర్ సముద్రమట్టానికి 1774 అడుగుల ఎత్తు నుండి కిందకు పడే జలపాతాల సోయగాలతో పర్యాటకులను ఆనందింపజేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : ఘనత వహించిన జోగ్ జలపాతాలు !!

సిర్సి నుండి యల్లాపూర్ కి వెళ్లే మార్గంలో ప్రకృతి దృశ్యాలను తనివితీరా చూసి ఆస్వాదించవచ్చు. ఈ రెండు ప్రాంతాల మధ్యన విస్తరించిన దట్టమైన అడవులలో అంతులేని జీవ వైవిధ్యం కలదు. ఇక్కడి మొక్కల నుండి తీసిన రసాన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. అడవి మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కవి కెరె సరస్సును చూడాలంటే ట్రెక్కింగ్ చేయకతప్పదు. ఎన్నో ప్రకృతి అందాలను తనలో దాచుకొని అతి కొద్ది మంది పర్యాటకులను మాత్రమే ఆకర్షిస్తున్న ఈ సిర్సి, యల్లాపూర్ ప్రదేశాలను మనమూ ఒకసారి చూసేస్తే పోలా ..!!

ఇది కూడా చదవండి : సోండా - అనేక మఠాలకు పుట్టినిల్లు !!

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

మొదటగా మనము సిర్సి లోని పర్యాటక ఆకర్షణల విషయానికి వద్దాం. ఇక్కడ చూడవలసిన ఆకర్షణలలో మరికాంబ దేవాలయం ఒకటి. ఇక్కడ ఉన్న 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబ ను దర్శించేందుకు భక్తులు తరలి వస్తుంటారు.

Photo Courtesy: Suresh

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

మారికాంబ ఆలయానికి ఎదురుగా ఉన్న నటరాజ ఆలయం

Photo Courtesy: Vaibhav Desai

మరికాంబ దేవాలయం , సిర్సి

మరికాంబ దేవాలయం , సిర్సి

మారికాంబ ఆలయ జాతర సమయంలో ...

Photo Courtesy: pai_rated

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

మారికాంబ ఆలయ జాతర సమయంలో నోరూరించే తీపి వంటకాలు

Photo Courtesy: pai_rated

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

మారికాంబ ఆలయ జాతరలో నోరూరించే జాంగిరీ

Photo Courtesy: pai_rated

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ జాతర ఒక ప్రత్యేక ఆకర్షణ. రెండేళ్ళకోసారి చేసే ఈ జాతరకు లక్షలాది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వస్తారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఉన్న ఈ దేవాలయం కొండలు, అడవులు, అనేక జలపాతాలతో చుట్టుముట్టి ఉంటుంది.

Photo Courtesy: Praveen Ramavath

మహా గణపతి దేవాలయం, సిర్సి

మహా గణపతి దేవాలయం, సిర్సి

సమయం అనుకూలిస్తే ... అనుకూలిస్తే ఎందుకులే అనుకూలిస్తుంది. మారికాంబ ఆలయం పక్కనే ఉన్న మహా గణపతి ఆలయం సందర్శకులు తప్పక చూడాలి. ఇక్కడి అర్చకులు భక్తుల చేతిని, కాళ్ళను పరిశీలించి జాతకం చెబుతారు. భక్తులు వారి భవిష్యత్తు పై తమకున్న అపోహలను, సందేహాలను అడిగి మరీ నివృతి చేసుకుంటారు.

Photo Courtesy: BockoPix

లోయ, సిర్సి

లోయ, సిర్సి

సిర్సి లోని లోయ గుండా ప్రవహిస్తున్న నది

Photo Courtesy: Vishnu Menon M

గోపాల కృష్ణ దేవాలయం, సిర్సి

గోపాల కృష్ణ దేవాలయం, సిర్సి

మహా గణపతి ఆలయం, మారికాంబ ఆలయం ఉన్న చోటే గోపాల కృష్ణుని ఆలయం కూడా ఉన్నది. ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణ వాసుదేవ్ అనే స్వామీజీ 1886 లో నిర్మించారు. ఇక్కడ ప్రతి గురువారం ప్రశ్న సేవ ఉంటుంది. భక్తులు తమ ప్రశ్నలను, సందేహాలను అడిగి పరిష్కారం రాబట్టుకుంటారు. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

Photo Courtesy: Vivek Kunchinadka

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

సిర్సికి 30 కి. మీ. దూరంలో ఉన్న ఊంఛల్లి జలపాతాలను లషింగ్టన్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఊంఛల్లి జలపాతాలను అక్కడి స్ధానికులు కెప్ప జోగ్ అంటారు. ఈ జలపాతం 381 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఈ జలపాతాలను సంవత్సరంలో ఏ సమయంలోఅయినా సరే చూడవచ్చు. ఇక్కడి పరిసరాలు పచ్చటి ప్రదేశాలు, నీటితో ఎత్తైన కొండల ఎత్తు పల్లాలతో ఆహ్లాదంగా ఉంటాయి.

Photo Courtesy: Sandeep SK

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాల వద్ద ఏర్పడ్డ ఇంద్ర ధనస్సు

Photo Courtesy: Pradeep BR

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

వరద నీటితో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఊంఛల్లి జలపాతం

Photo Courtesy: Srikanth Parthasarathy

సహస్త్రలింగ, సిర్సి

సహస్త్రలింగ, సిర్సి

సిర్సీ తాలూకా లో ఉన్న షాల్మలా నది(తీరం)లో ఉన్న 1000 రాళ్ళ పై చెక్కబడి యున్న శివలింగాలు అద్భుత అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. సహస్ర లింగాలంటే కన్నడ బాషలో 1000 లింగాలని అర్ధం.

Photo Courtesy: BockoPix

సహస్త్రలింగ , సిర్సి

సహస్త్రలింగ , సిర్సి

సహస్త్ర లింగలకు కాలినడకన వెళ్లే భక్తుల కొరకు ఏర్పాటు చేసిన వంతెన

Photo Courtesy: shailesh Makwana

సహస్త్రలింగ , సిర్సి

సహస్త్రలింగ , సిర్సి

ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వందలాది భక్తులు సహస్త్రలింగానికి వస్తుంటారు. నదిలో నీళ్లు తక్కువుగా ఉంటే 1000 లింగాలనూ చూడవచ్చు.శీతాకాలంలో గానీ లేక ఎండాకాలం ప్రారంభంలో గానీ ఈ చోటికి వెడితే నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి గనుక అన్ని లింగాలనూ దర్శనం చేసుకోవచ్చు. సిర్సీ తాలుకా నుండి యల్లాపూర్ కు వెళ్లేదారిలో 17 వ కిలోమీటర్ దగ్గర ఈ స్థలం ఉన్నది.

Photo Courtesy: BockoPix

సహస్త్రలింగ , సిర్సి

సహస్త్రలింగ , సిర్సి

గడియ గడియ కు శివలింగాలకు నీళ్ళతో అభిషేకం

Photo Courtesy: Srikanth Parthasarathy

సిర్సి హోటళ్లు

సిర్సి హోటళ్లు

సిర్సి వద్ద విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన అందమైన రిసార్ట్ లు, హోటళ్లు

Photo Courtesy: BockoPix

జలపాతం, సిర్సి

జలపాతం, సిర్సి

సిర్సి వద్ద నిశ్చలంగా ప్రవహిస్తున్న ఒక జలపాతం

Photo Courtesy: Srikanth Parthasarathy

సోండా

సోండా

సిర్సి నుండి యల్లాపూర్ కి వెళ్లే దారి లో కనిపించే మరొక పర్యాటక ప్రదేశం సోండా. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది అనేక ఆలయాలకు, మఠాలకు పుట్టినిల్లు గా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంసుమారు సుమారుగా సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తున ఉన్నది.

Photo Courtesy: pushkar v

వాదిరాజ మఠం, సోండా

వాదిరాజ మఠం, సోండా

ఇక్కడ ఎన్నో మఠాలు, ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది వాదిరాజ మఠం. ఈ మఠం నలువైపులా పొడవైన కొండలు, దట్టమైన అడవులు, అందమైన పచ్చటి ప్రదేశాలు, ఒక నది ఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరువలేని అనుభూతి నిస్తుంది.

Photo Courtesy: Vaibhav Desai

ఆంజనేయ స్వామి ఆలయం, సోండా

ఆంజనేయ స్వామి ఆలయం, సోండా

సోండా లో గల ఆంజనేయ స్వామి ఆలయం

Photo Courtesy: Pranesh Vittal

స్వర్ణవల్లి మఠం, సోండా

స్వర్ణవల్లి మఠం, సోండా

పర్యాటకులు హొన్నావల్లి మఠం గా చెప్పబడే స్వర్ణవల్లి మఠాన్ని సోండా వచ్చినపుడు తప్పక సందర్శిస్తారు. ఈ మఠాన్ని శ్రీ శ్రీ భాస్కరేంద్ర సరస్వతి అద్వైత వేదాంత స్ధాపకుడు ఆది శంకరాచార్యులవారి కోరికతో స్ధాపించారు.

Photo Courtesy: pushkar v

స్వర్ణవల్లి మఠం, సోండా

స్వర్ణవల్లి మఠం, సోండా

సోండాలో శ్రీ త్రివిక్రమ దేవాలయం మరొక ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం రామ త్రివిక్రమ దేవరుకు అరసప్ప నాయక కట్టించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మూడు చక్రాల రధాన్ని చూస్తారు. గర్భగుడిలో త్రివిక్రమ విగ్రహం ఎంతో అందంగా నిలబడి ఉంటుంది. ఒక రధం మరియు దానిలో శ్రీ లక్ష్మి దేవి విగ్రహం ఈ గుడిలో ఉంటాయి.

Photo Courtesy: pushkar v

హుణసేహోండా వెంకటరమణ దేవాలయం, సోండా

హుణసేహోండా వెంకటరమణ దేవాలయం, సోండా

హుణసేహోండా వెంకటరమణ దేవాలయంలో వెంకటరమణ మూర్తి విగ్రహం ఉంటుంది. సోండాలో ఈ దేవాలయం చిన్నది. అందమైన గోడల చెక్కడాలు చూచేందుకు ప్రతిరోజూ జరిగే ప్రార్ధనలకు ఈ దేవాలయానికి పర్యాటకులు వస్తారు.

Photo Courtesy: pushkar v

ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం, సోండా

ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం, సోండా

ముత్తినకెరె సరస్సు వద్ద గల ముత్తినకెరె వెంకటరమణ దేవాలయాన్ని పర్యాటకులు తప్పక దర్శించాలి. ఈ చిన్న దేవాలయం 17వ శతాబ్దంలో నిర్మించబడి విజయనగర శైలి శిల్ప సంపద కలిగి ఉంటుంది.

Photo Courtesy: pushkar v

ముత్తినకెరె పక్షుల సంరక్షణాలయం, సోండా

ముత్తినకెరె పక్షుల సంరక్షణాలయం, సోండా

ముత్తినకెరె పక్షుల సంరక్షణాలయం సోండా గ్రామంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ శాంక్చువరి ముత్తినకెరె సరస్సు వద్ద ఉంది. వివిధ రకాల పక్షులు జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ శాంక్చువరీకి వచ్చి సంతానోత్పత్తి చర్యలు చేపట్టి వెళతాయి.

Photo Courtesy: Paneendra BA

తపోవన, సోండా

తపోవన, సోండా

పర్యాటకులు సోండా వద్ద ఉన్న తపోవనాన్ని తప్పక చూడాలి. ఈ ప్రదేశాన్ని శ్రీ వాదిరాజ స్వామి తన ధ్యానానికి వినియోగించేవారు. ఇది వాదిరాజ మఠానికి 5 కి.మీ.ల దూరంలో షలమాల నది సమీపంలో ఉంది. తపస్సుకు అనువైన స్ధలం.

Photo Courtesy: Sangy89

శివగంగ జలపాతాలు, సోండా

శివగంగ జలపాతాలు, సోండా

సోండా సందర్శించే పర్యాటకులు శివగంగ జలపాతాలు చూడవలసిందే ..! ఇవి షలమల నది నుండి పుడతాయి. ఈ జలపాతం 74 మీటర్ల ఎత్తు నుండి కిందకు ఒక లోయలో పడుతుంది. దట్టమైన అడవి ప్రదేశంలో ఉన్న ఈ జలపాతాల చెంత గణేశ్ పాల్ అనే ఒక చిన్న ద్వీపం ఉన్నది.

Photo Courtesy: Dhruv Hegde

భోజనం, సోండా

భోజనం, సోండా

సోండా పట్టణంలో సంతృప్తికరమైన భోజనం

Photo Courtesy: Geetanjali Dhar

బనవాసి

బనవాసి

బనవాసి అనే పట్టణం సిర్సి - యల్లాపూర్ మార్గంలో ఉన్నది. ఇక్కడ పర్యాటకులు అందమైన పశ్చిమ కనుమల అడవుల మధ్యలో ప్రవహిస్తున్న వార్ధా నది ఒడ్డున కల పురాతన మధుకేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గల ప్రధాన ఆకర్షణ గణేషుని విగ్రహం. ఇది సగభాగం మాత్రమే ఉంటుంది. మిగిలిన సగభాగం వారణాసి లో ఉందని భక్తుల నమ్మకం.

Photo Courtesy: Meena K

మధుకేశ్వర ఆలయం, బనవాసి

మధుకేశ్వర ఆలయం, బనవాసి

మధుకేశ్వర ఆలయాన్ని సందర్శించే భక్తులు ఐదుపడగల నాగేంద్రుని శిల్పాన్ని చూడవచ్చు. ఈ శిల్పం క్రీ. శ. 2 వ శతాబ్ధం లోనిది. జాగ్రత్తగా పరిశీలిస్తే నాగ శిల్పం పై శిలాశాశనం గమనించవచ్చు.

Photo Courtesy: Srinath Holla

యల్లాపూర్

యల్లాపూర్

ఇక యాత్రలో చివరి ప్రదేశం యల్లాపూర్ రానే వచ్చింది. ఇప్పటి వరకు చూసిన ప్రదేశాలు ఒక ఎత్తైతే ఇది మరో ఎత్తు. ఈ ప్రదేశంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన జలపాతాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన దుర్గా దేవి ఆలయం దేశంలోనే ప్రఖ్యాతి చెందినది.

Photo Courtesy: thejaskr

జేనుకల్లుగుడ్డ, యల్లాపూర్

జేనుకల్లుగుడ్డ, యల్లాపూర్

యల్లాపూర్ కి 20 కి. మీ. దూరంలో ఉన్న జేనుకల్లుగుడ్డ లో సూర్యాస్తమ సమయాన్ని వీక్షించకతప్పదు. పడమటి కనుమల్లో అందమైన సూర్యాస్తమం మరియు కొండచరియలు ఒకదాని వెనుక మరొకటి బహు సుందరంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో బెడ్తి నది అరేబియా సముద్రంలో కలవడాన్ని కూడా చూడవచ్చు .

Photo Courtesy: Pramod Venkatesha Murthy

జేనుకల్లుగుడ్డ, యల్లాపూర్

జేనుకల్లుగుడ్డ, యల్లాపూర్

యల్లాపూర్ లో వర్షపు నీటితో తడిసి ముద్దైన రాష్ట్ర రహదారి

Photo Courtesy: Ananth T E

కాళీమాత దేవాలయం, యల్లాపూర్

కాళీమాత దేవాలయం, యల్లాపూర్

యల్లాపూర్ కి 3 కి. మీ. దూరంలో ఉన్న కాళీమాత దేవాలయం రాతితో కట్టబడినది. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు కన్నడ భాషలో చెక్కిన శిలలను, శిలా శాశనాలను చూడవచ్చు. ఈ ఆలయంలో గల ఆకర్షణీయమైన శివలింగాన్ని దర్శించుకొనేందుకు భక్తులు తరచూ వస్తుంటారు.

Photo Courtesy: Imemine1

బుడుద మయమైన రోడ్డు మార్గం, యల్లాపూర్

బుడుద మయమైన రోడ్డు మార్గం, యల్లాపూర్

బుడుద మయమైన రోడ్డు మార్గం గుండా సత్తోడి జలపాతాలకు వాహనం మీద వెళుతున్న పర్యాటక బృందం

Photo Courtesy: thejaskr

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

యల్లాపూర్ కి 25 కి. మీ. దూరంలో, అనేక చిన్న చిన్న ప్రవాహాలు కలిసి ఏర్పడ్డ జలపాతాలు సత్తోడి జలపాతాలు. ఈ జలపాతాలను ఉత్తర కన్నడ వారు మిని నయాగార జలపాతాలు గా పిలుస్తుంటారు. ఈ జలపాతాలు సుమారు 50 అడుగుల ఎత్తు నుండి కిందకు దట్టమైన అడవుల మధ్యలో ప్రవహిస్తుంది. అన్నట్టు .. ఇక్కడ ఈ అడవిలో పురాతన గణేషుని గుడి ఉంది.

Photo Courtesy: kiran nalawade

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

ప్రకృతి తో మమేకమై మరింత అందంగా కనిపిస్తున్న సత్తోడి జలపాతాలు

Photo Courtesy: Hema Priyadharshini

కొడసల్లి డాం, యల్లాపూర్

కొడసల్లి డాం, యల్లాపూర్

సత్తోడి జలపాతాల ప్రవాహం చివరకు కొడసల్లి డాం తో ముగుస్తుంది. సాధారణంగా ఈ డాం కి వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్, రివర్ రాప్టింగ్, బర్డ్ వాచింగ్ వంటివి చేస్తుంటారు. కొడసల్లి డాం ని గాని, సత్తోడి జలపాతాలను కానీ చూడాలంటే నవంబర్ - ఏప్రిల్ మధ్యలో సందర్శించవచ్చు.

Photo Courtesy: Karthik Udupa

ఆన్షీ నేషనల్ పార్క్, యల్లాపూర్

ఆన్షీ నేషనల్ పార్క్, యల్లాపూర్

కలి నది మీద ఏర్పాడ్డ కొడసల్లి డాం సమీపాన గల ఆన్షీ నేషనల్ పార్క్ సుందర దృశ్యాలు

Photo Courtesy: Abhinav Mathur

కాలినడక మార్గాన

కాలినడక మార్గాన

కాలినడక మార్గాన మాగోడ్ జలపాతానికి చేరుకుంటున్న పర్యాటకులు

Photo Courtesy: thejaskr

ఫంగి

ఫంగి

కప్ ఆకారంలో గల ఫంగి

Photo Courtesy: Srikanth Parthasarathy

ఫంగి జాతి పుష్పాలు

ఫంగి జాతి పుష్పాలు

అడవిలో జలపాతానికి వెళుతున్న మార్గంలో కంటికి కనిపించే అరుదైన ఫంగి జాతి పుష్పాలు

Photo Courtesy: Srikanth Parthasarathy

యల్లాపూర్ రైతులు

యల్లాపూర్ రైతులు

పచ్చని పంట పొలాలలో యల్లాపూర్ రైతులు

Photo Courtesy: Srikanth Parthasarathy

మాగోడ్ జలపాతాలు, యల్లాపూర్

మాగోడ్ జలపాతాలు, యల్లాపూర్

యల్లాపూర్ పట్టణానికి 19 కి. మీ . దూరంలో, బెనడ్తి నది మీద ఏర్పడ్డ మాగోడ్ జలపాతాలు వచ్చి పోయే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇది 650 అడుగుల ఎత్తు నుండి రెండు దశలుగా కిందకు ప్రవహిస్తుంది. ఈ ప్రదేశ అందాలను ఆస్వాదించాలంటే వర్షాకాలం మరియు శీతాకాలం అనువైనవి.

Photo Courtesy: ShrinivasN

మాగోడ్ జలపాతాలు, యల్లాపూర్

మాగోడ్ జలపాతాలు, యల్లాపూర్

మాగోడ్ వద్ద వర్షపు నీటితో ఉధృతంగా కిందకు దూకుతున్న బెడ్తి నది

Photo Courtesy: Srikanth Parthasarathy

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

సత్తోడి వద్ద వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్న డబ్బే సాల్ జలపాతం

Photo Courtesy: Hema Priyadharshini

సీతాకోక చిలక

సీతాకోక చిలక

పచ్చని ఆకు మీద వాలిన అందమైన సీతాకోక చిలక

Photo Courtesy: Srikanth Parthasarathy

నత్తలు

నత్తలు

జలపాతానికి వెళ్లే దారిలో కనిపించే నత్తలు

Photo Courtesy: thejaskr

మగోడ్ ఆలయం

మగోడ్ ఆలయం

మగోడ్ జలపాతానికి దగ్గరిలో ఉన్న ఒక ఆలయం

Photo Courtesy: vinod-window

కవడి కెరె సరస్సు, యల్లాపూర్

కవడి కెరె సరస్సు, యల్లాపూర్

మాగోడ్ ఫాల్స్‌కి 9 కి. మీ. దూరంలో, సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కవడి కెరె సరస్సును సందర్శించే పర్యాటకులు చుట్టుప్రక్కల ఉన్న అందమైన కొండలను చూస్తూ ఆనందించవచ్చు. ఈ సరస్సు సమీపాన ఒక దుర్గామాత ఆలయం ఉన్నది. ఈ సరస్సు చుట్టూ అందమైన సీతాకోక చిలుకలు, నలుపు మరియు ఎరుపు రంగులలో ఉన్న బుల్ బుల్ పిట్టలు విహరిస్తూ పర్యాటకులను సంతోషపరుస్తాయి.

Photo Courtesy: thejaskr

బెడ్తి నది, యల్లాపూర్

బెడ్తి నది, యల్లాపూర్

అడవుల మధ్య గుండా మాన్సూన్ సీజన్ లో వర్షపు నీటితో ప్రవహిస్తున్న బెడ్తి నది

Photo Courtesy: Srikanth Parthasarathy

గ్రామ దేవతలు, యల్లాపూర్

గ్రామ దేవతలు, యల్లాపూర్

ఎల్లమ్మ మరియు కాళమ్మ గ్రామదేవతలను దర్శించుకుంటున్న యల్లాపూర్ పట్టణ ప్రజలు

Photo Courtesy: Vinuta Nayak

పాండా, యల్లాపూర్

పాండా, యల్లాపూర్

యల్లాపూర్ లో కెమరాకు కంటికి చిక్కిన పాండా

Photo Courtesy: NAGAMURTHY B

సిర్సి చేరుకోవడం ఎలా ??

సిర్సి చేరుకోవడం ఎలా ??

మీరు సిర్సి నుండి గాని లేదా యల్లాపూర్ నుండి గాని ప్రయాణం మొదలు పెట్టాలంటే ముందు ఈ రెండు ప్రదేశాలకు ఎలా చేరుకోవాలో చూద్దాం ..!విమాన ప్రయాణం

సిర్సి పట్టణానికి సమీపాన 109 కి.మీ. ల దూరంలో ఉన్న హుబ్లీ విమానాశ్రయం , దేశంలోని నగరాలచే కలపబడింది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సిర్సికి 418 కి.మీ. దూరంలో ఉంది. ఇది దేశంలోని ప్రధాన నగరాలకు విదేశాలకు విమానాలు నడుపుతుంది.

రైలు ప్రయాణం

సిర్సికి రైలు స్టేషన్ లేదు. 61 కి.మీ. దూరంలో ఉన్న కుంటా రైలు స్టేషన్ సమీప రైలు జంక్షన్. ఇక్కడి నుండి గోవా, మంగుళూరు, పనాజి లకు రైళ్ళు నడుస్తాయి. కుంటా చేరిన వెంటనే అక్కడి నుండి సిర్సికి టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు.

రోడ్డు ప్రయాణం

ప్రధాన ఉత్తర కన్నడ నగరాలు అయిన షిమోగా, ధార్వాడ్, ఉడిపిల నుండి సిర్సికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఎన్నో బస్సులను నడుపుతోంది. బస్ ప్రయాణం ఎంతో తేలికగా, సౌకర్యంగా ఉంటుంది.

Photo Courtesy: Lily Monster

యల్లాపూర్ చేరుకోవడం ఎలా ??

యల్లాపూర్ చేరుకోవడం ఎలా ??

విమాన మార్గం

యల్లాపూర్ కి సమీపాన 73 కి. మీ. దూరంలో హుబ్లీ దేశీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి దేశంలోని ఇతర నగరాలకు ప్రయాణించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణీకులు యల్లాపూర్ కి 194 కి. మీ. దూరంలో ఉన్న గోవా లోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించవచ్చు.


రైలు మార్గం

యల్లాపూర్ కు రైలు స్టేషన్ లేదు. యల్లాపూర్ కు 71 కి.మీ. ల దూరంలో హుబ్లీ రైలు స్టేషన్ కలదు. హుబ్లీనుండి దేశంలోని ప్రధాన నగరాలు అంటే మంగుళూరు, బెంగుళూరు వంటి వాటికి తరచుగా రైలు సర్వీసులు కలవు. హుబ్లీనుండి యల్లాపూర్ చేరాలంటే యాత్రికులకు ఎయిర్ కండిషన్ టాక్సీలు, క్యాబ్ లు లభిస్తాయి.

రోడ్డు మార్గం

యల్లాపూర్ పట్టణం రోడ్డు మార్గంలో దేశంలోని ప్రధాన నగరాలకు బస్ సౌకర్యం కలిగి ఉంది. బస్ సర్వీసులు తరచుగాను, సౌకర్యవంతంగాను, చవకగాను కూడా ఉంటాయి.

Photo Courtesy: Sivashankar A

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X