Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా 'తిరు', 'పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో 'తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, 'పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం 'గౌరవనీయుడైన పతి' అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు.

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిగురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలేవుంటుంది. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతీదినం లక్షనుండి 2లక్షలవరకూ భక్తులు సందర్శిస్తూవుంటారు. ప్రత్యేకదినాలలో 5లక్షలమంది వరకూ దర్శనంచేస్తూవుంటారు. తిరుమలతిరుపతి ఆ ఏడుకొండల పేరువింటేనే ఆ భక్తజనులఒళ్ళు పులకరిస్తుంది.భక్తి ఆవగిస్తుంది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ఇక శ్రీవారి గుడిలో ఒక పిల్లి అనుచారంగా నివసిస్తూవస్తోంది.మామూలుగా శ్రీవారి ఆలయం బంగారువాకిలి తలుపులు తెల్లవారి 3గంలకు సుప్రభాతసేవాసమయంలో అర్చకులచేతిలో తెరవబడతాయి.ఆ సమయంలో బంగారువాకిలిలోపలికి అర్చకులు, జియంగర్ స్వామి, ఏకాంగిలతో పాటుగా సన్నిధిగొల్ల అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తాడు.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

కాని అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక పిల్లి వీరితో పాటుగా బంగారువాకిలిలోకి ప్రవేశిస్తుంది.ఇది శ్రీవారిలీల మాత్రమే కానీ మరియొకటిగాదట.ఈ పిల్లి సుమారుగా 100సంల నుండి శ్రీవారి గర్భాలయంలో వున్నట్లుతెలుస్తుంది మామూలుగా రాత్రి ఏకాంతసమయంలో తలుపులు మూసి వేస్తారు.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ఆ సమయంలో బ్రహ్మాదిదేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి.ఇక ఆ సమయంలో గర్భాలయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలఎవరూవుండకూడదు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.ఆశ్చర్యకరంగా ఈ పిల్లికూడా ఈ నిబంధలను క్రమం తప్పకుండా పాటిస్తుంది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ఆ తరువాత సుప్రభాతసమయంలోనే అర్చకులతోపాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది.ఈ పిల్లి శ్రీవారికి నివేదించినతరువాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది. అది కూడా అర్చకులు పిల్లిచేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లికోసం పెట్టినప్పుడుమాత్రమే అది స్వీకరిస్తుంది.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

అలాగే రాత్రి ఏకాంతసేవ సమయంలో శ్రీవారికి నివేదించబడిన పాలు,అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది.శ్రీవారికి నివేదించబడిన ప్రసాదాన్ని ఏదీ స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే.మరొక విషయంఏంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే మరో పిల్లి ఆ స్థానంలో మరో పిల్లి శ్రీవారికి కైంకర్యం చేయటానికి సిద్ధంగా వుంటుంది. ఈ విధంగా శ్రీవారు మనుష్యులతోపాటుగా జంతువులను కూడా కటాక్షిస్తూవుంటారు.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

సరైన సమయం

సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.

pc:youtube

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

శ్రీవారి సేవలో పిల్లి

శ్రీవారి సేవలో పిల్లి

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X