Search
  • Follow NativePlanet
Share
» »1300 సంవత్సరాలుగా నీటిపైనే తేలుతూ భారీ విష్ణుమూర్తి విగ్రహం మిస్టరీ !

1300 సంవత్సరాలుగా నీటిపైనే తేలుతూ భారీ విష్ణుమూర్తి విగ్రహం మిస్టరీ !

ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్టని,అంతు చిక్కని ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి.

By Venkatakarunasri

ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్టని,అంతు చిక్కని ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి.నేటికీ వైజ్ఞానికశాస్త్రవేత్తలకుకూడా ఒక సవాల్ గా నిలుస్తున్నాయి.సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించామని గొప్పలుపోతున్న నేటి మానవుడికినాటి కాలం నాటి అద్భుతాలు చిక్కు వీడని ప్రశ్నలులాగే మిగిలిపోతున్నాయి. ఎన్నో వేల సంల క్రిందనిర్మించిన ఆలయాలు నేటికీ సైంటిఫిక్ గా తేల్చలేని ఎన్నో రహస్యాలను కలిగియున్నాయి. కొన్ని ఆలయాలలో విగ్రహనిర్మాణం, మరి కొన్ని ఆలయాలలో ఆ నిర్మాణమే అనేది ఎంతో అద్భుతంగా అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి.మరి అలాంటి ఆలయాల గురించి తెలుసుకుందాం.

బుద్ధ నీలకంఠ ఆలయం

బుద్ధ నీలకంఠ ఆలయం

ఈ పేరు విని ఇదేదో బుద్ధుని ఆలయం అనుకుంటే పొరపాటే. అది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణు ఆలయం. మరి బుద్ధ నీలకంఠ అనగా పురాతన నీలపురంగు కలిగిన విగ్రహమూర్తి అని అర్ధం. ఇది హిమాలయాలలో వుంది.

PC:youtube

5మీ ల పొడవు

5మీ ల పొడవు

ఈ ఆలయంలోని శ్రీ మహా విష్ణువు ఆదిశేషునిపైన శయనించివున్న మూర్తిగా మనకు దర్శనం ఇస్తాడు.ఇక ఈ విగ్రహ మూర్తి 5మీ ల పొడవు కలిగివుంటుంది. సహజంగా విష్ణుమూర్తి మనకు శాయన మూర్తిగా దర్శనం ఇస్తాడు.

PC:youtube

యోగ నిద్ర

యోగ నిద్ర

కానీ ఇక్కడ మాత్రం వెల్లకిలాపడుకుని యోగ నిద్రలో దర్శనమిస్తాడు స్వామి. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇంత భారీవిగ్రహం అనేది నీటిలో తెలుతూవుంటుంది. భక్తులతోపాటు వైజ్ఞానిక వేత్తలు, పరిశోధకులకు ఎంతో ఆకర్షించి 1957లో ఈ విగ్రహం జరిపిన పరిశోధనలో అధ్యయనంలో కనుగొన్నది తెలుసుకుని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

PC:youtube

పరిశోధనలు

పరిశోధనలు

దాదాపు 1300 సం ల ముందునుండే ఈ విగ్రహమూర్తిఅనేది నీటిలో తేలియాడుతూ వుంది.మరి ఇంత బరువైన భారీ విగ్రహం నీటిలో తేలియాడటం వెనకవున్న రహస్యాన్ని భక్తులు ఆ స్వామి యొక్క మహిమగా దైవశక్తిగా నమ్మితే,పరిశోధకులుమాత్రం ఈ విగ్రహం ఇలా ఎందుకు నీటిపై తేలియాడుతూందని పరిశోధనలు చేసారు.

PC:youtube

రహస్యం

రహస్యం

అయితే వీరు ఆ విగ్రహమూర్తి అలా తేలటానికి వెనకనున్న రహస్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇది అని కనిపెట్టలేకపోయారు.ఈ విగ్రహమూర్తిని గురించి అక్కడ స్థానికులలో బలమైన నమ్మకం, కథనం ఒకటి వుంది.

PC:youtube

అద్భుతం

అద్భుతం

పూర్వం ఒక రైతు ఒక పొలంలో దున్నుతూ వుండగా ఒక చోటికి రాగానే నాగలి ఆగిపోతుంది.ఇక అక్కడ నాగలి దిగిన ప్రాంతంలో రక్తం అనేది బయటికివస్తుందంట. మరి రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని త్రవ్వి చూస్తే కనిపించినదృశ్యానికి అక్కడి వారు ఎంతో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అలాగే వుండిపోయారు.

PC:youtube

7 వ శతాబ్ధం

7 వ శతాబ్ధం

తర్వాత అక్కడి వారి సహకారంతో ఆ విగ్రహమూర్తిని వెలికి తీసి ఇక్కడున్న ప్రాంతానికి తరలించారని,అయితే మరి యొక కధనం ప్రకారం 7 వ శతాబ్దచక్రవర్తి విష్ణుగుప్తునిప్రాంతంలో విచ్చేరి వంశీయుల రాజు ఈ విగ్రహమూర్తిని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్టించాడనిచెప్తారు.

PC:youtube

ఎన్నో వందల సంలు

ఎన్నో వందల సంలు

అయితే ఈ విగ్రహం అనేది ఎన్నో వందల సంలుగా శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమలలో ఎలాఅయితే పూజలు, అభిషేకాలు అందుకుంటూన్నాడో అలాగే పూజలు,అభిషేకాలు నిర్వహిస్తున్న రోజురోజుకీ తన సహజత్వాన్ని ఆకర్షణని కోల్పోకుండా దానియొక్క వన్నె అనేది పెరుగుతూనే వుంది.

PC:youtube

శాస్త్రవేత్తల పరిశోధనలు

శాస్త్రవేత్తల పరిశోధనలు

ఈ విగ్రహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు భూమిలోని లావాలాంటి పదార్ధంతో సిలికాన్ సంబంధితమైన తక్కువ సాంద్రతకలిగిన శిలతో ఈ విగ్రహ మూర్తిని మలచారు అని 1641నుండి 1674మధ్య రాజు ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే చనిపోతాను అని అనేవారు.దాని వెనకవున్న కారణాలు ఏంటో తెలిసిరాలేదు కానీ నమ్మకం ప్రకారం ఆ వంశంలోని వారెవ్వరూ మాత్రం ఈ విగ్రహమూర్తిని దర్శించుకునే ధైర్యంచేయలేదు.

PC:youtube

విగ్రహం యొక్క మహత్యం

విగ్రహం యొక్క మహత్యం

ఈ ఆలయంలోనికి,ఆలయం దరిదాపుల లోకి రావటానికి కూడా భయపడేవారట.దాని వెనకరహస్యమేంటి?ఆ విగ్రహం యొక్క మహత్యంఏంటి?అనేది మాత్రం తెలిసిరాలేదు.మరి ఈఆలయంలో కార్తీకమాసం 11 వ రోజు అంటే ఏకాదశిరోజు పండుగ జరుపుతారు.

PC:youtube

శేషతల్పపాన్పుపై శయన ముద్ర

శేషతల్పపాన్పుపై శయన ముద్ర

ఈ పండుగ ముఖ్యవుద్దేశంనిద్రపోతున్న ఆ శ్రీమహావిష్ణువును మేల్కొలపటం ఈ పండుగలో అశేషజనం పాల్గొని ఆ స్వామిని ప్రార్ధిస్తారు.ఈ ఆలయంలో స్వామివారు శేషతల్పపాన్పుపై శయన ముద్రలో శతాబ్దాలుగా నీటిలో తేలిఆడుతూ వుండటం మాత్రం పరిశోధకులకు ఒక ఆశ్చర్యాన్ని గొలిపే విషయంగానే వుంది.

PC:youtube

మిస్టరీ

మిస్టరీ

మరి అంతటి భారీవిగ్రహం అన్ని సంలుగా నీటిపై తేలియాడుతూ వుండటం మాత్రం మిస్టరీ మాత్రం అలాగే వుండిపోయింది.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X